శుక్రవారం, ఏప్రిల్ 12, 2019

ఓ జాబిలీ...

రంగూన్ రౌడీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రంగూన్ రౌడీ (1979)
సంగీతం : జే. వి. రాఘవులు
సాహిత్యం : వేటూరి
గానం : సుశీల

ఓ జాబిలీ ..వెన్నెలా ఆకాశం .. ఉన్నదే నీకోసం
ఓ జాబిలీ ..వెన్నెలా ఆకాశం .. ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది..నిదుర కాచింది..కలువ నీకోసమే..
వెలుగువై రావోయీ..వెలుతురే తేవోయీ..

ఓ జాబిలీ ..వెన్నెలా ఆకాశం .. ఉన్నదే నీకోసం !
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..


నువ్వు లేక నవ్వలేక ఎందరున్నా ఎవరూ లేక
జంటగా నీ తోడులేక ఒంటిగా నేనుండలేను
స్నేహ దీపాలూ...
స్నేహ దీపాలు వెలగనీ చాలు.. చీకటే లేదోయీ..
వెలుగువై రావోయీ..వెలుతురే తేవోయీ..

ఓ జాబిలీ ..వెన్నెలా ఆకాశం .. ఉన్నదే నీకోసం !
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..


గువ్వలాగా నువ్వురాగా గూడు నవ్వే గుండె నవ్వే
వేకువల్లే నీవు రాగా చీకటంతా చెదిరిపోయే
తుడిచి కన్నీళ్ళూ...
తుడిచి కన్నీళ్ళు కలిసి నూరేళ్ళు 
జతగా వుందామోయీ
వెలుగువే నీవోయీ వెలుతురే కావోయి

ఓ జాబిలీ ..వెన్నెలాకాశం .. ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం ..
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం .. 


2 comments:

ఓ సాతిరే..బ్యూటిఫుల్ ట్యూన్..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.