గురువారం, అక్టోబర్ 26, 2017

హే పిల్లగాడా...

భానుమతి గారిమీద మల్లీశ్వరి సిన్మా మీద ఉన్న ఇష్టాన్ని చూపించుకుంటూ తన హీరోయిన్ కి భానుమతి అని పేరు పెట్టుకోవడమే కాక మల్లీశ్వరి చిత్రంలోని పరుగులు తీయాలీ పాట బిట్ ను ఉపయోగించుకుంటూ శేఖర్ కమ్ముల తన ఫిదా చిత్రంకోసం కంపోజ్ చేయించుకున్న ఒక అందమైన పాట ఈ రోజు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఫిదా (2017)
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం : వనమాలి
గానం : సింధూరి, సినవ్ రాజ్

హే పిల్లగాడా
ఏందిరో పిల్లగాడా
నా గుండె కాడా లొల్లి
హే మొనగాడా
సంపకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి
గిర గిర గిల్లే నీలోనా
బిర బిర సుడులై తిరిగేనా
నిలవద నువ్వేం చేస్తున్నా
దొరకను అందా నీకైనా

హే పిల్లగాడా
ఏందిరో పిల్లగాడా
నా గుండె కాడా లొల్లి
హే మొనగాడా
సంపకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి

కదిలే కదిలేయ్
చినుకే కదిలే
ముసిరే ఒక ముసురేయ్
ఇలకాల యీకాకే
వురికే వురికే
జతగా వురికేయ్
మనసే నిను మరిచి
తనకాలా యీకాకే
ఓ ఓ ఓ ఓ
సోయ లేదే హయిలోన
కమ్ముతుంటె గాలి వాన
ఏమౌతుందో ఏమో లోన
నీకు తెలిసేన
నీలోన హైరాన
నన్ను ముంచేన
నాలోని జడివాన

హే పిల్లగాడా
ఏందిరో పిల్లగాడా
నా గుండె కాడా లొల్లి
హే మొనగాడా
సంపకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి
గిర గిర గిల్లే నీలోనా
బిర బిర సుడులై తిరిగేనా
నిలవద నువ్వేం చేస్తున్నా
దొరకను అందా నీకైనా

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.