గురువారం, సెప్టెంబర్ 10, 2015

ప్రణయ రాగ వాహిని..

మాయామశ్చీంద్ర చిత్రం కోసం సత్యం గారు స్వరపరచిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. నేను రేడియో లో విన్న పాటలలో ఇది కూడా ఒక మరిచిపోలేని మధురమైన పాట. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : మాయా మశ్చీంద్ర (1975)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..
ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..

మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ..

ప్రణయ రాగజీవనా...ప్రియా...వసంత మోహనా..

ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ..
 
మలయ పవన మాలికలు.. చెలియా పలికే ఏమని..
మలయ పవన మాలికలు.. చెలియా పలికే ఏమని..
పొదరింట లేడు..పూవింటి వాడు..
పొదరింట లేడు..పూవింటి వాడు..ఎదురుగా వున్నాడనీ..

 
ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..

లలిత శారద చంద్రికలు..అలలై పాడేను ఏమనీ..
లలిత శారద చంద్రికలు..అలలై పాడేను ఏమనీ..

పదునారు కళలా.. పరువాల సిరులా
పదునారు కళలా.. పరువాల సిరులా
పసిడి బొమ్మవు నీవనీ..

ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..
మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ..
ప్రణయ రాగజీవనా...ప్రియా...వసంత మోహనా..

1 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail