సోమవారం, నవంబర్ 19, 2018

ఈ నదిలా నా హృదయం...

చక్రవాకం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :  చక్రవాకం (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల, రామకృష్ణ

ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో..
వెతుకుతు వెళుతోంది   
    
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో..
వెతుకుతు వెళుతోంది..
వెతుకుతు వెళుతోంది

వలపు వాన చల్లదనం తెలియనిది..
వయసు వరద పొంగు సంగతే ఎరగనిది
వలపు వాన చల్లదనం తెలియనిది..
వయసు వరద పొంగు సంగతే ఎరగనిది

కలల కెరటాల గలగలలు రేగనిది..
కలల కెరటాల గలగలలు రేగనిది..
గట్టు సరిహద్దు కలతపడి దాటనిది

ఏ మబ్బు మెరిసినదో ఏ జల్లు కురిసినదో..

ఎంతగా మారినది.. ఎందుకో ఉరికినది
ఎంతగా మారినది.. ఎందుకో ఉరికినది

        
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది..
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో..
వెతుకుతు వెళుతోంది  

అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది..
అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది
అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది..
అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది


మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
ఏ మనిషికి మచ్చికకు రానన్నది

ఏ తోడు కలిసినదో.. ఏ లోతు తెలిసినదో
వింతగా మారినది.. వెల్లువై ఉరికినది
వింతగా మారినది.. వెల్లువై ఉరికినది 
 
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో
వెతుకుతు వెళుతోంది.. వెతుకుతు వెళుతోంది 


2 comments:

నవలా చిత్రం యేదైనా..నవలా నాయిక వాణిశ్రీ ఒక్కరే అనిపిస్తుంది నాకు..

అన్ డౌటెడ్లీ అండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.