
చంద్రబోస్ పాటలలో చాలాసార్లు తను సినీరంగంలో ప్రవేశించగలగడానికి కారణమైన ప్రాస కోసం ప్రయాస పడినట్లు కనిపించినా కొన్ని సార్లు అందులోనే చక్కని సాహిత్యాన్ని కూడా గమనించవచ్చు ముఖ్యంగా పాటకోసం తను ఎన్నుకునే థీం నాకు బాగా నచ్చుతుంది. డమరుకం సినిమాలోని ఈ లాలిపాటని గమనించండి ఎంత బాగారాశారో.
ఏ అమ్మకైనా తన బుజ్జాయికన్నా ప్రియమైన వాళ్ళెవరుంటారు చెప్పండి తను చేసే ప్రతిపని ఆ అమ్మకి అపురూపమే కదా ఇదే భావనని పల్లవి లోనూ మొదటి చరణంలోను వివరించిన చంద్రబోస్ రెండవ...