బుధవారం, డిసెంబర్ 30, 2009

ఒకటే జననం.. ఒకటే మరణం..

చాలా రోజులుగా రాద్దాం అనుకుంటున్న ఈ టపా అనుకోకుండా ఈ పాట ఈ వారం ఈనాడు ఆదివారం సంచిక లో రచయిత సుద్దాల అశోక్ తేజగారి వ్యాఖ్యానంతో కనిపించే సరికి వెంటనే ప్రచురించేస్తున్నాను. ఈ సినిమా శ్రీహరి సినిమాల్లో నాకు నచ్చిన వాటిలో ఒకటి, కాస్త లాజిక్కులను పక్కన పెట్టి చూస్తే కంట్రోల్డ్ యాక్షన్ తో ఆకట్టుకుంటుంది ఒక సారి ఛూసి ఆనందించవచ్చు. ఇది నచ్చడానికి మరో కారణం సింధుమీనన్ కూడా లేండి. తన మొదటి తెలుగు సినిమా అనుకుంటాను మోడర్న్ డ్రస్సుల్లో కాకుండా మన పక్కింటి అమ్మాయిలా...

మంగళవారం, డిసెంబర్ 22, 2009

మిడిసిపడే దీపాలివి !!

అప్పట్లో దూరదర్శన్ చిత్రలహరిలో ఒకటి రెండు సార్లు ఈ పాట చూసిన గుర్తు. చంద్రమోహన్ నల్లశాలువా ఒకటి కప్పుకుని ఏటి గట్టున అటు ఇటు తిరుగుతూ తెగ పాడేస్తుంటాడు. అతనికోసం కాదు కానీ నాకు చాలా ఇష్టమైన ఏసుదాస్ గారి గొంతుకోసం ఈ పాటను శ్రద్దగా వినే వాడ్ని. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయ్ అనిపించేది. నా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం డిపార్ట్మెంట్ డే సంధర్బంగా జరిగిన పాటలపోటీలో నేను తప్పక పాల్గొనాలి అని మావాళ్ళంతా డిసైడ్ చేశారు. ర్యాగింగ్ పీరియడ్ లో బలవంతంగా నాతో పాడించిన పాటలను కాస్తో కూస్తో రాగయుక్తంగా పాడేసరికి నే బాగా పాడతాను అనే అపోహలో ఉండేవారు. సరే ఏ పాటపాడాలి అని తర్జన భర్జనలు పడటం మొదలుపెట్టాను. జేసుదాస్ పాటే పాడాలి అని మొదటే నిర్ణయించుకున్నాను కానీ ’ఆకాశదేశానా’,...

ఆదివారం, డిసెంబర్ 13, 2009

ఓ నిండు చందమామ !!

లేతమావి చిగురులు అప్పుడే తిన్న గండు కోయిలలా... ఆ పరమేశ్వరుడు గరళాన్ని నిలిపినట్లు ఇతనెవరో అమరత్వాన్ని సైతం త్యాగం చేసి అమృతాన్ని తన గొంతులోనే నిలిపివేసాడా? ప్రతి పాటలోనూ అదే మాధుర్యాన్ని ఒలికిస్తున్నాడు అనిపించేటట్లు, తన విలక్షణమైన గళంతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసే అద్భుతమైన గాయకుడు కె.జె.ఏసుదాసు. తను పాడినది కొన్ని పాటలే అయినా ఆయన పాటలను పదే పదే ఇప్పటికీ వింటున్నారంటే ఆపాటల సంగీత సాహిత్యాలు ఒక కారణమైనా ఆయన గళం లోని మాధుర్యం సైతం పెద్ద పాత్ర వహిస్తుంది...

బుధవారం, డిసెంబర్ 09, 2009

మల్లెలు పూసే... వెన్నెల కాసే...

