శుక్రవారం, ఆగస్టు 17, 2018

నాలోని నువ్వు...

నీదీ నాదీ ఒకె కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నీదీ నాదీ ఒకే కథ (2018)
సంగీతం :  సురేష్ బొబ్బిలి
సాహిత్యం : శ్రీనివాస్ జిలకర
గానం : నానీ, సోనీ

నాలోని నువ్వు నీలోని నేను
నవ్వేటి కన్నుల్లో కలలైనామూ కథలైనామూ

ఊగే ఈ గాలి పూసే ఆ తోట
మనమంతా నేడు ఒకటైనామూ ఒకటైనామూ

ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు
నినునన్ను కలిపేటి నీలాల సిరులు
ఆ చేదు కాలం మారింది నేడు
చెరసాల బాధ పోతుంది చూడు


పొడిసే పొద్దు ఎగసే ఆనందం
శాశ్వత హోమం కాదిక నా దేహం
చెలియా నా ఊపిరి వచ్చెనుగా తిరిగి
పక్షుల గొంతుల్లో పాటను నేనిపుడు

నాలోని నువ్వు నీలోని నేను
మోసేటి నేలకు కనులైనామూ కనులైనామూ


హా హా హా హా హా హా హా

నీటిలొ ఈదే చేపకు ఎపుడైనా
దాహం వేస్తుందా తెలుసా నీకైనా
నింగిలొ ఎగిరే కొంగకు ఎపుడైనా
మలినం అంటేనా తెలుసా నీకైనా
లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా
శోకం ఎంతున్నా కాలం ఆగేనా
ఎవరూ ఏమన్నా
ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా


పలికే ఆ చిలుక నవ్వే నెలవంక
ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాదింక
ఏలే భువనాన గెలిచిన జత మాది
మాలా మేమంటే బ్రతుకే ముద్దంటా

నాలోని నువ్వు నీలోని నేను
మోసేటి నేలకు కనులైనామూ

4 comments:

ఫిమేల్ సింగర్ వాయిస్ బావుంది .
పాట కూడా బావుంది సార్.

థాంక్స్ రాజ్యలక్ష్మి గారు..

ఈ మూవీ లో నాగశౌర్య ఉంటే ఇంకా బావుండేదనిపించిందండి..నైస్ సాంగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. ఈ కన్ఫూజ్డ్ యాక్షన్ కి ఇతను కూడా బాగా సూట్ అయ్యాడనిపించిందండీ నాకు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.