బుధవారం, మే 06, 2015

పరవాలేదు పరవాలేదు...

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా చిత్రంలో గీతామాధురి పాడిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మనసారా (2010)
సంగీతం : శేఖర్‌చంద్ర
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : గీతామాధురి

పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు
 
పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు ఉన్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వు ఎవ్వరైనా పర్లేదు
ఓ... నీకు నాకు స్నేహం లేదు
నువ్వంటే కోపం లేదు
ఎందుకే దాగుడుమూతలు
అర్థమే లేదు
మచ్చేదో ఉన్నాదనీ మబ్బుల్లో
జాబిల్లి దాగుండిపోదు
 
 
పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువ అయినా
మరి పర్లేదు
మసిలాగ ఉంటుందని
తిడతామా రాతిరిని
తనలోనే కనలేమా
మెరిసేటి సొగసులనీ
అందంగా లేను అనీ
నిన్నెవరూ చూడరని
నువ్వెవరికి నచ్చవనీ 
నీకెవ్వెరు చెప్పారు
ఎంత మంచి మనసో నీది
దాని కన్న గొప్పది లేదు
అందగాళ్లు నాకెవ్వరూ ఇంత నచ్చలేదు
నల్లగా ఉన్నానని
కోకిల కొమ్మల్లో దాగుండిపోదు

పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

హాఅ..ఆఆహహహాఅ..హా...
అంతలేసి కళ్లుండకున్నా 
నాకు పర్లేదు
కోరమీసం లేకున్నా గాని 
మరి పర్లేదు
పరదాలే ఎన్నాళ్లిలా
అని నిన్నే అడగమనీ
సరదాగా తరిమిందే మది
నీపై మనసుపడి
మురిపించే ఊహలతో
ఒకచిత్రం గీసుకొని
అది నువ్వు కాదోనని
సందేహం ప్రతిసారీ
చేరదీసి లాలించలేదు
నన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరూ 
ఇంత నచ్చలేదు
ఎవరేమన్నా సరే
నా చేయి నిన్నింక వదిలేదిలేదు

పరవాలేదు పరవాలేదు
చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు3 comments:

Nice one, chalaa rojulayyindi vini...malli gurtu techaru..Thanks.

Nitya

థాంక్స్ ఫర్ ద కామెంట్ నిత్య గారు :-)

ఫరవాలేదన్నంత మాత్రాన..అతి చనువు తీసుకుంటే ఆ తరువాత కష్టాలే సుమా..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail