శనివారం, జనవరి 31, 2015

అమ్మాయే సన్నగ...

ఖుషి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఖుషి (2001) సంగీతం : మణిశర్మ సాహిత్యం : చంద్రబోస్ గానం : ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు ఈ...

శుక్రవారం, జనవరి 30, 2015

పదిమందిలో పాట పాడినా..

ఆనందనిలయమ్ చిత్రం కోసమ్ పెండ్యాల గారు స్వరపరచిన ఒక చక్కని ఆరుద్ర రచనను ఈరోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : ఆనంద నిలయం (1971) సంగీతం : పెండ్యాల సాహిత్యం : ఆరుద్ర గానం : ఘంటసాల పదిమందిలో పాటపాడినా.. అది అంకితమెవరో ఒకరికే విరితోటలో పూలెన్ని పూసినా గుడికి చేరేది నూటికి ఒకటే పదిమందిలో పాటపాడినా అది అంకితమెవరో ఒకరికే   గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే.. గోపాలునికెంతమంది...

గురువారం, జనవరి 29, 2015

సందెపొద్దులకాడ...

ఇళయరాజా గారి స్వరకల్పనలో వేటూరి గారు రచించిన ఒక అందమైన పాట, అప్పటి కుర్రకారును ఊపేసిన పాట ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : అభిలాష (1983) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టె కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో సందెపొద్దులకాడ...

బుధవారం, జనవరి 28, 2015

ఊహలేవో రేగే...

గుడ్ ఓల్డ్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అంతం చిత్రంలోని ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : అంతం (1992)సంగీతం : ఆర్.డి. బర్మన్, మణిశర్మసాహిత్యం : సిరివెన్నెలగానం : మనో, కవితాకృష్ణమూర్తి హే...ఊహలేవో రేగే..ఊహలేవోరేగే ఊపుతోననులాగేవేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగేఆదుకోవా అయిన దాన్నేగా  హో పూలతీగై ఊగే లేతసైగేలాగేహాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగేఅందుకోవా...

మంగళవారం, జనవరి 27, 2015

ఈ వేళ నాలో...

మూగనోము చిత్రంలోని ఒక అందమైన పాట ఈరోజు తలచుకుందాం... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : మూగనోము (1969)సంగీతం : ఆర్. గోవర్ధన్సాహిత్యం : దాశరథిగానం : ఘంటసాల, సుశీలఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులుఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు  నీలోని ఆశలన్నీ నా కోసమే... నా పిలుపే నీలో వలపులై విరిసెలేనీలోని ఆశలన్నీ నా కోసమే... నా పిలుపే నీలో వలపులై విరిసెలేనీ...

సోమవారం, జనవరి 26, 2015

భారత మాతకు జేజేలు...

మిత్రులందరకూ భారత రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. రామారావు గారి సినిమాలలో ఆయన గెటప్ పరంగా నాకు బాగా నచ్చే సినిమా బడిపంతులు. అందులోని ఒక చక్కని దేశభక్తి గీతాన్ని నేడు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : బడి పంతులు (1972)సంగీతం : కె.వి. మహదేవన్సాహిత్యం : ఆచార్య ఆత్రేయగానం : ఘంటసాల, బృందంభారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలుభారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల...

ఆదివారం, జనవరి 25, 2015

సంధ్యా రాగపు సరిగమలో...

ఇళయరాజా గారి పాటలలో నాకు ఇష్టమైన పాట, కమల్ విజయశాంతిల పై అందంగా చిత్రీకరించిన పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఇంద్రుడు-చంద్రుడు (1989) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో డో రే మీ రాగాల జోరేమీ దా సా దా నా ప్రేమ నీమీద శృతికలిసిన సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు...

శనివారం, జనవరి 24, 2015

హాయిగా ఆలుమగలై...

మాంగల్య బలం చిత్రంకోసం మాస్టర్ వేణు స్వరసారధ్యంలో శ్రీశ్రీ గారు రచించిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మాంగల్య బలం (1958)సంగీతం : మాస్టర్ వేణు సాహిత్యం : శ్రీశ్రీగానం : సుశీల, సరోజిని  హాయిగా ఆలుమగలై కాలం గడపాలిహాయిగా ఆలుమగలై కాలం గడపాలివేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలిహాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలిసతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలిఅనుదినము అత్త...

శుక్రవారం, జనవరి 23, 2015

కనులను తాకే ఓ కల...

మనం చిత్రం కోసం అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మనం (2014)  సంగీతం : అనూప్ రూబెన్స్  సాహిత్యం : వనమాలి గానం : అజిత్ సింగ్ టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటిఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలానన్నే మార్చెనా నువ్వయ్యేలాఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలానీ నవ్వులే నేడిలాఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నానీ ప్రేమే నే కోరుకున్నా..నీలో...

