బుధవారం, జూన్ 29, 2016

ఆకాశంలో హంసలమై...

గోవుల గోపన్న చిత్రంలోని ఒక హాయైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గోవుల గోపన్న (1968)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : దాశరధి
గానం : ఘంటసాల, సుశీల

ఆకాశంలో హంసలమై
హాయిగ ఎగిరే జంటలమై
అలా అలా కులాసాల తేలిపోదామా

ఆకాశంలో హంసలమై
హాయిగ ఎగిరే జంటలమై
అలా అలా కులాసాల తేలిపోదామా

వెండి మబ్బుల విమానాలపై
విహారాలనే చేద్దామా
వెండి మబ్బుల విమానాలపై
విహారాలనే చేద్దామా
మంచుకొండల అంచుల మీద
వాలిపోదామా సోలిపోదామా

ఆకాశంలో హంసలమై
హాయిగ ఎగిరే జంటలమై
అలా అలా కులాసాల తేలిపోదామా

ఆకాశానికి ఆనందానికి
అంతే  లేదని అంటారు
ఆకాశానికి ఆనందానికి
అంతే  లేదని అంటారు
ఆది దంపతులవలె ఆనందం
అవధులు చూదామా
అవధులు చూదామా

ఆహా ఆహా ఆహాహా
ఆహా ఆహా ఆహాహా

మిన్నేటి కెరటాల మీద
ఉయ్యాలలూగేము నేడే
బంగారు కమలాల నీడ
సయ్యాటలాడేము నేడే

ఆకాశంలో హంసలమై
హాయిగ ఎగిరే జంటలమై
అలా అలా కులాసాల తేలిపోదామా 
తేలిపోదామా  తేలిపోదామా



2 comments:

నిజంగానే మనసుని గాలిలో తేలియాడేలా చేసే పాట..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.