బాలు గారు పాడిన ఈ పాట నాకు చాలానచ్చే పాటలలో ఒకటి. హిందీలో కిషోర్ కుమార్ గారి పాటలలో సాహిత్యం, ట్యూన్ ఒక అందమైతే కిషోర్ కలిపే సంగతులు మరింత అందాన్నిస్తాయి. మెలొడీ + హిందీ అస్వాదించలేనంత చిన్న వయసు లోకూడా నేను కిషోర్ పాటలు ఈ జిమ్మిక్కుల కోసం వినే వాడ్ని. ఉదాహరణ కి దూరదర్శన్ లో ఆదివారం ఉదయం వచ్చే రంగోలీ లో ఈ పాట ఎక్కువగా వేసే వాడు. "చలాజాతాహూ కిసీకే దిల్ మే..." ఈ పాటలో మధ్య మధ్యలో కిశోర్ విరుపులు సాగతీతలు భలే ఉండేవి. ఇలాంటివే ఇంకా చాలా పాటలు ఉన్నాయ్.ఇక...

ఆదివారం, నవంబర్ 22, 2009

మాలిష్ - మల్లెపువ్వు

రావుగోపాల్రావు గారి గురించి నేను ఇపుడు ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏమీ లేదు భీకరమైన రూపం లేకున్నా ఆహర్యం, డైలాగ్ డెలివరీతో ప్రతినాయక పాత్రకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారాయన. ముత్యాలముగ్గు సినిమాలో సెగట్రీ అంటూ పరమ కిరాతకమైన డైలాగ్ సైతం నిమ్మళంగా చెప్పి వెన్నులో వణుకు పుట్టించినా, వేటగాడు లో ప్రాసల పరోఠాలు తినిపించినా ఆయనకే చెల్లింది. ఆ ప్రాసలు ఇదిగో ఇక్కడ చూడండి.ఈ విలనిజం ఒక ఎత్తైతే నాకు ఆయన మంచివాడుగా చేసిన సాధారణమైన, హాస్య పాత్రలు కూడా చాలా నచ్చుతాయి. వాటిలో ఈ మాలీష్ పాత్ర ఒకటి. మల్లెపువ్వు చిత్రం లో గురువా అంటూ శోభన్‍బాబుకు సాయం చేసే ఓ మాలిష్ చేసుకునే మంచివాడి పాత్రలో అలరిస్తారు. ఆ పాత్రలో తన పై చిత్రీకరించిన ఈ పాట నా చిన్నపుడు నాకు నచ్చే హాస్యగీతాలలో...

ఆదివారం, అక్టోబర్ 25, 2009

కుహు కుహూ కూసే కోయిల

కొన్ని పాటలు వింటున్నపుడు ఆ పాటలు మనం మొదటి సారి విన్నప్పటి పరిస్థితులు లేదా ఆ పాటను తరచుగా విన్నప్పటి పరిస్థితులు అలా సినిమా రీళ్ళలా కదులుతూ ఉంటాయి. పాట తో పాటు అప్పటి వాతావరణం, పక్కన ఉన్న వ్యక్తులు, ఙ్ఞాపకాలూ అన్నీ కాన్వాస్ పై అలా కదులుతుంటాయి. నాకైతే ఒకోసారి ఆ సమయం లో పీల్చిన గాలి తో సహా గుర్తొస్తుంటుంది. ఈ పాట అలాటి పాటలలో ఒకటి. ఎనభైలలో విజయవాడ వివిధభారతి కార్యక్రమం లో తరచుగా వినే ఈ పాట ముందు వచ్చే కోయిల కుహు కుహు లూ, అందమైన సంగీతం విన్న మరుక్షణం ఏదో తెలియని మధురమైన అనుభూతికి లోనవుతాను. సాయంత్రం మొక్కలకు నీళ్ళుపోసేప్పుడు అప్పటి వరకూ ఎండకి ఎండిన మట్టి నుండి వచ్చే మధురమైన సువాసన ముక్కుపుటాలకు తాకిన అనుభూతికి గురౌతాను.పాట రాసినది వేటూరి గారే...

