శనివారం, జనవరి 19, 2019

తందానే తందానే...

వినయ విధేయ రామ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వినయ విధేయ రామ (2019)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : ఎంఎల్‌ఆర్ కార్తికేయన్

తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే

తందానే తందానే
తందానే తందానే
కన్నారా ఎవరైనా
ప్రతిరోజూ పండగనే

ఏ తియ్యదనం
మనసుపడి రాసిందో
ఎంతో అందంగా
ఈ తలరాతలనే
ఏ చిరునవ్వు
రుణపడుతూ గీసిందో
తనకే రూపంగా
ఈ బొమ్మలనే

తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే

తందానే తందానే
తందానే తందానే
కన్నారా ఎవరైనా
ప్రతిరోజూ పండగనే

ఒక చేతిలోని గీతలే
ఒక తీరుగా కలిసుండవే
ఒక వేలి ముద్రలో పోలికే
మరొక వేలిలో కనిపించదే

ఎక్కడ పుట్టినవాళ్లో
ఏ దిక్కున మొదలైనోళ్లో
ఒక గుండెకు చప్పుడు
అయ్యారుగా
ఏ నింగిన గాలిపటాలో
ఏ తోటన విరిసిన పూలో
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా

తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే

తందానే తందానే
తందానే తందానే
కన్నారా ఎవరైనా
ప్రతిరోజూ పండగనే

ఈ ఇంటిలోన ఇరుకుండదే
ప్రతి మనసులోన చోటుందిలే
ఈ నడకకెపుడూ అలుపుండదే
గెలిపించు అడుగే తోడుందిలే
విడివిడిగా వీళ్లు పదాలే
ఒకటయ్యిన వాక్యమల్లే
ఒక తియ్యటి అర్థం చెప్పారుగా
విడివిడిగా వీళ్లు స్వరాలే
కలగలిపిన రాగమల్లే
ఒక కమ్మని పాటై నిలిచారుగా

తందానే తందానే
తందానే తందానే
చూశారా ఏ చోటైనా
ఇంతానందాన్నే

తందానే తందానే
తందానే తందానే
బంధాల గ్రంథాలయమే
ఉంది ఈ ఇంట్లోనే


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.