బుధవారం, అక్టోబర్ 24, 2012

నేస్తమా నేస్తమా..

కొత్తపాటల్లో లిరికల్ వాల్యూస్ వెతుక్కోడం చాలా కష్టమౌతున్న ఈ రోజుల్లో వచ్చిన ఈ పాటలో ముఖ్యంగా పల్లవి భాస్కరభట్ల పాటలా కాక కవితలా రాశారనిపించింది. దానికి చక్కని దేవీశ్రీప్రసాద్ సంగీతం, అందమైన శ్రీకృష్ణ & హరిణిల స్వరం తోడై ఈ మధ్య నేను తరచుగా వినే పాటలలో ఈపాటను ముందుంచేలా చేశాయి. మీరూ వినండి. పూర్తి పాట ఆడియో రాగాలో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : మరుకం (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : శ్రీకృష్ణ , హరిణి

నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
నేననే పేరులో నువ్వు , నువ్వనే మాటలో నేను
ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా
ఓ హో ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే
ఉండదా నిండుగా మనలాగా..ఆ ..ఆ

ఓహనేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

నువ్వంటే ఎంతిష్టం.. సరిపోదే ఆకాశం..
నాకన్నా నువ్విష్టం .. చూసావా ఈ చిత్రం..
కనుపాపలోన నీవే కల ..ఎద ఏటిలోన నువ్వే అల
క్షణ కాలమైనా చాల్లె ఇలా ..అది నాకు వెయ్యేళ్ళే ..
ఇక ఈ క్షణం.. కాలమే.. ఆగిపోవాలి.. ఓ..

నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

అలుపొస్తే తల నిమిరే చెలినవుతా నీకోసం..
నిదరొస్తే తల వాల్చే ఒడినవుతా నీకోసం..
పెదవంచు పైన నువ్వే కదా..
పైటంచు మీద నువ్వే కదా..
నడుమొంపు లోన నువ్వే కదా..
ప్రతి చోట నువ్వేలే..
అరచేతిలో.. రేఖలా.. మారిపోయావే ... ఓ

నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

9 comments:

ఈ పాట లిరిక్స్ నాక్కూడా నచ్చాయి వేణు గారు, కానీ శ్రీకృష్ణ గొంతులో మళ్ళీ, మళ్ళీ వినలేకపోయా ఆ పాటని. ఆ అబ్బాయి గొంతు బుద్ధిమంతుడిలాగా ఆక్ట్ చేస్తున్న ఏఎన్నార్ లా , చాలా ఆర్టిఫిసియల్గా అనిపిస్తుంది నాకు.

Mahek గారు శ్రీకృష్ణ గొంతు భలేగా పోల్చారండీ :) వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

ధాంక్స్ రాజ్.. అలాగే నువ్వడిగితే కాదంటానా వేస్తా.

వేణు గారు...చాలా బాగుందండి పాట ....ఇప్పుడే ఫస్ట్ టైం విన్నాను....తెలుగులోకి డబ్బింగ్ అయిన హిందీ సీరియల్స్ పుణ్యమా అని టీవీ చూడటమే మానేసా నేను....ఇక నాగ్-అనుష్క కాంబినేషన్ అంటేనే మనకెందుకులే అని ఈ సినిమా పాటలు డౌన్లోడ్ కూడా చేసుకోలేదు....ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటా....థాంక్స్ అండి :)

Mahek గారు....మీ కామెంట్ అదిరిందండి :) నవ్వి నవ్వి పొట్ట నెప్పివచ్చేసింది....హహ్హహ్హా!!!!

ధన్యవాదాలు కావ్యాంజలి గారు. దేవీశ్రీప్రసాద్ మీద ఏదో చిన్న నమ్మకం అండీ అందుకే తన పాటలు అనగానే వెంటనే డౌన్లోడ్ చేస్తుంటాను :-) అదీకాక టీవీలో తెగ ప్రమోట్ చేస్తున్నాడులెండి ఈ పాట.

అవును. అందమైన పాట. మా పిల్లలు ఈ పాట మీద పారడీ పాడుతుంటే మొన్న విని ఆశ్చర్యపోయా..

నేస్తమా, నేస్తమా, వాడికి ఆస్తమా, ఆస్తమా
చూసి వస్తమా, వస్తమా నాకోసం?

థాంక్స్ కృష్ణప్రియ గారూ.. హహహ పేరడి సూపరుందండీ :-))

ఈ పాట నాకు బలే ఇష్టం, కాని ఎప్పుడూ పెద్దగా లిరిక్స్ పై ద్యాస పెట్టలేదు. ఈ రోజు ఎందుకో లిరిక్స్ చూడాలనిపించి వెతికితే మీ బ్లాగ్ కనబడింది. మీ బ్లాగే కనబడంతం నిజంగా ఎంత ఆనందమో ......

నా ఈ సెలవుదిన(ఆదివారం) ఆనందంలో మీ పాత్రకు నా ధన్యవాదములు. Thanks Venu gaaru.

- Kiran

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.