
బావామరదళ్ళు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : బావామరదళ్ళు ( 1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : జానకి
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాటా వినిపించునే వేళ
నీలి మేఘాలలో
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారీ
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారీ
అపురూపమై నిలచే నా అంతరంగాన
నీలి మేఘాలలో...