బుధవారం, ఆగస్టు 22, 2018

నీతో నేనుంటా నీలో నేనుంటా...

జైసింహ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జైసింహ (2018)
సంగీతం : చిరంతన్ భట్   
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రేవంత్, రమ్యా బెహరా

ప్రియం జగమే ఆనందమయం
హృదయం నిన్ను దాచే ప్రేమాలయం
పుట్టగానే ప్రేమపై నే ఒట్టేసుకున్నా
నేను నీ వాడ్ననీ
నిన్ను నన్ను జంట కలిపి చదువుకున్న
మనమన్న ఓ మాటనీ

నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నేలా గాలీ ఉన్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోకా

నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నేలా గాలీ ఉన్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోకా


నువ్వలా పువ్వులా నవ్వుతూ ఉండడం
ఎప్పుడూ నాకిష్టమే చెలీ
నువ్విలా ప్రాణమై గుండెలో నిండడం
జన్మకో అదృష్టమే మరీ

చెలియా జీవితమే నీవలనే అద్భుతమే
ఏరేపూ ఏమాపూ కాపాడే నీ చూపు
నన్నంటీ ఉంటే అంతే చాలులే


నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నేలా గాలీ ఉన్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోకా


అనడం వినడం అస్సలే లేవులే
మౌనమైన ప్రేమ భాషలో

ఇవ్వడం పొందడం లెక్కకే రావులే
ఒక్కరేగా ఉంది ప్రేమలో
బ్రతుకే నీ కొరకూ అందుకో కాదనకు
కొంగొత్త రంగేదో నీవల్లే దొరికింది
నా జిందగీలో సంతోషాలకూ

నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నేలా గాలీ ఉన్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోకా


మనసుకు నువ్వు తప్పా
మరే ప్రపంచం తెలియదేనాటికీ
చెరగని కాటుకల్లే దిద్దుకుంటా
నిన్ను నా కలలకీ

మనసుకు నువ్వు తప్పా
మరే ప్రపంచం తెలియదేనాటికీ
చెరగని కాటుకల్లే దిద్దుకుంటా
నిన్ను నా కలలకీ 


2 comments:

చక్కని పాట..విన్న చాలాసేపటి దాకా గురొస్తూ ఉంటుంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.