శుక్రవారం, అక్టోబర్ 31, 2014

నీ పలుకే త్యాగరాయ కీర్తన...

కళ్యాణి చిత్రం కోసం రమేష్ నాయుడు గారి స్వరసారధ్యంలో వచ్చిన వేటూరి వారి రచన ఈరోజు మీకోసం. ఎంత చక్కని పాటో.. ఇదీ రేడియో పరిచయం చేసిన పాటే.. కాకపోతే చిన్నతనంలో స్టేషన్ తిప్పేసేవాడ్ని కాస్త పెద్దయ్యాక కానీ ఈ సంగీతాన్ని ఆస్వాదించడం తెలియలేదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : కళ్యాణి (1979) సంగీతం : రమేశ్ నాయుడు  సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీల నీ ప మ పా..ఆ..ఆ..ఆ..ఆ నీ ప మ ప గపాగగ...

గురువారం, అక్టోబర్ 30, 2014

నెలవంక తొంగి చూసింది...

చందమామ, చల్లగాలీ సరాగాలాడుకునే వేళ వలపుజంట ఆలాపనే ఈ పాట... రాజకోట రహస్యం సినిమాలోని ఈ అందమైన యుగళగీతం ఈరోజు మీకోసం... చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రాజకోట రహస్యం (1971)సంగీతం : విజయా కృష్ణమూర్తిసాహిత్యం :  సినారెగానం :  ఘంటసాల, సుశీల నెలవంక తొంగి చూసింది.. చలిగాలి మేను సోకిందిమనసైన చెలువ కనులందు నిలువ..తనువెల్ల పొంగి పూచిందినెలవంక తొంగి చూసింది.. చలిగాలి...

బుధవారం, అక్టోబర్ 29, 2014

వగల రాణివి నీవే...

పండు వెన్నెల్లో రామారావంతటి అందాగాడు మేడ దిగి రావే అని పాడితే రానమ్మాయి ఉంటుందా ? అఫ్ కోర్స్ మన కృష్ణకుమారి మాత్రం వెంటనే దిగిరాలేదులెండి. ఆ మత్తు కలిగించే పాటేమిటో వినాలనుకుంటే, ఆ చక్కని జంటను మీరూ చూడాలనుకుంటే చూసి.. వినేసేయండి మరి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : బందిపోటు (1963) సంగీతం : ఘంటసాల సాహిత్యం : సినారె గానం : ఘంటసాల ఓహోహో...ఓ... ఓ... ఓహోహో... ఓ... ఓ... ఓహోహోహో......

మంగళవారం, అక్టోబర్ 28, 2014

కలవరమాయే మదిలో...

పాతాళభైరవి సినిమా గురించి ఈ పాట గురించి తెలియని తెలుగు వాళ్ళుండరేమో కదా... ఈ మధురమైన పాటను మరోసారి చూసీ వినీ ఆనందించండి మరి... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం: పాతాళభైరవి(1951) సంగీతం: ఘంటసాల రచన: పింగళి నాగేంద్ర రావు గానం: ఘంటసాల, పి లీల కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే  మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన...

సోమవారం, అక్టోబర్ 27, 2014

ఓం నమో నమో నటరాజ...

ఈరోజు పరమ పవిత్రమైన కార్తీక సోమవారం కనుక ఆ సర్వేశ్వరుడిని తలచుకొంటూ నాగుల చవితి సినిమాలోని ఈ పాట గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : నాగుల చవితి (1956) సంగీతం : గోవర్థనం, సుదర్శనం సాహిత్యం : పరశురాం గానం : టి.ఎస్.భగవతి ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయఃఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభోఓం నమో నమో నటరాజనమో నమో నటరాజఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభోఓం నమో నమో నటరాజనమో...

ఆదివారం, అక్టోబర్ 26, 2014

నల్లా నల్లాని కళ్ళ పిల్లా...

