మంగళవారం, అక్టోబర్ 14, 2014

కరివరద మొరను వినలేవా...

బాలు గారు సంగీత దర్శకత్వం వహించిన అతి కొద్ది సినిమాలలో ఒకటి బాపు గారు దర్శకత్వం వహించిన 'జాకీ'. ఈ సినిమాలో "అలామండి పడకే జాబిలి" అనే విషాద గీతం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇదే సినిమాలో హీరోయిన్ హీరోని బ్రతిమాలే సన్నివేశంలో వచ్చే 'కరివరద' పాట ట్యూన్ చాలా ఇంటెన్స్ గా ఉండి నాకు చాలా నచ్చుతుంది, మీరు కూడా విని ఆనందించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జాకి (1985)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

కరివరద మొరను వినలేవా..
శశివదన చెలిమి కనలేవా...
నా మాటే మన్నించీ.. నాతోటే నిన్నుంచీ
మన రాదా మహరాజా
బిరానా చేరుకోరా సరాగమాడుకోరా
వరించి ఏలుకో...వసంతమాడుకో..

కరివరద మొరను వినలేవా..
శశివదన చెలిమి కనలేవా...

హా.. ఆ హా.. జాజిపూలే చూసే జాలిగా..
హే.. ఏహే.. జంట కమ్మాన్నాయి జాలీగా..
తెలుసు నా జాకీ నువ్వనీ..
అహా మనసే రాజాల రవ్వనీ..
ఓ రాకుమారుడా.. నీ రాక కోసమే
వేచి వేచి వేగుతున్నాను రా..

కరివరద మొరను వినలేవా..
శశివదన చెలిమి కనలేవా...
నా మాటే మన్నించీ.. నాతోటే నిన్నుంచీ
మన రాదా మహరాజా
బిరానా చేరుకోరా సరాగమాడుకోరా
వరించి ఏలుకో...వసంతమాడుకో..

హా..ఆ హా.. ఎందుకో నువ్వంటే ఇది ఇది గా...
హే.. ఏ హే.. అందుకే నీ తోడు నేనడిగా...
చెంగు ఎన్నటికీ వదలకూ..
ఏయ్ చెలిమి ఎప్పటికీ విడవకూ..
ఓ ఈశ్వర శాపమా.. ఓ హో నా ప్రియతమా
పేచీ మాని రాజీకొచ్చేయరా... 
 
హయగమన మొరలు వినలేనా..
శశివదన మనసు కనలేనా...
నన్నల్లే నిన్నెంచీ.. నాలోనే నిన్నుంచీ
వలచానే... వల రాణి
బిరాన చేరుకోనా.. సరాగమాడుకోనా..
వరించి ఏలనా..ఓ ఓ ఓ..వసంతమాడనా
లలాలలాలలాలలాలలాలలా

 

4 comments:

నాకూ ఈ పాట కన్నా "అలామండి పడకే జాబిలి" పాటే ఇష్టమండీ. అందులో పాట చివరిదాకా వెనుకాల వచ్చే రికరింగ్ బిట్ ఇష్టం నాకు.

థాంక్స్ తృష్ణ గారు.. అవునండీ ఆ పాట కూడా బాగుంటుంది.

బాలు గారు మ్యూజిక్ చేసిన సాంగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్.. నాకు చాలా ఇష్టమైన పాట.. థాంక్యూ వేణూజీ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail