బుధవారం, సెప్టెంబర్ 30, 2015

భామా ఈ తిప్పలు తప్పవు..

ఇళయరాజా సంగీత సారధ్యంలో బాలు జానకి గార్లు గానం చేసిన ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఛాలెంజ్ (1984) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా.. మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా.. భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా.. తప్పంటూ చేయక...

మంగళవారం, సెప్టెంబర్ 29, 2015

ఇద్దరమే మనమిద్దరిమే..

కొల్లేటి కాపురం చిత్రం కోసం శ్రీశ్రీ గారు రాసిన ఒక చక్కని డ్యూయట్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు... చిత్రం : కొల్లేటి కాపురం (1976)సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం : శ్రీశ్రీగానం : బాలు, సుశీలఇద్దరమే మనమిద్దరమే . . ఇద్దరమేకొల్లేటి కొలనులో కులికేటి అలలమై వలపించే భావాల వెలలేని కలలమై   ఇద్దరమే మనమిద్దరమే . . ఇద్దరమేతొలిసంజ వెలుగులో కలువ పూబాటలోతొలిసంజ వెలుగులో కలువ పూబాటలోవికసించే ఎదలతో విడిపోని జంటగా విడిపోని...

సోమవారం, సెప్టెంబర్ 28, 2015

ఎదురుగా నీవుంటే...

రామకృష్ణ గారు సుశీలమ్మ పాడిన ఒక మంచి మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మహాత్ముడు (1976) సంగీతం : టి.చలపతిరావు సాహిత్యం : సినారె గానం : రామకృష్ణ, సుశీల ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో ఎదురుగా నీవుంటే నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో నీ చిగురు...

ఆదివారం, సెప్టెంబర్ 27, 2015

ఆమెతోటి మాటు౦ది..

అమెరికా అమ్మాయి చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అమెరికా అమ్మాయి (1976)సంగీతం : జి కె వెంకటేష్సాహిత్యం : గోపిగానం : బాలుహే...ఆమెతోటి మాటు౦ది పెదవిదాటి రాకుంది ఆమెతోటి మాటు౦ది పెదవిదాటి రాకుంది ఏమున్నదో ఆ చూపులో చిరుగాలి తరగల్లె నడకలు నేర్చిందీ సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీచిరుగాలి తరగల్లె నడకలు నేర్చిందీ సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీనవ్వు...

శనివారం, సెప్టెంబర్ 26, 2015

చుక్కల తోటలో ఎక్కడున్నావో..

చక్రవర్తి గారి సంగీతంలో వచ్చిన కొన్ని చక్కన్ని మెలోడీస్ లో ఇదీ ఒకటి.. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అల్లరి బుల్లోడు (1978) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : వేటూరి గానం: బాలు, సుశీల చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటాను నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల విరిసింది మల్లిక నా రాగ మాలిక అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న...

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2015

మ్రోగింది కళ్యాణ వీణా..

సాలూరి వారి స్వర రచనలో ఒక మధురమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో మిస్ అవకండి కృష్ణ గారి చూపులు.. ఆ ఎక్స్ప్రెషన్స్ ప్రైస్ లెస్ అసలు :-) చిత్రం : కురుక్షేత్రం (1977) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం : సినారె గానం : బాలు, సుశీల ఆహహా..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆహాహా.. మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణా.. నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ.. మ్రోగింది...

గురువారం, సెప్టెంబర్ 24, 2015

సిరిమల్లీ శుభలేఖా...

జంధ్యాల గారు తన చిత్రాలలోని పాటలకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో తెలియనిది కాదు హాస్య చిత్రాలే కదా అని ఆయన పాటలను ఎప్పుడూ అలుసుగా తీస్కోలేదు. చూపులుకలిసిన శుభవేళ చిత్రంలోని ఈ పాట కూడా వారి ఉత్తమాభిరుచికి అద్దం పడుతుంది. హీరో సైకిల్ షాప్ ఓనర్ కనుక సైకిల్ థీమ్ తో సింపుల్ గా అందంగా ఈ పాటను చిత్రీకరించిన విధానాన్ని భళా అని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : చూపులు కలసిన శుభవేళ...

