గురువారం, మే 11, 2017

మహబలిపురం మహబలిపురం...

బాలరాజు కథ చిత్రంలోని ఒక చక్కనైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాలరాజు కథ (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల

మహబలిపురం మహబలిపురం మహబలిపురం
భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు

మహబలిపురం మహబలిపురం మహబలిపురం
భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహబలిపురం మహబలిపురం మహబలిపురం

కంచి రాజధానిగా పాలించాడు
ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు
కంచి రాజధానిగా పాలించాడు
ఇది మంచిరేవు పట్నం గా కట్టించాడు
తెలుగుసీమ శిల్పుల్ని రప్పించాడు
తెలుగుసీమ శిల్పుల్ని రప్పించాడు
పెద్ద శిలలన్ని శిల్పాలుగా మార్పించాడు

మహబలిపురం మహబలిపురం మహబలిపురం

పాండవుల రథాలని పేరుపడ్డవి
ఏకాండి శిలలనుండి మలచపడ్డవి
పాండవుల రథాలని పేరు పడ్డవి
ఏకాండి శిలలనుండి మలచపడ్డవి
వీటిమీద బొమ్మలన్ని వాటమైనవి
వీటిమీద బొమ్మలన్ని వాటమైనవి
తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి
తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి

మహబలిపురం మహబలిపురం మహబలిపురం

మహిషాసురమర్ధనం... గోవర్ధనమెత్తడం
మహిషాసురమర్ధనం... గోవర్ధనమెత్తడం
మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం
మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం
పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి
పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి
ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి

మహబలిపురం మహబలిపురం మహబలిపురం

పాశుపతం కోరెను పార్ధుని మనసు
పరమశివుని కోసము చేసెను తపస్సు
పాశుపతం కోరెను పార్ధుని మనసు
పరమశివుని కోసము చేసెను తపస్సు
సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను
సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను
ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను
ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను

మహబలిపురం మహబలిపురం మహబలిపురం

సంద్రంలో కలసినవి కలసిపోయేను
ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను
సంద్రంలో కలసినవి కలసిపోయేను
ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను
దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం
పాదాలను కెరటాలు కడుగును నిత్యం
మనుషుల పాపాలు ఇది చూడ తొలగును సత్యం సత్యం
పాపాలు ఇది చూడ తొలగును సత్యం సత్యం

మహబలిపురం మహబలిపురం మహబలిపురం
భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహబలిపురం మహబలిపురం మహబలిపురం


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.