కొడుకు దిద్దిన కాపురం చిత్రంలోని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కొడుకు దిద్దిన కాపురం (1989)
సంగీతం : రాజ్-కోటి 
సాహిత్యం : వేటూరి  
గానం : చిత్ర  
ఓం నమ.. నటరాజుకే నమ.. 
ఓం నమ.. నటభారతీ నమ.. 
ఓం... 
నింగీ నేల గాలీ వాన 
వెలుగు నీడా బ్రతుకులో
ఓం నమ.. ఓం నమ.. 
నింగీ నేల గాలీ వాన 
వెలుగు నీడా బ్రతుకులో
ఆడి పాడే ఈడే మెరుపురా 
అడుగే పిడుగై రగిలే 
ఈ చలాకి వయస్సులో
ఓం నమ.. నటరాజుకే నమ.. 
ఓం నమ.. నటభారతీ నమ.. 
తారే వెలిగెనురా ఇలలో కలలో పగలే  
నాతో నడిచెనురా లయలో 
ఓం నమ ఓం నమ
తారే వెలిగెనురా ఇలలో కలలో పగలే  
నాతో నడిచెనురా లయలో 
ఊపిరికే నిప్పులతో ఉప్పెన వచ్చెనురా
మాటలకే మల్లెలలో తేనెలు 
పొంగిన వెల్లువ తెచ్చెనురా 
ఓం నమ.. నటరాజుకే నమ.. 
ఓం నమ.. నటభారతీ నమ.. 
పాదం కదిలెనురా పదమై నడకై నటనై 
వేగం పెరిగెనురా వడిలో 
ఓం నమ ఓం నమ 
పాదం కదిలెనురా పదమై నడకై నటనై 
వేగం పెరిగెనురా వడిలో 
చూపులతో జాబిలికే నిచ్చెన వేయకురా 
నవ్వులనే పువ్వులతో వెన్నెల
వంతెన వేయక తప్పదురా
ఓం నమ.. నటరాజుకే నమ.. 
ఓం నమ.. నటభారతీ నమ.. 
నింగీ నేల గాలీ వాన 
వెలుగు నీడా బ్రతుకులో
ఆడి పాడే ఈడే మెరుపురా 
అడుగే పిడుగై రగిలే 
ఈ చలాకి వయస్సులో
ఓం నమ.. నటరాజుకే నమ.. 
ఓం నమ.. నటభారతీ నమ.. 
 


 
 



 
 
2 comments:
ఇప్పడి మహేష్ బాబే ఈ అబ్బాయి అంటే..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.