శుక్రవారం, అక్టోబర్ 16, 2009

నీవుంటే -- స్నేహం (1977) by Bapu

ఈ సినిమా ను దానిలోని పాటలను తన వ్యాఖ్యల ద్వారా నాకు పరిచయం చేసిన కృష్ణగీతం బ్లాగర్ భావన గారికి, పాటలను అందించిన స్వరాభిషేకం బ్లాగర్ రమేష్ గారికి, తృష్ణవెంట బ్లాగర్ తృష్ణ గారికి, దీప్తిధార బ్లాగర్ సిబిరావు గారికి ధన్య వాదాలు తెలుపుకుంటూ, ఇంత మంచి పాటలను నా బ్లాగ్ లో పెట్టకుండా ఉండలేక ఈ పాటల సాహిత్యాన్నీ, వినడానికి వీలుగా వీడియో మరియూ ఆడియో లింకు లను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అందరికి మరో మారు ధన్యవాదాలు. నీవుంటే వేరే కనులెందుకూ అంటూ సాగే పాట పల్లవి ఎంత మధురంగా ఉందో.. సినారే గారికి నిజంగా హ్యాట్సాఫ్. ఆహ్లాదకరమైన సంగీతాన్నందించిన కె.వి.మహదేవన్ గారికి డబల్ హ్యాట్సాఫ్...చిత్రం : స్నేహం.సంగీతం : కె.వి.మహదేవన్.సాహిత్యం : సి.నారాయణరెడ్డి.గానం: యస్.పి....

గురువారం, అక్టోబర్ 15, 2009

ఓ రెండు హాస్య సన్నివేశాలు..

యాతమేసి తోడినా ఏరు ఎండదు అంటూ నిన్న విషాదం లో ముంచేశాను కదా, నా బ్లాగ్ లో మరీ ఇంత విషాదాన్ని మొదటి పేజి గా ఉంచడం ఇష్టం లేక నాకు నచ్చిన ఓ రెండు హాస్య సన్నివేశాలను ఇక్కడ ఉంచుతున్నాను. మొదటిది "బావగారు బాగున్నారా" సినిమా లోనిది. ఇందులో బ్రహ్మం హాస్యం అలరిస్తుంది, దాని తర్వాత నాకు నచ్చే హాస్యం కోట శ్రీనివాసరావు, శ్రీహరి కాంబినేషన్ లోనిది. ప్రత్యేకించి ఈ సన్నివేశం లో శ్రీహరి మూత తీయడానికి నానా హైరానా పడుతుంటే కోట పక్కనుండి "నరం బెణుకుద్ది.. నరం బెణుకుద్ది..." అని శ్రీహరితో అనే మాటలు, "తీసేస్తాడు.. తీసేస్తాడు.." అంటూ శ్రీహరిని సమర్ధిస్తూ చెప్పే డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. ఇంకా చివర్లో "నా వెదవతనం తో పోలిస్తే నీ వెదవతనం ఒక వెదవతనమట్రా.." లాంటి మాటలతో...

బుధవారం, అక్టోబర్ 14, 2009

యాతమేసి తోడినా..

జాలాది గారి కలం నుండి జాలువారిన ఈ పాట నాకు నచ్చిన పాటల్లో ఒకటి, మొన్న ఈటీవీ ఝుమ్మంది నాదం కార్యక్రమం లో బాలు గారు ఈ పాట గురించి చెప్పిన దగ్గర నుండి నన్ను మరింత గా వెంటాడుతుంది, సరే బ్లాగేస్తే ఓ పనైపోతుంది లే అని ఈ ప్రయత్నం. చిన్నతనం లో నేను రామారావు కి వీర ఫ్యాన్ కం ఏసి ని. అయితే నేను ఆరోతరగతి లోనో ఏడులోనో ఉన్నపుడు అప్పట్లో కాలేజి లో చదివే మా జోసఫ్ బావ "ఠాట్ రామారావు ఏంటిరా వాడు ముసలోడు అయిపోయాడు ఇప్పుడు అంతా చిరంజీవిదే హవా, ఖైదీ చూశావా, గూండా చూశావా, సూపర్ డ్యాన్స్ లు ఫైట్ లు గట్రా..." అని ఫుల్ ఎక్కించేసి చిరు సినిమాలు చూపించేసి నన్ను చిరంజీవి ఫ్యాన్ గా మార్ఛేశాడు. మా బావ మాటల ప్రభావంతో సినిమాలు చూసిన నేను కూడా ఆహా కేక అని మురిసిపోయాను అప్పట్లో...

