ఆదివారం, ఏప్రిల్ 28, 2019

చిన్ని చిన్ని పువ్వే...

శంకర్ గురు చిత్రంలోని ఒక పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. తమిళ మాతృక ఏసుదాసు గారి గళంలో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : శంకర్ గురు (1988)
సంగీతం : చంద్రబోస్
సాహిత్యం : సాహితి / కృష్ణతేజ
గానం : రాము/సాకేత్/ఉషా/విజిత

చిన్ని చిన్ని పువ్వే
నీవే నాకు ప్రాణం
చిన్ని చిన్ని పువ్వే
నీవే నాకు ప్రాణం
తోడూ నీడా నీవెనమ్మా
నా సర్వస్వం నీవే
కన్నులలో నిండావే
నీ తలపే ప్రతినిముషం
మనసులోన నీరూపం
పంచేనే సంతోషం
ఓఓ...ఓహోహో..

చిన్ని చిన్ని పువ్వే
నీవే నాకు ప్రాణం
తోడువు నీవేనమ్మా
నా సర్వం నీవేనమ్మా

నీ నవ్వులు పూలల్లే
విరబూసే అందాలు
మా ఇద్దరి వరముగనే
దేవుడు మాకె ఇచ్చే
సాక్షాత్తూ మహలక్ష్మే
మా ఇంటా పుట్టిందే
ఏడేడూ జన్మలకూ
నువ్వే మా సిరివమ్మా
అందాలొలికే పుత్తడి
బొమ్మవు నీవే మా తల్లీ
మమతలు విరిసే ప్రేమను
పంచే పూదోటే ఇది

చిన్ని చిన్ని పువ్వే
నీవే నాకు ప్రాణం
తోడువు నీవేనమ్మా
నా సర్వం నీవేనమ్మా

కనుమరుగై తిరిగావో
నాకు నిదుర రాదమ్మా
నీ మాటలు వినకుండా
రోజు నాకు గడవదమ్మా
నువ్వే నా ఊపిరివై
నాలోనా నిండావే
నెలవంకే ఇలకే దిగెనె
నా తల్లి రూపంలో
ప్రకృతిలోనీ అందాలన్నీ
నీలో నిండెనే
నా లాలించేటి బంగరు
తల్లివి నీవేనోయమ్మా

చిన్ని చిన్ని పువ్వే
నీవే నాకు ప్రాణం
తోడూ మీరే కాదా
నా సర్వం మీరే కాదా
కన్నులలో నిండావే
నీ తలపే ప్రతినిముషం
మనసులోన నీరూపం
పంచేనే సంతోషం
ఓఓ...ఓహోహో..

చిన్ని చిన్ని పువ్వే
నీవే నాకు ప్రాణం
తోడూ నీడా నీవే
నా సర్వస్వం నీవే

2 comments:

షామిలి లా కాదు..శాలిని యెప్పుడూ బావుందని పిస్తుంది..

నాకు శాలిని పెద్దయ్యాకే బావుందనిపిస్తుందండీ.. అది కూడా మణిరత్నం చేతిలో పడడం వల్ల అయుండచ్చు. ఎనీవేస్ థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.