శనివారం, మే 27, 2017

బ్రహ్మం తాత చెప్పింది...

తల్లా పెళ్ళామా చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : తల్లా పెళ్ళామా (1970)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : కొసరాజు
గానం : సుశీల

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది
బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం
తెలుగుదనమేమి కాదు నీ తెలివి బైట పడబోదూ
నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం
తెలుగుదనమేమి కాదు నీ తెలివి బైట పడబోదూ
నీవాణ్ణే నువ్వు తిట్టకపోతే తెలుగువాడివే కాదు..

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం
దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు
ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం
దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు
హాయ్ ఛాన్స్ తగిలితే మంత్రినవుదునని ప్లాను లేకపోలేదు

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

పదవులకోసం ప్రాకులాడడం ప్రెస్టేజీకి కాదు
మన ప్రజలబాగుకు కాదు
పదవులకోసం ప్రాకులాడడం ప్రెస్టేజీకి కాదు
మన ప్రజలబాగుకు కాదు
పూలదండలిక పడబోవేమోనని చింతలేకపోలేదు

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

పంచాయతి ప్రసిడెంటు కావడం
గ్రామం బాగుకు కాదు ఆ ప్రక్కకు బుద్దే పోదూ
పంచాయతి ప్రసిడెంటు కావడం
గ్రామం బాగుకు కాదు ఆ ప్రక్కకు బుద్దే పోదూ
ఆహా ఉమ్మడి సొమ్ము భోంచేద్దామని ఊహ లేకపోలేదు

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

బ్రతికున్నప్పుడు నెత్తిననిప్పులు
చల్లడమంటే మోజూ అది సహజంరా ఈ రోజు
బ్రతికున్నప్పుడు నెత్తిననిప్పులు
చల్లడమంటే మోజూ అది సహజంరా ఈ రోజు
చచ్చిన పిమ్మట శిలావిగ్రహం స్థాపించడమే రివాజు

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

పేకముక్కలు చేతపట్టితే
చీదరించుకొనిరానాడు ఛీఛీ అన్నారానాడూ
పేకముక్కలు చేతపట్టితే
చీదరించుకొనిరానాడు ఛీఛీ అన్నారానాడూ
క్లబ్బుల్లో పేకాటగాళ్ళకే గౌరవమున్నది ఈనాడూ

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే
భాగ్యవతన్నారానాడూ సౌభాగ్యవతన్నారానాడూ
బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే
భాగ్యవతన్నారానాడూ సౌభాగ్యవతన్నారానాడూ
బిడ్డలు లేని గొడ్రాలికే గౌరవమన్నారీనాడు
 
బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

ప్రజాక్షేమమే పరమార్ధమ్మని
ప్రభువులు పలికారానాడూ పరిపాలించారానాడూ
ప్రజాక్షేమమే పరమార్ధమ్మని
ప్రభువులు పలికారానాడూ పరిపాలించారానాడూ
రకరకాల పన్నులను తగిలించి నీతిని చంపారీనాడూ

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.