సోమవారం, సెప్టెంబర్ 28, 2009

తల ఎత్తి జీవించు -- మహాత్మ

క్రియేటివ్ కృష్ణవంశీ దర్శకత్వం లో వస్తున్న శ్రీకాంత్ వందవ చిత్రం "మహాత్మ" లో సిరివెన్నెల గారు రచించిన ఈ రెండు పాటలూ, విన్న వెంటనే బాగున్నాయి అనిపించి బ్లాగ్ లో పెట్టేయాలనిపించింది. ఈ లిరక్స్ ని మా ఆర్కుట్ కమ్యునిటీ లో కష్టపడి టైప్ చేసి ముందే పోస్ట్ చేసిన ఫణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వల్ప మార్పులతో ఇక్కడ మీ కోసం. "ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ" పాట లో "సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి" లాటి పంక్తులు రాయడం సిరివెన్నెలగారికే...

ఆదివారం, సెప్టెంబర్ 27, 2009

లేడీస్‍టైలర్ -- హాస్య సన్నివేశం

ఎంత పాటల బ్లాగ్ అయితే మాత్రం అస్తమానం పాటలే వినిపిస్తే రొటీన్ అయిపోద్దని కాస్త వెరైటీ గా ఈ రోజు హాస్య సంభాషణ వినిపిద్దాం అని ఓ చిన్న ప్రయత్నం. లేడీస్ టైలర్ లోని ఈ హిందీ పాఠం సీన్ చూసి నవ్వుకోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. వంశీ గారి దర్శకత్వం లో మాటల రచయిత తనికెళ్ళ భరణి హిందీ తో చేసిన మాటల గారడి ఇక్కడ... అప్పుడప్పుడూ చూసి రిలాక్స్ అవ్వి నవ్వుకోడానికి సరదాగా బాగుంటుంది అని...హె హె అదీ..అబ్ టైం క్యాహువా..మై కబ్ ఆనేకు కహే ఆప్ కబ్ ఆయే..అగర్ రోజ్ అయిసే హీ దేర్ కరే తొ ముఝ్ సే నహీ హోగా..ఓహో ఇవ్వాళ హిందీ పాఠం గావల్ను.బీచ్ మే అసిస్టెంట్ సీతారాముడు హై ఓ ఖాతా హై.. ఇంకానేమోబట్టల సత్యం హై, శీనూ భీ హై ఓ ఢరాతా హై… బెదిరిస్తాడండీ.. ఇసీలియే మై హిందీ మే...ఆపూ..నేమాట్లాడింది...

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

తారలు దిగి వచ్చిన వేళా

నిన్న సెప్టెంబరు 21 న అక్కినేని గారు తన పుట్టిన రోజు జరుపుకున్న సంధర్భంగా అనుకుంటాను. ఒక టీవీ చానల్ వారు ప్రేమాభిషేకం సినిమా వేసారు. అప్పటి వరకూ రిమోట్ లో ఛానల్ బటన్ కి నా వేలికి పోటీ పెట్టి పందెం వేసి ఆడుకుంటున్న వాడ్ని హఠాత్తుగా ఈ పాట వినపడటం తో అక్కడే ఆగిపోయాను... ఈ సినిమా రిలీజ్ అయిన సమయం లో నేను చాలా చిన్న వాణ్ణి కాని అప్పుడప్పుడే కాస్త ఊహ తెలుస్తుంది. సినిమాల్లో యన్టీఆర్ గారి ఎయన్నార్ గారి స్టెప్పు లు ఇంట్లో వేసి అందరిని అలరించే రోజులు అనమాట. నాన్న నా టాలెంట్ కి ముచ్చట పడి ఒక బెల్ బోటం ప్యాంటు కుట్టిస్తే మనం అదేసుకుని వీర లెవల్ లో హీరోలా ఫీల్ అయి అన్నగారి స్టెప్పులు తెగ వేసే వాళ్ళం.సరే ఇక ఈ పాట విషయానికి వస్తే నాకు చాలా ఇష్టమైన పాట అప్పట్లో...

