సోమవారం, ఫిబ్రవరి 11, 2019

విరిసే ఘుంఘుం...

మా బాబు చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మా బాబు (1960)
సంగీతం : టి.చలపతి రావు
సాహిత్యం : సముద్రాల జూనియర్
గానం : జమునారాణి

విరిసే ఘుంఘుం సుమబాటే
కదిలే ఝుంఝుం మని తేటీ
మనసే తెలిసీ జతగా కలిసీ
మనసే తెలిసీ జతగా కలిసీ
సరసాలాడే సమయం ఇదే

విరిసే ఘుంఘుం సుమబాటే
కదిలే ఝుంఝుం మని తేటీ

చెలి నీ సొగసే తన కోరీ
పిలిచే పిలిచే నిను చేరీ
అనురాగముతో నయగారముతో
అనురాగముతో నయగారముతో
కలిసీ ఆడే సమయం ఇదే

విరిసే ఘుంఘుం సుమబాటే
కదిలే ఝుంఝుం మని తేటీ

చెయి జారిన క్షణమిక రాదూ
బైరాగికి భోగమె చేదూ
చెయి జారిన క్షణమిక రాదూ
బైరాగికి భోగమె చేదూ
వయసన్నది మసుకు లేదు
భయమెందుకు చెలి పులి కాదూ
అనురాగముతో నయగారముతో
అనురాగముతో నయగారముతో
కలిసీ ఆడే సమయం ఇదే

విరిసే ఘుంఘుం సుమబాటే
కదిలే ఝుంఝుం మని తేటీ
మనసే తెలిసీ జతగా కలిసీ
మనసే తెలిసీ జతగా కలిసీ
సరసాలాడే సమయం ఇదే

విరిసే ఘుంఘుం సుమబాటే
కదిలే ఝుంఝుం మని తేటీ


2 comments:

పిక్ చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉందండి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.