గురువారం, జనవరి 22, 2015

అమ్మంటే మెరిసే మేఘం..

ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలోని ఒక చక్కని అమ్మపాటను ఈరోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ముగ్గురు మొనగాళ్ళు (1994) సంగీతం : విద్యాసాగర్ సాహిత్యం : వేటూరి గానం : బాలు, చిత్ర ఓ..ఓఓ ఓ..ఓఓ ఓ..ఓఓ  ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ అమ్మంటే మెరిసే మేఘం..మ్మ్..మ్మ్.మ్మ్ నాన్నంటే నీలాకాశం..మ్మ్..మ్మ్.మ్మ్ అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా నాన్నంటే నీలాకాశం తల వంచేనా నూరేళ్ళ ఆశాదీపం...

బుధవారం, జనవరి 21, 2015

తళతళా మిలమిలా...

అన్నపూర్ణ చిత్రం కోసం సుసర్ల దక్షిణామూర్తి గారి స్వర సారధ్యంలో సుశీల గారు గానం చేసిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అన్నపూర్ణ (1960) సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి సాహిత్యం : ఆరుద్ర గానం : సుశీల ఆ... ఆ... ఆ... తళతళా... మిలమిలా ... తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా... ఆ... ఎందువలన ఓ లలనా ఎందువలన ? ఎందువలన ఓ లలనా ఎందువలన ?? తళతళా...ఆ.. మిలమిలా ...ఊ..ఊ.....

మంగళవారం, జనవరి 20, 2015

నీలగిరి చల్లనా...

నాకు రేడియో పరిచయం చేసిన పాటలలో ఇదీ ఒకటి. చక్రవర్తి గారి సంగీతం సింపుల్ గా ఒక చక్కని రిథమ్ తో సాగిపోతుంది, అలాగే వాణీజయరాం గారి స్వరం ఒక వింత అందాన్నిచ్చింది. నాకు ఇష్టమైన ఈ పాటను మీరూ వినండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : జీవితంలో వసంతం (1977) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : వేటూరి గానం : బాలు, వాణీ జయరాం నీలగిరి చల్లన నీ వడి వెచ్చన నీలగిరి చల్లన నీ వడి వెచ్చన నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు...

సోమవారం, జనవరి 19, 2015

ఇది మౌనగీతం...

ఆషా భోంస్లే గారు తెలుగులో పాడిన మొదటి పాట ఇది. చిన్నపుడు రేడియోలో వింటూ తన స్వరంలో తెలుగు నాజూకుగా స్టైల్ గా పలకడం చాలా ఆసక్తిగా గమనించేవాడ్ని. సత్యం గారి సంగీతం వీనుల విందుగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పాలు నీళ్ళు (1981)  సంగీతం : సత్యం  సాహిత్యం : దాసరి  గానం : ఆషాభోంస్లే  ఆఆఆఆఅ..ఆఆఆఆఆ... ఇది మౌనగీతం ఒక మూగరాగం  పాడింది పెల్లుబికి కళ్యాణి...

ఆదివారం, జనవరి 18, 2015

పయనించే మన వలపుల...

బావామరదళ్ళు చిత్రం కోసం పెండ్యాల గారు స్వరపరచిన ఒక చక్కని పాటను నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : బావమరదళ్ళు (1960)సంగీతం : పెండ్యాలసాహిత్యం : ఆరుద్రగానం : ఘంటసాల, సుశీలపయనించే మన వలపుల బంగరు నావశయనించవె హాయిగా జీవనతార...నా జీవనతార..ఆ..ఆపయనించే...ఊ...ఊ...ఊ..ఊ..ఊ..నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో....నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలోచెలరేగే అలల మీద ఊయలలూగి...  పయనించే...

శనివారం, జనవరి 17, 2015

ప్రియా ప్రియా చంపొద్దే...

అందీ అందకుండా ఊరిస్తూన్న అందమైన ప్రేయసిని ఆమె అందాలతో తనని చంపోద్దని ఆ ప్రియుడు ఎలా వేడుకుంటున్నాడో మీరే చూడండి. జీన్స్ చిత్రం కోసం రెహ్మాన్ తొలినాళ్లలో కంపోజ్ చేసిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జీన్స్ (1998) సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్ గానం : శ్రీనివాస్ ఆహా.హా.ఆఆ..ఆఆఅ... ఆహా.హా.ఆఆ..ఆఆఅ... ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ...

శుక్రవారం, జనవరి 16, 2015

మహారాజ రాజశ్రీ...

హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు, రంగవల్లులు, బంధు మిత్రులూ, ఆటపాటలూ, పిండి వంటలూ ఇతరత్రాలతో ఎంతో సందడిగా ముచ్చటగా మూడురోజులు జరుపుకునే సంక్రాంతి పండుగ చివరి రోజుకు వచ్చేసింది. ఈరోజు సంక్రాంతి సందడులలో ఒకరైన గంగిరెద్దులవాళ్ళను చూడగానే గుర్తొచ్చే ఓ చక్కని పాటను తలచుకుందామా. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అక్కినేని గారు ఎంతో హుందాగా ఈ పాత్రను పోషించారు. నాకెంతో ఇష్టమైన ఈ పాట చూసీ వినీ మీరుకూడా ఆనందించండి. ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు, ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు....

గురువారం, జనవరి 15, 2015

భ‌జే భాజే...

మిత్రులందరకూ సంక్రాంతి శుభాకాంక్షలు. పిండివంటల ఘుమ ఘుమలు, కొత్త బట్టల రెపరెపలు, కుటుంబ సభ్యులు బంధుమిత్రుల కోలాహలం నడుమ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొంటున్నారని తలుస్తాను. కొత్త సంవత్సరాన సంక్రాంతికి విడుదలైన మల్టీ స్టారర్ గోపాల గోపాల సినిమాలోని ఓ చక్కని కన్నయ్య పాటను ఈ సందర్బంగా తలచుకుందాం. సాక్షాత్ కన్నయ్యే భువికి దిగివచ్చి భక్తులతో పరాచికమాడినట్లుగా అనంత శ్రీరాం రాసిన ఈ పాట నాకు బాగా నచ్చింది, మీరూ వినండి. ఈ పోస్ట్ లో ఎంబెడ్ చేసినది ఈ పాట వీడియో...

బుధవారం, జనవరి 14, 2015

విందువా వీనుల విందుగా...

మిత్రులందరకూ భోగి పండుగ శుభాకాంక్షలు. ఉదయమే చలిమంటలు వేసి పిల్లలకు భోగిపళ్ళు పోశారా.. ఈ రోజు ధనుర్మాసపు చివరి రోజు గోదాకళ్యాణమైన పుణ్యదినం. నేటితో ఈ బ్లాగ్ లో కన్నయ్య పాటల సిరీస్ కు స్వస్తి. ఈ సందర్బంగా మొల్ల కు గోదా దేవి కళ్యాణం గురించి చెప్పినప్పటి సందర్బంలోని ఈ పాట తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : కథానాయిక మొల్ల (1970) సంగీతం : ఎస్.పి.కోదండపాణి సాహిత్యం : దేవులపల్లి గానం...

మంగళవారం, జనవరి 13, 2015

జీవితమే కృష్ణ సంగీతము...

సుసర్ల దక్షిణామూర్తి వారి స్వర సారధ్యంలో బాలమురళీ కృష్ణ గారు గానం చేసిన ఈ వేటూరి రచన శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటుంది. బాలమురళి గారి గళం విని మైమరచిపోని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మొదట్లో వచ్చే మురళీనాదమే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నాకు ఇష్టమైన ఈ పాట మీరు కూడా విని ఆనందించండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీమద్విరాటపర్వము (1979) సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి సాహిత్యం : వేటూరి గానం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆఆఅ...ఆఆ...ఆఆఆ... జీవితమే...

సోమవారం, జనవరి 12, 2015

పాడవేల రాధికా...

ఎస్. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీలమ్మ గానం చేసిన మరో అమృత గుళిక ఈరోజు మనందరి కోసం. ఈ పాట రెండవ చరణంలో శ్రీశ్రీ గారు అంత్యప్రాసలతో ఆకట్టుకుంటారు. ఇక సాలూరి వారి స్వరరచన సంధ్యవేళ పిల్లతెమ్మెరలా తాకుతుంది. సాక్షాత్ గోపాలుడే ఈ రాధిక గానానికి పరవశించి బృందావని వీడి వచ్చేస్తాడేమో అనిపిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఇద్దరు మిత్రులు (1961) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం...

ఆదివారం, జనవరి 11, 2015

విన్నారా.. అలనాటి వేణుగానం...

రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో ఘంటసాలగారు సుశీలగారు గానం చేసిన ఆరుద్ర వారి రచన ఈ రోజు గుర్తుచేసుకుందాం. ఒక సాంఘీక చిత్రంలో హీరో తత్వాన్ని కృష్ణ తత్వంతో పోలుస్తూ రాసిన ఈపాట చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : దేవుడు చేసిన మనుషులు (1973) సంగీతం : రమేశ్ నాయుడు సాహిత్యం : ఆరుద్ర గానం : ఘంటసాల, సుశీల మరల రేపల్లెవాడలో.. మురళి మోగె మోడువారిన హృదయాలు పూయసాగె.. విన్నారా..  విన్నారా.. అలనాటి వేణుగానం...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.