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009

ఎవరేమీ అనుకున్నా..

రాజశేఖరుని చూసినపుడల్లా నాకు ఆయన మొండి తనం దాని వెంటనే యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో వచ్చిన బడ్జెట్ పధ్మనాభం సినిమాలోని ఈ పాటా గుర్తొచ్చేస్తాయి. అప్పుడప్పుడూ నాకు కాస్త inspiration ఇంధనం అవసరమైనపుడు వినే ఈ పాట పల్లవి లో ధ్వనించే మొండి తనాన్ని రాజశేఖరుడు అణువణువునా ఒంట బట్టించుకున్నారు అనిపిస్తుంది. ఈ మొండితనం తో తను గెలుచుకున్న హృదయాలు ఎన్నున్నాయో బద్ద వైరం పెంచుకున్న హృదయాలు అన్నే ఉన్నాయి. కానీ ఆయన ఇక లేరు అని తెలుసుకుని "అయ్యో" అనుకోని హృదయం...

గురువారం, ఆగస్టు 27, 2009

పద్మవ్యూహం

ఒకప్పుడు శ్రీశ్రీ గారు చాలా డబ్బింగ్ పాటలు రాశారు అని ఆయన శ్రీమతి గారు రాసిన పుస్తకం లో చదివిన గుర్తే కానీ నాకు ఊహ తెలిసినంత వరకూ డబ్బింగ్ పాటల రచయిత అంటే రాజశ్రీ గారే.. రహ్మాన్ సంగీత దర్శకత్వం మొదలు పెట్టిన మొదటి లో స్వర పరచిన ఈ పద్మవ్యూహం సినిమా పాటలు చాలా బాగుంటాయ్. వాటిలో "కన్నులకు చూపందం" "నిన్న ఈ కలవరింత" మరింత ప్రత్యేకం. పాట చూస్తున్నపుడు లిప్ సింక్ లో తేడాలు, డబ్బింగ్ పాటలలో ఉండే చిన్న చిన్న భాషా దోషాలు ఉన్నాకూడా కమ్మనైన సంగీతం వాటిని సులువుగా క్షమించ గలిగే లా చేస్తుంది. కన్నులకు చూపందం పాట సాహిత్యం కూడా చాలా బాగుంటుంది. ఇక రేవతి "ప్రేమ" సినిమా తో పోలిస్తే ఈ సినిమా సమయానికి కాస్త వయసుమీద పడినట్లు అనిపించినా అందంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా...

శనివారం, ఆగస్టు 15, 2009

జయ జయ జయ ప్రియ భారత

బ్లాగ్ మితృలందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశభక్తి గీతాల జాబితా కి అంతులేకున్నా... నన్ను బాగా ఆకట్టుకున్న గీతం దేవులపల్లి వారి "జయ జయ ప్రియభారత ". నేను ఆరవతరగతి లో ఉండగా మా హిందీ మాష్టారు నా గొంతు బావుందని (అప్పట్లో బాగానే ఉండేది లెండి) ఈ పాట, ఇంకా "దేఖ్ తెరే సంసార్ కి హాలత్ క్యా హొగయీ భగవాన్...కిత్‌నా బదల్ గయా ఇన్సాన్..." అనే పాటా నేర్పించారు. ఈ పాట ఎన్ని సార్లు విన్నా నాకు మొదట ఆయనే గుర్తు వస్తారు. ఇదే పాట చిరంజీవి గారి రాక్షసుడు సినిమాలో...

ఈ బ్లాగ్ ఎందుకంటే ??

