ఆదివారం, జనవరి 06, 2019

హే కృష్ణా.. మళ్ళీ నీవే జన్మిస్తే...

మొరటోడు చిత్రంకోసం వాణీజయరాం గారు గానం చేసిన ఓ మధురమైన గీతాన్ని ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మొరటోడు (1977)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : సినారె
గానం : వాణీ జయరాం

హే కృష్ణా....ఆ....హే కృష్ణా...ఆ..
కృష్ణా...ఆ....హే కృష్ణా....ఆ...
మళ్ళీ నీవే జన్మిస్తే...
నీ భగవద్గీతే నిజమైతే...
హే కృష్ణా....ఆ...
మళ్ళీ నీవే జన్మిస్తే...
నీ భగవద్గీతే నిజమైతే...
ప్రతి సుమవనమూ బృందావనమూ...
ప్రతి సుమవనమూ బృందావనమూ...
ప్రతి మూగమోవీ... మోహనమురళి

కృష్ణా....ఆ...
మళ్ళీ నీవే జన్మిస్తే...
నీ భగవద్గీతే నిజమైతే...

నీవు నేను వేరు కాదు...
ఇద్దరు ఊరు వేరు కాదు
నీవు నేను వేరు కాదు...
మన ఇద్దరి ఊరు వేరు కాదూ...ఊ..ఊ..
ఆడేది పాడేది నేను కాదు...
నా ఆటలో పాటలో...
నీ లయ లేక పోలేదు...
ఆడేది పాడేది నేను కాదు...
నా ఆటలో పాటలో...
నీ లయ లేక పోలేదు...
అందరి చూపు నా పైనా...
మరి నా చూపేమో నీ పైనా...

కృష్ణా....మళ్ళీ నీవే జన్మిస్తే...
నీ భగవద్గీతే నిజమైతే....

గోవులు కాస్తు నీవుంటావు...
జీవిక సాగిస్తూ ఉంటావు
గోవులు కాస్తూ నీవుంటావు...
నీ జీవిక సాగిస్తు ఉంటావు...ఊ...ఊ...
పలికించు నీ వేణు గీతానికీ...
ఫలితము ఎన్నడూ కోరుకోవులే నీవు
పలికించు నీ వేణు గీతానికి...
ఫలితము ఎన్నడూ కోరుకోవులే నీవు
నీ కథలోనా నేనున్నాను...
నీ కథలోనా నేనున్నాను...
నా కథలోనా నీవున్నావు

కృష్ణా....మళ్ళీ నీవే జన్మిస్తే...
నీ భగవద్గీతే నిజమైతే...


2 comments:

ఈ పాట ఈ మూవీ లోదా..

అవును శాంతి గారూ బొత్తిగా సంబంధంలేనట్లుంది కదండీ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.