శనివారం, డిసెంబర్ 10, 2016

నను నేనే మరిచినా...

ప్రేమదేశం సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమదేశం(1996)
సంగీతం : ఏ ఆర్ రెహ్మాన్
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, ఓ.ఎస్.అరుణ్

ప్రేమా... ప్రేమా... ఆ... ఆ...
ప్రేమా... ప్రేమా... ఆ... ఆ...
నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు ప్రేమా
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
రావా నా వాకిట్లో నీకై నే వేచానే

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు ప్రేమా


ఆకాశ దీపాన్నై నే వేచివున్నా
నీ పిలుపు కోసం చిన్నారీ
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా
కరుణించలేవా సుకుమారీ
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువులేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు ప్రేమా
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా


నిముషాలు శూలాలై వెంటాడుతున్నా
ఒడి చేర్చుకోవా వయ్యారీ
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా
ఓదార్చిపోవా  ఓ సారీ
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ
 
నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు ప్రేమా
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
రావా నా వాకిట్లో నీకై నే వేచానే

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు ప్రేమా


2 comments:

బావున్నాయి వేణూజీ మీ విరహ గీతాలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.