అతిథులకు నమస్కారం. ఓ ఏడాది క్రితం నా ఙ్ఞాపకాలు పదిల పరచుకోవాలని మొదలు పెట్టిన నా బ్లాగ్ లో నా ఙ్ఞాపకాల కంటే పాటల గురించే ఎక్కువ టపాలు ప్రచురించాను. నాకు పాటలంటే అంత ఇష్టం. కానీ నేను ఏవిధమైన సంగీతం నేర్చుకోలేదు కేవలం శ్రోతని మాత్రమే.. అప్పుడప్పుడూ శ్రుతి, రాగం, తాళం లాటి వాటి తో పని లేకుండా పాటలు పాడుకుంటుంటాను. కాలేజి రోజులలో నా సౌండ్ బాగుందని ఒకటి రెండు సార్లు స్టేజ్ పై కూడా పాడనిచ్చారు లేండి అది వేరే విషయం. సరే ఇంత పాటల పిచ్చి ఉన్న నేను పాటల ప్రధానంగా ఒక బ్లాగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అని చాలా రోజులగా ఆలోచించీ..చించీ..చించగా ఇప్పటికి దానికి ఒక కార్య రూపం ఇవ్వగలిగాను. తత్ఫలితమే ఈ బ్లాగు.నా మరో బ్లాగ్ లో ఇప్పటి వరకూ పోస్ట్ చేసిన పాటలన్నీ ఇక్కడికి...

శనివారం, ఆగస్టు 01, 2009

సిగలో.. అవి విరులో -- మేఘసందేశం

గత రెండు మూడు వారాలు గా ఈ పాట నన్ను వెంటాడుతుంది, ఎంతగా అంటే ఎక్కడో అడుగున పడిపోయిన నా కలక్షన్ లో వెతికి వెతికి వెలికి తీసి తరచుగా మళ్ళీ వినేంతగా. కారణం ఏమిటో తెలియదు కానీ ఈ ఆల్బం ఎందుకో సంవత్సరానికి ఒక్క సారైనా ఇలా బాగా గుర్తొస్తుంది. అప్పుడు ఒక నెల రెండు నెలలు వినేశాక కాస్త మంచి పాటలు ఏమన్నా వస్తే మళ్ళీ అడుగున పడి పోతుంది. కానీ అక్కడే అలా ఉండి పోదు మళ్ళీ హఠాత్తుగా ఓ రోజు ఙ్ఞాపకమొచ్చి మళ్ళీ తనివి తీరా వినే వరకూ అలా వెంటాడూతూనే ఉంటుంది. మంచి సంగీతం...

శనివారం, జులై 25, 2009

సీతాకళ్యాణం - వాగ్దానం(1961) సాహిత్యం

ఘంటసాల మాష్టారి గాత్ర మాధుర్యమో, శ్రీ రామ కథ లోని మహత్తో, పెండ్యాల వారి సంగీత మహిమో లేదా అసలు హరికధా ప్రక్రియ గొప్పతనమే అంతో నాకు సరిగా తెలియదు కానీ, ఈపాట ఎన్ని సార్లు విన్నా ఒళ్ళు పులకరిస్తూనే ఉంటుంది. రేలంగి, నాగేశ్వరరావు, కృష్ణకుమారి లపై చిత్రీకరించిన ఈ పాట లో విశేషమేమిటంటే.. చిత్రీకరణ లో ఎక్కడా శ్రీరామ కళ్యాణాన్ని చూపించరు కానీ కనులు మూసుకుని పాట వింటుంటే మాత్రం కళ్యాణ ఘట్టం అంతా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇది రాసినది శ్రీశ్రీ గారు అని మొదటి...

మంగళవారం, జూన్ 30, 2009

అలక పానుపు ఎక్కనేల-శ్రీవారి శోభనం

ఈ సినిమా నాకు పూర్తిగా చూసినట్లు గుర్తు లేదు ఎపుడో ఒక సారి టీవీ లో ఈ పాట వేస్తుంటేనో లేక సినిమా వేస్తుంటే పాట మాత్రమే చూసానో కూడా సరిగా గుర్తు లేదు కాని అప్పట్లో రేడియో లో క్రమం తప్పకుండా నేను వినే కొన్ని పాటలలో ఇదీ ఒకటి. మొదట్లో అంటే మరీ చిన్న తనం లో బామ్మ గారి కామెంట్స్ విని నవ్వుకోడానికి వినే వాడ్ని, కాస్త పెద్దయ్యాక భామ గారి పాట్లు అవగతమై పాట పూర్తి గా అర్ధమయింది :-) ఇక జానకమ్మ గారి గాత్రం గురించి నేనేం చెప్పినా తక్కువే... ఆ దోర నవ్వు దాచకే అని అంటూ ఆవిడ నవ్వే నవ్వు మనకే తెలియకుండా మన పెదవులపై చిరుమందహాసాన్ని నాట్యం చేయిస్తుంది. అంతెందుకు ఆవిడ శీతాకాలం అంటూ గొంతు వణికించడం వింటే ఎంత మండు వేసవి లో ఉన్నా మనకీ చలి వేసి వణుకు పుట్టేస్తుందంటే...