ఒకరి అభిరుచి ఒకరికి బాగా తెలిసినవారవడం వల్లో లేక ఇద్దరివీ ఒకే ఆలోచనలవడం వల్లో ఏమో తెలీదు కానీ రాజమౌళి సినిమా అనగానే కీరవాణి గారి హార్మోనియం మాంచి క్యాచీ ట్యూన్స్ ని పలికిస్తుంటుంది. రాజమౌళి తీసిన 'సై' సినిమా కోసం కీరవాణి స్వరపరచిన ఒక చక్కనిపాట ఈరోజు మీకోసం.. ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : సై (2004) సంగీతం : కీరవాణి సాహిత్యం : శివశక్తి దత్త గానం : కీరవాణి, చిత్ర   నల్లానల్లాని కళ్ళ పిల్లా నీ...

శనివారం, అక్టోబర్ 25, 2014

తేట తేట తెలుగులా...

ప్రేమనగర్ సినిమాలోని ఈ పాట మొదట్లో వచ్చే మ్యూజిక్ బిట్ నాకు చాలా ఇష్టం. మిగిలిన వాయిద్యాలతో పాటు దువ్వెనపై పలికించినట్లుగా వినిపించే బిట్ గమ్మత్తుగా ఉంటుంది. ఇక పాటలోని ఆత్రేయ గారి సాహిత్యం గురించీ, మహదేవన్ గారి సంగీతం గురించీ, ఘంటసాల గారి గాత్రం గురించీ ఎంత చెప్పినా తక్కువే. ఈ అచ్చతెలుగు పాటను మీరూ వినీ చూసీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ప్రేమనగర్ (1971)సంగీతం : కె.వి....

శుక్రవారం, అక్టోబర్ 24, 2014

ఏడనున్నాడో ఎక్కడున్నాడో...

రాజమకుటం సినిమాలోని ఒక చక్కని పాట మీకోసం... చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రాజమకుటం ( 1961)సంగీతం :  మాస్టర్ వేణు సాహిత్యం : అనిశెట్టిగానం :  పి. లీల ఓహొహొహో.. ఓహొహొహో..హోయ్ఏడనున్నాడో ఎక్కడున్నాడో.. నా చుక్కల ఱేడు..  ఏడనున్నాడో ఎక్కడున్నాడో..  చూడ చక్కని చుక్కల ఱేడు..  ఈడు జోడు కలిసినవాడుఏడనున్నాడో ఎక్కడున్నాడో..నా చుక్కల ఱేడు.. ఏడనున్నాడో...

గురువారం, అక్టోబర్ 23, 2014

దీపావళీ దీపావళి...

దీపావళి సందర్బంగా మిత్రులందరకూ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ గారి షావుకారు సినిమాలోని ఒక చక్కని పాట తలచుకుందామా. జానకి గారి ఇంటిపేరును షావుకారు గా మార్చేసిన ఈ సినిమా గురించి తెలియని తెలుగు వారు బహుశా తక్కువే ఉంటారేమో. ఈ పాట చిత్రీకరణ నాకు బాగా నచ్చుతుంది, మీరూ చూసి వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : షావుకారు (1950) సంగీతం : ఘంటసాల  సాహిత్యం : సముద్రాల  గానం...

బుధవారం, అక్టోబర్ 22, 2014

కాదు సుమా కలకాదు సుమా...

ఈ జంట ఎవరో ఒక కీలుగుఱ్ఱమును ఎక్కి ఆకాశయానం చేస్తూ ఇది కల కాదు సుమా అని ఒక కమ్మని పాట పాడుకుంటున్నారు, ఏవిటో ఆ విశేషం మనమూ వారితో కాసేపు విహరించి చూద్దాం పదండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు. చిత్రం : కీలుగుఱ్ఱం (1949) సాహిత్యం : తాపీ ధర్మారావు నాయుడు సంగీతం : ఘంటసాల గానం : ఘంటసాల, వక్కలంక సరళ కాదు సుమా కల కాదు సుమా కాదు సుమా కల కాదు సుమాఅమృత పానమును అమర గానమును అమృత పానమును అమర గానమునుగగన యానమును...

మంగళవారం, అక్టోబర్ 21, 2014

కమ్మని గీతాలే...