బుధవారం, సెప్టెంబర్ 23, 2015

రేపే లోకం ముగిసే నంటే..

రహ్మాన్ స్వరపరచిన ఒక చక్కని ప్రేమగీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట వీడియో కొంతే ఉంటుది పూర్తి పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.  చిత్రం : లవ్ బర్డ్స్(1996)సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం : రాజశ్రీ గానం : ఉన్నికృష్ణన్, సుజాత  రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు   రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు  కన్నులు తెరిచి కాలంమరిచి నింగినే...

మంగళవారం, సెప్టెంబర్ 22, 2015

తొలి వలపు తొందరలు..

రాజన్ నాగేంద్ర గారి స్వరరచనలో వేటూరి వారు అంత్య ప్రాసలతో సరదాగా అల్లిన ఒక పసందైన పాట ఈ రోజు తలచు కుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (1978) సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : వేటూరి గానం : బాలు, ఎస్.జానకి తొలి వలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు చెలితో నేను చలితో నీవు చేసే అల్లరులు ఆ..తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు చెలితో నీవు చలితో నేను చేసే...

సోమవారం, సెప్టెంబర్ 21, 2015

నీ కోల కళ్ళకు నీరాజనాలు..

హేమాహేమీలు చిత్రం కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఒక అందమైన ప్రేమగీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : హేమా హేమీలు (1979)సంగీతం : రమేష్ నాయుడు సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీలనీ కోల కళ్ళకు నీరాజనాలు ఆ వాలు చూపుకు అభివందనాలు ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు ఈ కోప తాపాలకు ఆ తీపి శాపాలకు అందించనా నీకు హరిచందనాలు నీ కోల కళ్ళకు నీరాజనాలు ఆ వాలు చూపులకు అభివందనాలు కోటేరు లాంటి ఆ కొస...

ఆదివారం, సెప్టెంబర్ 20, 2015

జాబిల్లి చూసేను...

ఆదినారాయణరావు గారి సంగీతంలో రామకృష్ణ గారు సుశీల గారు గానం చేసిన ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : మహాకవి క్షేత్రయ్య (1976) సంగీతం : ఆదినారాయణరావు సాహిత్యం : దాశరథి గానం : రామకృష్ణ, సుశీల జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో నాకెంత సిగ్గాయె బావా.. బావా.. నను వీడలేవా పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో నీకింత సిగ్గేల బాలా.. రావా నను చేరరావా ఆ .....

శనివారం, సెప్టెంబర్ 19, 2015

వయసే ఒక పూలతోట..

మహదేవన్ గారు స్వరపరచిన ఒక హుషారైన ప్రేమ గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాటలో వయసే అన్న తర్వాత చిన్న పాజ్ ఇచ్చి ట్వింకిల్ లా ఒక చిన్న మ్యూజిక్ బిట్ ఇస్తారు ఆ టచ్ నాకు భలే ఇష్టం, చిన్నపుడు రేడియోలో వింటూ దానికోసం ఎదురు చూసి మరీ ఆనందించేవాడ్ని. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : విచిత్ర బంధం (1972) సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : దాశరథి గానం : రామకృష్ణ, సుశీల  వయసే ఒక పూలతోట.. వలపే...

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2015

దీపానికి కిరణం ఆభరణం..

రమేశ్ నాయుడి గారి స్వరసారధ్యంలో వచ్చిన ఒక అందమైన మెలోడీ ఈ రోజు విందాం.. ఎప్పుడు విన్నా ఎంతో హాయైన అనుభూతిని ఇచ్చే ఈ పాట నాకు చాల ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : చదువు సంస్కారం (1974) సంగీతం : రమేశ్ నాయుడు సాహిత్యం : సినారె గానం : సుశీల ఉమ్.. ఊఁ.. ఆ.. ఆ.. దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం హృదయానికి.. ఏనాటికీ.. తరగని సుగుణం.. ఆభరణం తరగని సుగుణం.. ఆభరణం దీపానికి...

గురువారం, సెప్టెంబర్ 17, 2015

వినాయక చవితి శుభాకాంక్షలు..

మిత్రులందరకూ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్బంగా రాగం చిత్రంకోసం మణిశర్మ సంగీతంలో  బోంబే జయశ్రీ గారు గానం చేసిన ఈ అద్భుతమైన శ్లోకాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రాగం (2006) సంగీతం : మణిశర్మ, అమిత్ హెరి సాహిత్యం : ముత్తుస్వామీ దిక్షితార్ గానం : బోంబే జయశ్రీ ఆఆఆఅ..ఆఆఆఆ.... మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం మనసా స్మరామి ఆఆఆఆఅ...మహా...

బుధవారం, సెప్టెంబర్ 16, 2015

శీతాకాలం ప్రేమకు ఎండాకాలం..

అశ్వమేథం చిత్రంలోని ఈ పాట ట్యూన్ నాకు చాలా ఇష్టం.. మీరూ వినండి.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అశ్వమేధం (1992)సంగీతం : ఇళయరాజాసాహిత్యం :గానం : బాలు, ఆశా భోంస్లేశీతాకాలం ప్రేమకు ఎండాకాలంఎండాకాలం ముద్దులు పండే కాలంసందిట్లో విందే సాయంకాలంకౌగిట్లొ రద్దే ప్రాతఃకాలంవలపమ్మ జల్లే వానాకాలంసిగ్గమ్మ కొచ్చే పోయే కాలం ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలంఎండాకాలం ముద్దులు పండే కాలంచేగాలికే చెదిరే నడుమే...

మంగళవారం, సెప్టెంబర్ 15, 2015

పేరు చెప్పనా...

ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : గురు (1980) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : బాలు, జానకి పేరు చెప్పనా నీ రూపు చెప్పనా నీ పేరే అనురాగం నీ రూపము శృంగారము నీ చిత్తమూ నా భాగ్యము పేరు తెలుసునూ నీ రూపు తెలుసును నీ పేరే ఆనందం నీ రూపము అపురూపము నీ నేస్తాము నా స్వర్గము పేరు చెప్పనా...

సోమవారం, సెప్టెంబర్ 14, 2015

తొలిసారి ముద్దివ్వమందీ..

సత్యం సంగీత సారధ్యంలో సింపుల్ అండ్ స్వీట్ అనదగ్గ ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఎదురీత (1977) సంగీతం : సత్యం సాహిత్యం : వేటూరి గానం : బాలు. పి.సుశీల తొలిసారి ముద్దివ్వమందీ .. చెలిబుగ్గ చేమంతి మొగ్గా ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ.. చెలిబుగ్గ చేమంతి మొగ్గా. పెదవులలో మధువులనే కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమందీ చిరుకాటు ఈ తేనెటీగా నీ పైటతీసి కప్పుకుంది...

ఆదివారం, సెప్టెంబర్ 13, 2015

కీరవాణీ చిలకల కొలికిరో...

అన్వేషణ చిత్రంలోని ఒక అద్భుతమైన మెలోడీ ఈ రోజు తలచుకుందాం.. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అన్వేషణ (1985) సంగీతం : ఇళయ రాజా సాహిత్యం : వేటూరి గానం : ఎస్. పి బాలు, ఎస్. జానకి సా ని స రి సాని ఆ హ ఆ సా ని స మ గా మరి ఆ ప ద సా ని స రి సాని ఆ హ ఆ సా ని సమ గా మరి ఆ అ ప ద సస ని రిరి స గగ గరి మమ గగ మా సా ని ద ప మ గ రి స ని కీరవాణీ చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబుసిన ఆశలు విరితేనెలు...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.