గురువారం, జూన్ 09, 2016

బిడియమేలా.. ఓ చెలి..

ఎస్.రాజేశ్వరరావు గారు స్వరపరచిన ఒక మధురగీతాన్ని నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆదర్శ కుటుంబం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె   
గానం : ఘంటసాల, సుశీల

బిడియమేలా.. ఓ చెలి..
పిలిచె నిన్నే.. కౌగిలి..
మొదటిరేయి ఒదిగిపోయి
మోము దాచేవెందుకో.. ఎందుకో

హా.. అదే తెలియదు ఎందుకో
బిడియమేలా... ఓ చెలి
పిలిచె నిన్నే.. కౌగిలి
మొదటి రేయి ఒదిగిపోయి
మోము దాచేవెందుకో... ఎందుకో

కనులు ముకుళించెను.. లోలోన
తనువు వికసించెను.. పైపైన
కనులు ముకుళించెను.. లోలోన
తనువు వికసించెను.. పైపైన

పదము రాక.. కదలలేక
ఒదిగి ఉన్నాను ఈ వేళ
ఒదిగి ఉన్నాను ఈ వేళ
నిలువలేను... పిలువలేను
ఊ...ఊ..

బిడియమేలా... ఓ చెలి
పిలిచె నిన్నే.. కౌగిలి
మొదటి రేయి ఒదిగిపోయి
మోము దాచేవెందుకో... ఎందుకో

శయ్యపై మల్లియలేమనెను
చాటుగ జాబిలి ఏమనెను
శయ్యపై మల్లియలేమనెను
చాటుగ జాబిలి ఏమనెను

కలల దారి చెలుని చేరి
కరిగిపొవేమి నీవనెను
కరిగి పొవేమి నీవనెను
మరులు పూచే... మనసు వీచే
ఊ...ఊ..

బిడియమేలా... ఓ చెలి ఊ..
పిలిచె నిన్నే.. కౌగిలి..ఊహూ..
మొదటి రేయి అఆ.. ఒదిగిపోయి..ఆఅ..
మోము దాచేవెందుకో... ఎందుకో




2 comments:

మనసుని మల్లెల తీరం వైపు తీసుకు వెళ్ళే పాట..

థాంక్స్ శాంతి గారు.. మీ కామెంట్ మనసుకు దగ్గరైన ఓ సినిమాను గుర్తు చేసింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail