బుధవారం, డిసెంబర్ 13, 2017

వసంతమేది వరించి రాదు...

స్నేహగీతం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్నేహ గీతం (2010)
సంగీతం : సునీల్ కశ్యప్
సాహిత్యం : చిన్ని చరణ్
గానం : కార్తీక్

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే

చినుకై రాలే మేఘాన్ని ఆపేనా ఎవరైనా
వెనుకడుగెయ్యక శిఖరాన్నే చేరాలోయ్ ఏమైనా
నీ కలలను చూపేనా కని పెంచిన అమ్మైనా
నీ కలతను చెరిపేనా సృష్టించిన బ్రహ్మైనా

నీకే సాధ్యం ....ఆ ఆ ఆ

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

పడినా లేచే కెరటాల ప్రతిబింబం బ్రతుకేగా
నడి రాతిరిని దాటందే ఉదయం చిగురించదుగా
ఆ నింగిని తాకేలా సంధిస్తే నీ బాణం
తన పరుగును ఆపేనా ఎదురయ్యే అవరోధం

గెలుపే తధ్యం .....ఆ ఆ ఆ

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.