అంతం సినిమాలో నాకు నచ్చిన పాట ఈరోజు మీకోసం. ఈ పాటలో ఊర్మిళకి చిత్ర గారి గాత్రం బాగా నప్పింది. సిరివెన్నెల గారి సాహిత్యం చాలా బాగుంటుంది, తను అడవిలో ఉదయాన్ని వర్ణించిన తీరు, శీతాకోక చిలుకకు వనమంతా పరిచయమంటూ పరిచయానికి తనే బెస్ట్ గైడ్ అని చెప్పిన తీరు నాకు ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అంతం (1992) సంగీతం : ఆర్.డి. బర్మన్, మణిశర్మ సాహిత్యం : సిరివెన్నెల  గానం : చిత్ర ఓ మైనా...

సోమవారం, అక్టోబర్ 20, 2014

ఆ రోజు నా రాణి...

బృందావనం సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమాలలో ఒకటి. దానిలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్సే. నాకు ఇప్పటికీ ఆ పాటలు వింటూంటే ఈ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చి ఒక చక్కని అనుభూతి పొందుతాను. ఈ సినిమాలో సరదాగా సాగే ఒక చక్కని పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : బృందావనం (1992)సంగీతం : మాధవపెద్ది సురేష్రచన : వెన్నెలకంటిగానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకిఆ రోజు నా రాణి చిరునవ్వు...

ఆదివారం, అక్టోబర్ 19, 2014

ఎంతవారు కానీ...

మొహమ్మద్ రఫీ గారు తెలుగులో పాడిన ఈ సరదా ఐన పాటను ఈ ఆదివారం గుర్తు చేసుకుందాం. నేను ఎలాంటి మూడ్ లో ఎలాంటి సమయంలో ఈపాట విన్నా కూడా పెదవుల మీదకి ఒక చిరునవ్వు వచ్చిచేరుతుందనడంలో ఏ సందేహంలేదు. "బార్ బార్ దేఖో" అనే పాటకు తెలుగు రూపమే అయినా ఒక ఎవర్ లాస్టింగ్ ట్రూత్ ను ఇంత చక్కగా చెప్పిన సినారె గారిని అభినందిస్తూ.. నాకు చాలా ఇష్టమైన ఈపాట మీరూ వినండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : భలేతమ్ముడు...

శనివారం, అక్టోబర్ 18, 2014

నన్నేదొ సెయ్యమాకు...

సునీత, కీరవాణి, చంద్రబోస్ ఎవరికి వారే పోటీపడి పని చేసిన పాట.. సింహాద్రి సినిమాలోని ఈ "నన్నేదో సెయ్యమాకు" అనేపాట. ఈ పాట సునీత గారికి కొత్త అభిమానులను సంపాదించి ఉంటుందని నా అనుకోలు :-) కీరవాణి గారి కొన్ని ఫోక్ ట్యూన్స్ అమితంగా ఆకట్టుకుంటాయి. అపుడపుడు  సరదాగా వినడానికి నేను చాలా ఇష్టపడే ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : సింహాద్రి (2003)  సంగీతం : కీరవాణి  సాహిత్యం : చంద్రబోస్ గానం...

శుక్రవారం, అక్టోబర్ 17, 2014

ఇది స్వాతి జల్లు...

ఇళయరాజా గారి మరో రొమాంటిక్ ట్యూన్ ఇది దానికి తగినట్లే సాహితి గారి సాహిత్యం కూడా ఉంటుంది. సాహితి గారి పాటలలో మొదటి హిట్ సాంగ్ ఇదేనట. ఇందులో మనోగారి కన్నా జానకి గారి సింగింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. మనసుని నిజంగానే స్వాతి జల్లులో తడిపేసి గమ్మత్తైన అనుభూతిని పంచే ఈపాటను మీరూ విని ఆనందించండి. ఎంబెడెడ్ యూట్యూబ్ వీడియో వాన ఫోటోలతో చేసిన ప్రజంటేషన్. ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.   చిత్రం : జమదగ్ని(1988) సంగీతం...

గురువారం, అక్టోబర్ 16, 2014

ఒకటే కోరిక నిన్ను చేరాలనీ...

