సోమవారం, జూన్ 06, 2016

నా కంటి పాపలో...

వాగ్దానం చిత్రం కోసం పెండ్యాల గారు స్వరపరచిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : వాగ్ధానం (1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల

ఊ..ఉ...ఉ...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ..ఆ..ఆ..ఆ...

ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే
అహ..హా..ఆ..
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకొందాము అందని ఆకాశమే

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...

ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
అహ..హా..ఆ..
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో
మేఘాలలో వలపు రాగాలలో
దూర దూరాల స్వర్గాల చేరుదమా

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...

ఈ పూలదారులూ ఆ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా
అహ..హా..ఆ..
ఈ పూలదారులూ ఆ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా
అందాలనూ తీపి బంధాలను
అందాలనూ తీపి బంధాలను
అల్లుకుందాము డెందాలు పాలించగా

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ..
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.