బుధవారం, డిసెంబర్ 31, 2014

ఎందుకీ సందెగాలి...

ఈ 2014 సంవత్సరాన్ని దేవులపల్లి వారి "నీలమోహనా రారా" పాటతో స్వాగతించాం... మరి వీడ్కోలు కూడా దేవులపల్లి వారి పాటతోనే చెబుదామా. అనుకోకుండా ఈపాట సెలక్ట్ చేస్తే దేవులపల్లి వారే కాక సుశీలమ్మా, మహదేవన్ గారు కూడా తోడు రావడం యాదృచ్ఛికంగా భలే కుదిరింది. "ఉండమ్మా బొట్టుపెడతా" చిత్రంలోని ఈ పాట వినడానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చిత్రీకరణ కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా...

మంగళవారం, డిసెంబర్ 30, 2014

దోబూచులాటేలరా...

వారిద్దరూ తొలిచూపులోనే ప్రేమలోపడ్డారు ఒకరి మనస్సంతా మరొకరు నిండిపోయారు కానీ చొరవ చూపాల్సిన ప్రియుడు తటపటాయిస్తూ దొంగచాటుగా చూస్తూ నిలబడ్డాడు. పాపం ప్రియురాలికిక తప్పలేదు మరి తనే చొరవ తీసుకుని ఈ పాటతో ఆ గోపాలుడిని ఎలా పిలిచిందో మీరే చూడండి. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ దర్శకుడుగా తెరకెక్కించిన 'ప్రియురాలు పిలిచింది' చిత్రంలోని ఈ పాట వినడానికి ఎంత బాగుంటుందో చిత్రీకరణ కూడా అంతే బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్...

సోమవారం, డిసెంబర్ 29, 2014

నను పాలింపగ...

తన భక్తుడి కోసం సాక్షాత్ గోపాలుడే దిగివస్తే ఆ భక్తుడి ఆనందం ఎలా ఉంటుందో ఊహించగలరా... ఇదిగో బుద్దిమంతుడు సినిమాలోని ఈ పాట చూస్తే అతని ఆనందాతిశయాలు మనకి చక్కగా అర్ధమవుతాయి. మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : బుద్ధిమంతుడు (1969) సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : దాశరధి గానం : ఘంటసాల వేయి వేణువులు మ్రోగేవేళా... ఆ... ఆ... హాయి వెల్లువై పొంగేవేళా... రాస కేళిలో తేలే వేళా... రాధమ్మను...

ఆదివారం, డిసెంబర్ 28, 2014

లీలా కృష్ణా నీ లీలలు...

మహామంత్రి తిమ్మరసు చిత్రం కోసం పెండ్యాల గారి స్వర సారధ్యంలో ఎస్.వరలక్ష్మి గారు గానం చేసిన పింగళి గారి రచన ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : మహామంత్రి తిమ్మరుసు (1962) సంగీతం : పెండ్యాల సాహిత్యం : పింగళి గానం : ఎస్. వరలక్ష్మి లీలా కృష్ణా నీ లీలలు  నే లీలగనైనా తెలియనుగా... తెలిసి తెలియని బేలల కడ  నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ లీలా కృష్ణా నీ లీలలు  నే లీలగనైనా తెలియనుగా వేణు...

శనివారం, డిసెంబర్ 27, 2014

వేణుగాన సమ్మోహనం...

విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వరాభిషేకం సినిమా కోసం విద్యాసాగర్ గారు స్వరపరచిన ఒక కమ్మని కన్నయ్య పాటను ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : స్వరాభిషేకం(2004) సంగీతం : విద్యా సాగర్ రచన : వేటూరి గాత్రం : రాధిక, శంకర్ మహదేవన్, కోరస్ కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం...

శుక్రవారం, డిసెంబర్ 26, 2014

జయ కృష్ణా ముకుందా మురారి...

ఈ పాట పొయిన సంవత్సరం ధనుర్మాసపు పాటలలో ఎలా మిస్ అయిందో గుర్తులేదు.. ఇది తెలియని తెలుగువారుండరేమో కదా.. ఇపుడు కొత్తగా పరిచయం చేసే దుస్సాహసం నేను చేయబోవట్లేదు. ఈ అందమైన పాటను మరో మారు వినీ చూసీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీ పాండురంగ మహత్యం (1957)సంగీతం : టి.వి. రాజుసాహిత్యం : సముద్రాల (సీనియర్)గానం : ఘంటసాలహే... కృష్ణా.... ముకుందా.... మురారీ....జయ కృష్ణా... ముకుందా......

గురువారం, డిసెంబర్ 25, 2014

జగములనేలే గోపాలుడే...

సాక్షాత్ గోపాలుడినే తన సిగలో పూవుగా బంధీ చేయాలని ప్రయత్నించే సత్యభామ ప్రేమకు తగినట్లుగా మాయా లీలా వినోదుడు ఎలా బాసలు చేస్తున్నాడో చూశారా. శ్రీకృష్ణావతారం చిత్రంలోని ఓ చక్కని పాటలోనిదీ సన్నివేశం సినారే గారి మాటల్లో ఆ సన్నివేశాన్ని మనమూ తిలకించి ఆలకించి ఆనందిద్దాం రండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : శ్రీ కృష్ణావతారం (1967) సంగీతం : టివి.రాజు రచన : సి.నారాయణరెడ్డి గానం : సుశీల, ఘంటసాల మెరుగు చామన ఛాయ మేని సొంపుల...

బుధవారం, డిసెంబర్ 24, 2014

ఓ మహాత్మా.. ఓ మహర్షి..

చిత్రసీమకు అద్భుతమైన నటులను పరిచయం చేసినా, కథను నమ్మి సినిమా తీయాలన్నా, శక్తివంతమైన పాత్రలతో స్త్రీమూర్తి లోని విశ్వరూపాన్ని దర్శింప జేయాలన్నా, సముద్రాన్ని జీవితంలో ఎమోషన్స్ తో కలిపి అత్యంత అందంగా చూపించాలన్నా, మధ్య తరగతి భావోద్వేగాలను హృద్యంగా తెరకెక్కించాలన్నా అది కె.బాలచందర్ గారికే సాధ్యం. మరపు రాని చిత్రాల రూపంలో ఇలలో చిరస్థాయిగా నిలిచి ఉండే ఓ మహాత్మా.. ఓ మహార్షీ.. మీకిదే మా నివాళి...  చిత్రం : ఆకలి రాజ్యం (1981) సంగీతం : ఎమ్మెస్...

మంగళవారం, డిసెంబర్ 23, 2014

గోరువంక వాలగానే గోపురానికి...

గాండీవం సినిమా కోసం కీరవాణి గారి స్వరసారధ్యంలో వేటూరి గారు రచించిన ఈ చక్కని పాట నాకు చాలా ఇష్టం. టీవీ లో ఎప్పుడు వేసినా అక్కినేని, మోహన్ లాల్ ల కోసం ఈ పాట మిస్ అవకుండా చూసేవాడ్ని. వేటూరి గారి అందమైన తెలుగు పదాలను ఒక పక్క బాలు చక్కగా పాడుతుంటే శ్రీకుమార్ కాస్త వైవిధ్యంగా పలికారు. కానీ ఆ మళయాళీ యాస ఒక పరిమళాన్ని అద్దడంతో పాట అందంగా ఉండటమే కాక మోహన్ లాల్ గారికి సరిగ్గా సరిపోయింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు....

సోమవారం, డిసెంబర్ 22, 2014

పిల్లనగ్రోవి పిలుపు...

శ్రీకృష్ణ విజయం సినిమాలోని ఒక కమ్మని కన్నయ్య పాటను ఈరోజు తలచుకొందామా. పెండ్యాల గారి స్వరసారధ్యంలో హాయిగా సాగే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం, మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1970)సంగీతం : పెండ్యాలసాహిత్యం : సినారెగానం : ఘంటసాల, సుశీలపిల్లనగ్రోవి పిలుపు...  మెలమెల్లన రేపెను వలపుమమతను దాచిన మనసు..  ఒక మాధవునికే తెలుసు..ఈ మాధవునికే తెలుసు  సుందరి...

ఆదివారం, డిసెంబర్ 21, 2014

మధురానగరిలో చల్లనమ్మబోదు...

నల్లనయ్య ఎంతటి అల్లరివాడో మనకి తెలియనిదేముంది... పాపం ఈ గోపికమ్మ అవస్థ చూడండి. ఈమె కోసం దారి కాచిన కన్నయ్య తను మాపటి వేళకు వస్తానన్నా మాట వినకుండా కొంగు పట్టుకుని కొసరి కొసరి సరసమాడుతున్నాడు. మిగిలిన గోపకాంతలు వస్తారు దారి విడువమని ఎలా వేడుకుంటోందో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడా వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : త్యాగయ్య (1981) సంగీతం : కె.వి.మహదేవన్  సాహిత్యం : చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై గానం...

శనివారం, డిసెంబర్ 20, 2014

గోకుల కృష్ణా గోపాల కృష్ణా...

ఇది నాకు చాలా ఇష్టమైన పాట. కృష్ణుని విభిన్న తత్వాలను నాయికా నాయకులతో చెప్పిస్తూ సిరివెన్నెల గారు రాసిన లిరిక్స్, దానికి కోటి గారి సంగీతం, అలాగే బాలు చిత్రలు గానం చేసిన తీరు అన్నీ అద్భుతమే. నేను తరచుగా వినే ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : గోకులంలో సీత (1997) సంగీతం : కోటి సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, చిత్ర ఘల్లు ఘల్లుమను మువ్వ సవ్వడుల ముద్దు...