దొంగలకు దొంగ సినిమా కోసం సత్యం గారి స్వరకల్పనలో గోపీ గారు రచించిన "ఒకటే కోరిక" అనే పాట ఈ రోజు మీకోసం. నలుగురిలో పాడుకోడానికి కాస్త ఇబ్బంది పెట్టే లిరిక్స్ అయినప్పటికీ ప్రేయసీ ప్రియులకి మాత్రం ఒక అందమైన పాట ఇది. సత్యం గారి సంగీతం కూడా ఆకట్టుకుంటుంది, చిత్రీకరణ చూస్తే ఏదైనా హిందీ పాట ప్రేరణేమో అనిపిస్తుంటుంది. ఇందులో కృష్ణగారి డాన్స్ వర్ణించడానికి మాటలు చాలవు చూసి తీరాల్సిందే :-) ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం...

బుధవారం, అక్టోబర్ 15, 2014

ఓ గోపెమ్మో ఇటు రావమ్మో...

ధర్మాత్ముడు సినిమా కోసం కృష్ణంరాజు జయసుధలపై చిత్రీకరించిన ఈ పాట సరదాగా సాగుతూ అలరిస్తుంది. బాలూ సుశీల గారు కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ పాడారు అనిపిస్తుంటుంది. చిన్నప్పుడు రేడియోలో విన్నవెంటనే లిరిక్స్ కి అర్ధం పెద్దగా తెలియకపోయినా సత్యం గారి క్యాచీ ట్యూన్ ఆకట్టుకుని ఈజీగా ఉండి మ్యూజిక్ తో సహా తెగ హమ్ చేసేసే వాడ్ని. మైలవరపు గోపీ గారి లిరిక్స్ సింపుల్ అండ్ స్వీట్ అన్నట్లుగా ఉంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం...

మంగళవారం, అక్టోబర్ 14, 2014

కరివరద మొరను వినలేవా...

బాలు గారు సంగీత దర్శకత్వం వహించిన అతి కొద్ది సినిమాలలో ఒకటి బాపు గారు దర్శకత్వం వహించిన 'జాకీ'. ఈ సినిమాలో "అలామండి పడకే జాబిలి" అనే విషాద గీతం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇదే సినిమాలో హీరోయిన్ హీరోని బ్రతిమాలే సన్నివేశంలో వచ్చే 'కరివరద' పాట ట్యూన్ చాలా ఇంటెన్స్ గా ఉండి నాకు చాలా నచ్చుతుంది, మీరు కూడా విని ఆనందించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జాకి (1985) సంగీతం : బాలు సాహిత్యం : వేటూరి...

సోమవారం, అక్టోబర్ 13, 2014

మాఘమాస వేళలో...

కొన్నిపాటలు ఎన్నిసార్లు విన్నా అసలు బోర్ కొట్టడమనే మాటే ఉండదు అలాంటివాటిలో ఇదీ ఒకటి. జాతర సినిమా కోసం జి.కె.వెంకటేష్ గారి స్వర సారధ్యంలో మైలవరపు గోపీ గారి రచన. అప్పటివరకూ చిన్న పిల్లలకి మాత్రమే పాడుతున్న శైలజ గారు కథానాయిక కోసం పాడిన మొదటి పాటట ఇది. నాకు ఎంతో ఇష్టమైన పాటను మీరూ వినండి. ఈ పాట వీడియో ఎక్కడా దొరకనందువలన స్వరాభిషేకంలో శైలజ గారు పాడిన వీడియోను ఇక్కడ ఎంబెడ్ చేసి ఇస్తున్నాను. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం...

ఆదివారం, అక్టోబర్ 12, 2014

బల్లకట్టు బుల్లెబ్బాయి...

పట్నంలో చదువుకోడానికి వెళ్ళిన పల్లె కుర్రాడు తిరిగి వచ్చీ రావడంతోనే ఇంటికి వెళ్ళేకన్నా ముందు తన స్నేహితులను ఊరి విశేషాల గురించి అడుగుతూ పాడే ఈపాట చాలా బాగుంటుంది. సుహాసిని గారు దర్శకత్వం వహించిన 'ఇందిర' సినిమాలోనిదీ పాట. ఇది డబ్బింగ్ పాట అని అనిపించనివ్వకుండా తమిళ్ వర్షన్ ని అక్కడక్కడ కాస్త మార్చి చాలా చక్కగా వ్రాసారు సిరివెన్నెల గారు. రహ్మాన్ సంగీతం కూడా చాలా హుషారుగా సాగుతుంది. ఈ పాట ఆడియో వినాలంటే యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.