బుధవారం, అక్టోబర్ 25, 2017

ఎగిరే ఎగిరే నా మనసే...

వెంకటాపురం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వెంకటాపురం (2017)
సంగీతం : అచు రాజమణి
సాహిత్యం : వనమాలి
గానం : యాసిన్ నిజార్, కెక ఘోషల్

ఎవరో ఎవరో ఎదురుగ
కలలా కలలా కనపడి
ఎపుడూ ఎరగని మాయే చేస్తున్నట్టూ
ఎదలో ఎదలో ఇపుడిక
నిజమై నిజమై నిలిచిన
తనతో నడిచా అన్నీ నువ్వేనంటూ
ఇది ముందెరుగని సంతోషం
ఉంటుందా ప్రతి నిమిషం
అనుకోకుండా నాకు ఎదురయ్యిందా
నా గుండెల్లో అడుగేసీ లోనంతా తిరిగేసీ
నన్నిట్టా తను బైటికి లాగేసిందా

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే
ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే

దినమే క్షణమై కరుగుతు
సమయం అసలే తెలియదు
నీతో గడిపే ఈవేళలోనా
నువు చూపే స్నేహంలో
నాలో ఈభారం నేడు మాయమాయెనా
పరుగో నడకో తేలక
పగలో రేయో చూడక
మనసే మునిగే ఒక హాయిలోనా
సిరివానా నీరెండా కలిసి
నా కంటా ఏడు రంగులేసెనా
నువు చూసే లోకంలో
ప్రతి చోటా నేనున్నాలే

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.