శుక్రవారం, డిసెంబర్ 19, 2014

నగుమోము చూపించవా గోపాలా...

సాలూరి వారి స్వర సారధ్యంలో సుశీలమ్మ గానం చేసిన ఓ చక్కని పాటను నేడు తలచుకుందాం... ఈ గోపికమ్మకు గోపాలుడు తన నగుమోమును చూపించటం లేదట ఎందుకలా ఉడికిస్తున్నావంటూ ఎలా నిలదీస్తోందో చూడండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అమరశిల్పి జక్కన (1964)సంగీతం : ఎస్.రాజేశ్వరరావు సాహిత్యం : సినారెగానం : సుశీలనగుమోము చూపించవా గోపాలానగుమోము చూపించవా గోపాలామగువల మనసుల ఉడికింతువేలానగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆఎదుట…...

గురువారం, డిసెంబర్ 18, 2014

మాయదారి కృష్ణయ్యా...

మిస్టర్ పెళ్ళాం సినిమాకోసం కీరవాణి గారు స్వరపరిచిన ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందాం. సాహిత్యం సినిమాలోని సన్నివేశానికి ఆపాదిస్తూ కాస్త తమాషాగా కోలాటం స్టైల్లో హమ్ చేసుకునేట్లుగా బాగుంటుంది ఈపాట. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మిస్టర్ పెళ్ళాం(1993) సంగీతం : కీరవాణి  సాహిత్యం : ఆరుద్ర  గానం : బాలు, కోరస్ ఆ.. మాయదారి కృష్ణయ్యా ఎంతటివాడో ఓరయ్యో..  ఆ.. నాటకాల బూటకాల నీటుకాడు...

బుధవారం, డిసెంబర్ 17, 2014

హే కృష్ణా.. మళ్ళీ నీవే జన్మిస్తే..

ఎమ్మెస్ విశ్వనాధం గారి స్వర సారధ్యంలో వాణీజయరాం గారు గానం చేసిన ఈ మధురమైన గీతాన్ని ఈరోజు తలచుకుందాం. తన జీవితాన్ని కృష్ణునికి అంకితం చేసి, శ్రీకృష్ణ తత్వాన్ని తన కథలో పొదువుకున్న ఈపాట వీనుల విందుగా ఉంటుంది. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మొరటోడు (1977) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : సినారె గానం : వాణీ జయరాం హే కృష్ణా....ఆ....హే కృష్ణా...ఆ.. కృష్ణా...ఆ....హే కృష్ణా....ఆ... మళ్ళీ...

మంగళవారం, డిసెంబర్ 16, 2014

గోపికమ్మా చాలును లేమ్మా...

ఈ రోజు నుండీ ధనుర్మాసం ప్రారంభమైంది కదండీ మరి ఈ నెలరోజులూ తనివితీరా రోజు కొక్కటిగా ఆ కన్నయ్య పాటలను తలచుకుందామా. ముందుగా చాలా రోజుల తర్వాత సిరివెన్నెల గారు సింగిల్ కార్డ్ లిరిసిస్ట్ గా పని చేసిన చిత్రం "ముకుంద" లోని ఈ పాటను తలచుకుందాం. గోపికమ్మని నిద్దురలేపే సంధర్బం కూడా సరిగ్గా సరిపోయింది కదా. చిత్ర గారి స్వరంలో సిరివెన్నెల గారి సాహిత్యం దానిని డామినేట్ చేయకుండా లిరిక్స్ ని విననించే మిక్కీ జె. మేయర్ సంగీతం వెరసి ఒక ఆహ్లాద కరమైన అనుభూతిని మనసొంతం...

సోమవారం, డిసెంబర్ 15, 2014

నీ రూపమే...

అన్నదమ్ముల సవాల్ చిత్రం కోసం సత్యం గారి సంగీత సారధ్యంలో సినారె గారు రచించిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అన్నదమ్ముల సవాల్ (1978) సంగీతం : సత్యం  సాహిత్యం : సినారె గానం: బాలు, సుశీల నీ రూపమే..ఏ..ఏ.. నా మదిలోన తొలి దీపమే..మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో..  ఇది అపురూపమే..నీ రూపమే...ఏ..ఏ... నా మదిలోన తొలి దీపమే..మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో.. ఇది...

ఆదివారం, డిసెంబర్ 14, 2014

సిరిమల్లె పువ్వల్లె నవ్వు...

కమర్షియల్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు గారు తీసిన ఒక చక్కని చిత్రం జ్యోతి లోని ఈ పాట చాలా బాగుంటుంది. సగంపాట నవ్వుతోనే లాగించేసినా జానకి గారు ఈ పాటతో మన మనసుపై వేసే ముద్ర మామూలుది కాదు. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరు కూడా ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జ్యోతి (1976) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : బాలు, జానకి సిరిమల్లె పువ్వల్లె నవ్వు హ్హ...హ్హ..హ్హ సిరిమల్లె...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.