ఆదివారం, జూన్ 21, 2009

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె...

సంగీతాభిమానులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ (June 21st) శుభాకాంక్షలు...ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం అని ఉదయాన్నే తన విషెస్ తో తెలియచేసిన నేస్తానికీ, ఇంకా ఈ పాట తో విషెస్ చెప్పిన మరో నేస్తానికి థ్యాంక్స్ తెలుపుకుంటూ మీ కోసం ఈ పాట. ఇక్కడ వినండి చిత్రం : అమ్మచెప్పిందిసంగీతం : కీరవాణిసాహిత్యం : సుద్దాల అశోక్ తేజగానం : ప్రణవిమాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతంఅందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతంసంగీతం తో చేస్తే స్నేహంపలికిందల్లా గీతం...||మాటల్తో||కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే..కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే..పాటల్లె ఎగిరి రాదా.. నీ గుండె గూడైపోదా..సంగీతం తో చేస్తే స్నేహంహృదయం లయలే గీతం...||మాటల్తో||గోరుముద్దలో కలిపి పెట్టే గారమొక పాటపాఠశాలలో...

శుక్రవారం, జూన్ 19, 2009

పల్లెటూరి పిల్లగాడా...పశులగాసే మొనగాడ..

ఒకో సారి హఠాత్తుగా, కారణం తెలియకుండా ఎప్పుడో విన్న పాట, చాలా రోజులుగా అసలు వినని పాట ఒకసారిగా గుర్తొచ్చి అలా ఒకటి రెండు రోజులు వెంటాడుతూ ఉంటుంది. మన మూడ్ కాని ఉన్న పరిసరాలు కానీ పట్టించుకోకుండా పదే పదే అదే హమ్ చేసేస్తాం. నన్ను గత రెండు రోజులుగా అలా వెంటాడుతున్న పాట "మాభూమి" చిత్రం లోని "పల్లెటూరీ పిల్లగాడ.." పాట. నిజానికి ఈ సినిమా గురించి గానీ పాట గురించి గానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాల కార్మిక వ్యవస్తనంతటినీ కాకున్నా పల్లెల్లో సాధారణంగా కనిపించే పిల్లల గురించి వాళ్ళ శ్రమని కూడా ఎలా దోచుకుంటారో తెలియచేస్తూ హృద్యంగా రాసిన సాహిత్యం ఒక ఎత్తైతే. ఈ పాట పాడిన సంధ్య గారి గాత్రం మరో ఎత్తు. పదునుగా ప్రశ్నిస్తున్నట్లు ఉంటూనే "ఓ..పాల బుగ్గలా...

శుక్రవారం, ఏప్రిల్ 03, 2009

రామా కనవేమి రా !!

శ్రీ రామ నవమి సంధర్బంగా తోటి బ్లాగరు లందరికీ, పాఠకులకూ, నా హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అంతా ఈ పాటికి పూజలు గట్రా ముగించుకుని రేడియో లో కళ్యాణం వింటూ ఉండి ఉంటారు. రేడియో లో వింటం ఏమిటి నా మొహం నేనింకా ఎనభైల లోనే ఉన్నాను !! ఇప్పుడన్నీ లైవ్ ప్రోగ్రాం లే కదా... సరే లెండి టీవీ లో చూస్తుండి ఉంటారు. నా మటుకు నాకు శ్రీరామ నవమి అనగానే మొదట గుర్తొచ్చేది భద్రాచలం లోని రాముని కళ్యాణం, ఆ వైభవానికి తగ్గట్టుగా ఇక ఉషశ్రీ గారి వ్యాఖ్యానం (ఇక్కడ క్లిక్...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.