సోమవారం, మార్చి 13, 2017

హవ్వారే హవ్వా హైలేసో...

బుద్దిమంతుడు చిత్రంలోని ఒక అల్లరి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

హవ్వారే హవ్వా హైలేసో హహ్హ
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో
హవ్వారే హవ్వా...

పచ్చిమిరపకాయలాంటి పడుసు పిల్లరోయ్
దాని పరువానికి గర్వానికి పగ్గమేయరోయ్
పచ్చిమిరపకాయలాంటి పడుసు పిల్లరోయ్
దాని పరువానికి గర్వానికి పగ్గమేయరోయ్

వగలమారి చెప్పరాని పొగరుమోతురోయ్
ఆ వన్నెలాడి ఉడుక్కుంటే వదలమోకురోయ్
వగలమారి చెప్పరాని పొగరుమోతురోయ్
ఆ వన్నెలాడి ఉడుక్కుంటే వదలమోకురోయ్

హవ్వారే హవ్వా...హైలేసో..లెస్సో...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...

ఇంటికెళితె నిన్ను జూసి నవ్వుతుందిరో
దాని యెంట బడితె కంట బడితె కసురుతుందిరో
ఇంటికెళితె నిన్ను జూసి నవ్వుతుందిరో
దాని యెంట బడితె కంట బడితె కసురుతుందిరో

టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరో
టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరో
టెక్కంతా ఎగిరి పోయి ఎక్కీ ఎక్కీ ఏడ్చెరోయ్ 
ఓయ్.. ఓయ్.. ఓయ్

హవ్వారే హవ్వా...హైలేసో..హహ్హా...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...

చూడబోతె అవ్వాయి చువ్వ లాంటిదోయ్
జోడు కూడబోతె కులుకులాడి గువ్వ లాంటిదోయ్
చూడబోతె అవ్వాయి చువ్వ లాంటిదోయ్
జోడు కూడబోతె కులుకులాడి గువ్వ లాంటిదోయ్

జాంపండు లాంటి గుంట జట్టు గట్టరోయ్
అది జారిపోతె దారి కాసి పట్టు పట్టరో
జాంపండు లాంటి గుంట జట్టు గట్టరోయ్
అది జారిపోతె దారి కాసి పట్టు పట్టరో..

హవ్వారే హవ్వా హైలెస్సో అహ
హవ్వారే హవ్వా...హైలేసో..హహ్హా...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో..
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...


ఆదివారం, మార్చి 12, 2017

సుమం ప్రతి సుమం సుమం...

మిత్రులందరకూ హోలీ శుభాకాంక్షలు. మహర్షి చిత్రంలోని ఓ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడచ్చు. ఆల్బమ్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహర్షి (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : నాయని కృష్ణమూర్తి
గానం : బాలు, జానకి

ఆఆఆఅ....ఆఆఆఅ..ఆఆఅ...
ఆఆ..ఆఅ..ఆఆఆఆ...
తననానననా తననాననా
 
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కల కలలం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం

హ..హాఅ..ఆ.... ఆ... ఆ.... ఆ
ఆ.... హ...ఆ... ఆ.... ఆ

వేణువా వీణియా.. ఏవిటీ రాగము
వేణువా వీణియా.. ఏవిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం బృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు...
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా... ఆ....
ప్రేమ మహిమా.. నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం

హాఆఆ..
తార రత్తార రతార తారరత్తార రతార
ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ..

రంగులే రంగులు అంబరానంతట
రంగులే రంగులు అంబరానంతట
సగం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆ వేగమేది నాలోన లేదు
ఆ వేగమేది నాలోన లేదు
ప్రేమమయమూ....  ఆ...
ప్రేమ మయమూ నాదు హృదయం

భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
జగం అణువణువునా కలకలలం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం


శనివారం, మార్చి 11, 2017

లేడి కన్నులు రమ్మంటే...

అగ్గివీరుడు చిత్రం లోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అగ్గివీరుడు (1969)
సంగీతం : విజయా కృష్ణమూర్తి
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

లేడి కన్నులు రమ్మంటే
లేడి కన్నులు రమ్మంటే
లేత వలపులు జుమ్మంటే
లేడి కన్నులు రమ్మంటే
లేత వలపులు జుమ్మంటే
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓలమ్మీ సై సై సై ఓలమ్మీ సై
కన్నె మనసే నీదైతే
కలికి వెన్నెల తోడైతే
కన్నె మనసే నీదైతే
కలికి వెన్నెల తోడైతే
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓరబ్బీ సై సై సై ఓరబ్బీ సై

వాగుల గలగల ఉరుకి
తీగలా మెలికెలు తిరిగి
వాగుల గలగల ఉరుకి
తీగలా మెలికెలు తిరిగి
గుండెలో అల్లుకుపోతే
గువ్వలా గుసగుసపెడితే
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓలమ్మీ సై సై సై ఓలమ్మీ సై

కన్నె మనసే నీదైతే
కలికి వెన్నెల తోడైతే
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓరబ్బీ సై సై సై ఓరబ్బీ సై

వాలుగా చూపులు చూసి
పూలపై బాసలు చేసి
వాలుగా చూపులు చూసి
పూలపై బాసలు చేసి
ముద్దుగా వుందామంటె
ఇద్దరం ఒకటేనంటే
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓరబ్బీ సై సై సై ఓరబ్బీ సై

లేడి కన్నులు రమ్మంటే
లేత వలపులు జుమ్మంటే
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓలమ్మీ సై సై సై
 

శుక్రవారం, మార్చి 10, 2017

ఈనాటి ఈ బంధమేనాటిదో...

మూగమనసులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మూగ మనసులు (1963)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..

మబ్బులు కమ్మిన ఆకాశం.. మనువులు కలసిన మనకోసం
మబ్బులు కమ్మిన ఆకాశం.. మనువులు కలసిన మనకోసం
చలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది
చలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది

ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..

నీ జతలో..చల్లదనం నీ ఒడిలో..వెచ్చదనం
నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
అనుభవించి దినం దినం పరవశించనా
పరవశించి క్షణంక్షణం కలవరించనా

ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..

ఎవరు పిలిచారనో..ఏమి చూడాలనో
ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో
ఉప్పొంగి ఉరికింది గోదావరీ..గోదావరి
చెలికాని సరసలో.. సరికొత్త వధువులో
చెలికాని సరసలో.. సరికొత్త వధువులో
తొలినాటి భావాలు తెలుసుకోవాలని
ఉప్పొంగి ఉరికింది గోదావరీ

ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..


గురువారం, మార్చి 09, 2017

ఒకసారి ఆగుమా...

బండరాముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బండరాముడు (1959) 
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి / కె ప్రసాదరావు
సాహిత్యం : 
గానం : పి.సుశీల

సాగిపోయే ఓ చందమామా 
ఆగుమా.. ఒకసారి ఆగుమా..
ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా

ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా
ఒకసారి ఆగుమా ఓ చందమామ 
నీలి మబ్బుల తెర చాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
నీలి మబ్బుల తెర చాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
యెందుకో కనలేవు సూటిగ
యెందుకో కనలేవు సూటిగ
యెదలోన నీవైన శోధించుకొమ్మా

ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా
ఒకసారి ