శనివారం, మే 02, 2015

ఔననా కాదనా...

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమా కోసం మిక్కీ జె మేయర్ స్వరపరచిన ఒక అందమైన వేటూరి రచన ఈ రోజు తలచుకుందాం. ఎంబెడ్ చేసినది సగం పాట మాత్రమే. పూర్తిపాట లిరిక్ తో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : లీడర్ (2010)
సంగీతం : మిక్కీ జె. మేయర్
సాహిత్యం : వేటూరి
గానం : నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..
మూగమైనా రాగమేనా
నీటిపైనా రాతలేనా
ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..

తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు
కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు
నింగి నేలా ఏకమైనా పొద్దులో సింధూరాలు
నీకు నెను చేరువైనా ఎందుకో దూరాలు
దొరికింది దొరికింది తోడల్లే దొరికింది
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
దొరికింది దొరికింది తోడల్లే దొరికిందీ హొ..
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా... ఓఓఓ..
 
ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..
 
ఆఆఅ.ఆఅ..ఆఆఆఅ....ఆఆ..
నానన..నానన..ఆఅఆఆ...
ఆశలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే
శ్వాసలేలే బాసలన్ని భాదలై పోయేనా
పూల జడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే
రాసలీల రక్తధార భాదలై పోయేనా
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది

 ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా...

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..


2 comments:

ప్రేమలో సందిగ్ధం కూడా ఓఅ అందమైన ఫేజ్..

లైట్ మ్యూజిక్ కాంపిటీషన్స్ లో యెప్పుడూ ముందు వరుసలో ఉండే పాట..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail