శుక్రవారం, మే 22, 2015

సాహసమే చేయ్‌రా...

చంద్రలేఖ చిత్రం లోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చంద్రలేఖ (1998)
సంగీతం : సందీప్ చౌతా
రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలు

సాహసమే చేయ్‌రా డింభకా
అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే సాధించలేవురా
నువ్వనుకున్నది
ధైర్యముంటే హహ్హహ్హా
దక్కుతుంది హహ్హహా రాకుమారి
 

తెలివిగా వేయ్‌రా పాచిక
కల్లో మేనక ఒళ్లోపడదా
సులువుగా రాదురా కుంక
బంగారు జింక వేటాడాలిగా
నింగిదాకా హహ్హహ్హా నిచ్చెనేద్దాం హహ్హహ్హా
ఎక్కిచూద్దాం హహ్హహ్హా ఒహ్హొహో...

చందమామను అందుకొనే
ఇంద్ర భవనాన్ని కడతానురా
పడవంత కారులోన బజారులన్నీ
షికారు చేస్తానురా
సొంతమైన విమానములో
స్వర్గలోకాన్ని చూడతానురా
అపుడు అప్సరసలు ఎదురువచ్చి
కన్ను కొడతారురా
చిటికేస్తే హహ్హహ్హా సుఖమంతా హహ్హహ్హా
మనదేరా 

సాహసమే చేయ్‌రా డింభకా
అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే సాధించలేవురా
నువ్వనుకున్నది
ధైర్యముంటే హహ్హహ్హా
దక్కుతుంది హహ్హహా రాకుమారి

 సున్ని ఉండలు కందిపొడి
ఫ్యాక్టరీల్లోన వండించనీ
అమెరికా ఇరాను జపాను ఇరాకు
జనాలు తింటారనీ
కొన్ని ఎం.పి.లను కొంటా
కొత్త పి.ఎం.ను నేనేనంటా
స్కాములెన్నో చేసి స్విస్‌బ్యాంకు కేసి
డాలర్లలో తేలుతా
సుడివుంటే హహ్హహ్హా ఎవడైనా హహ్హహ్హా
సూపర్‌స్టారే 

సాహసమే చేయ్‌రా డింభకా
అన్నది కదరా జై పాతాళభైరవి
చొరవగా దూకకపోతే ఐ యామ్ వెరీ సారీ
నువ్వనుకున్నది
ధైర్యముంటే హహ్హహ్హా
దక్కుతుంది హహ్హహా రాకుమారి


 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail