గురువారం, ఆగస్టు 27, 2009

పద్మవ్యూహం

ఒకప్పుడు శ్రీశ్రీ గారు చాలా డబ్బింగ్ పాటలు రాశారు అని ఆయన శ్రీమతి గారు రాసిన పుస్తకం లో చదివిన గుర్తే కానీ నాకు ఊహ తెలిసినంత వరకూ డబ్బింగ్ పాటల రచయిత అంటే రాజశ్రీ గారే.. రహ్మాన్ సంగీత దర్శకత్వం మొదలు పెట్టిన మొదటి లో స్వర పరచిన ఈ పద్మవ్యూహం సినిమా పాటలు చాలా బాగుంటాయ్. వాటిలో "కన్నులకు చూపందం" "నిన్న ఈ కలవరింత" మరింత ప్రత్యేకం. పాట చూస్తున్నపుడు లిప్ సింక్ లో తేడాలు, డబ్బింగ్ పాటలలో ఉండే చిన్న చిన్న భాషా దోషాలు ఉన్నాకూడా కమ్మనైన సంగీతం వాటిని సులువుగా క్షమించ గలిగే లా చేస్తుంది. కన్నులకు చూపందం పాట సాహిత్యం కూడా చాలా బాగుంటుంది. ఇక రేవతి "ప్రేమ" సినిమా తో పోలిస్తే ఈ సినిమా సమయానికి కాస్త వయసుమీద పడినట్లు అనిపించినా అందంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా లో నాకు నచ్చిన పాటలు మీ కోసం.



చిత్రం : పద్మవ్యూహం
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

కన్నులకు చూపందం
కవితలకు ఊహందం
చిరు నవ్వు చెలికందం
సిరిమల్లి సిగకందం

||కన్నులకు||

కిరణాలు రవికందం సెలయేరు భువికందం
మగువలకు కురులందం మమతలకు మనసందం
పుత్తడి కి మెరుపందం పున్నమి కి శశి అందం ||2||
నాదాలు శృతికందం రాగాలు కృతికందం

||కన్నులకు||

వేకువకు వెలుగందం రేయంత అతివందం
వేసవికి వెన్నెలందం ఆశలకు వలపందం
తలపులే మదికందం వయసుకే ప్రేమందం ||2||
పాటకే తెలుగందం శ్రీమతికి నేనందం

||కన్నులకు||



చిత్రం : పద్మవ్యూహం
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ

నిన్న ఈ కలవరింతా లేదులే..
నేడు చిరుగాలి ఏదో అందెలే..
ఇదియే ప్రేమ అందునా..
వయసే పులకరించెనా..
హృదయం కరిగిపోయెనా.. ఓ మనసా!!

||నిన్న ఈ||

దైవముందంటినీ అమ్మనెరిగాకనే
కలలు నిజమంటినీ ఆశ కలిగాకనే
ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చూశాకనే
పూచినా పువ్వులా నవ్వులే ఓ దినం
వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం
సృష్టి ఉన్నంతదాకా ప్రేమయే శాశ్వతం..

||నిన్న ఈ||

నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే..
మాట లేకున్ననూ భాష ఉంటుందిలే..
ప్రేమయే లేక పోతే జీవితం లేదులే..
వాసనే లేకనే పూలు పూయొచ్చులే
ఆకులే ఆడకా గాలి కదలచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే

నిన్న ఈ కలవరింతా లేదులే..

నేడు చిరుగాలి ఏదో అందెలే..

ఇదియే ప్రేమ అందునా..
వయసే పులకరించెనా..
హృదయం కరిగిపోయెనా.. ఓ మనసా!!

||నిన్న ఈ||



చిత్రం : పద్మవ్యూహం
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : పి. సుశీల


కన్నులకు చూపందం
కవితలకు ఊహందం
తీగకే పూలందం
వారికే నేనందం

||కన్నులకు||

వానాగిపోయినను ఆకుపై చుక్కందం
అల చెదిరిపోయిననూ దరి నున్న నురుగందం
చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం
చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం
శ్రీవారి చూపులకు ఎప్పుడు నేనందం

||కన్నులకు||

అందాల వన్నెలకే అపురూప కురులందం
అనురాగ ముద్దరలే చెరిగిన బొట్టందం
మగువ లో ప్రేమొస్తే మనుగడే ఓ అందం
మగువ లో ప్రేమొస్తే మనుగడే ఓ అందం
నా తోడు నీ వుంటే చీకటే ఓ అందం

||కన్నులకు||

1 comments:

వేణు శ్రీకాంత్ గారు, ఒక్కోసారి ఈ అనువాద కవులు మూలానికి న్యాయం చెయ్యాలి అన్న దీక్షబూని ఇంత మంచి సాహిత్యాన్ని ఆ పాటల్లో నింపేస్తారనుకుంటానండి. [మునుపెప్పుడో విన్న] పాట మళ్ళీ వింటూ ఈ వ్యాఖ్య వ్రాస్తుంటే ఈ అనుభూతి బాగుంది. వానజల్లు చూస్తూ, వేడి మిరపకాయ బజ్జీలు తింటూ ప్రక్క మీద వాలివున్న హాయి మాదిరిగా వుంది. మీరు శ్రద్దగా చేస్తున్న ఈ కృషి మాకందరికీ పంచుతుంది ఆనంద రవళి. కృతజ్ఞతలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.