
పెద్దరికం చిత్రంకోసం ఏసుదాస్ గారు గానం చేసిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : భువనచంద్ర
గానం : ఏసుదాస్, స్వర్ణలత
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
ఇదేలే...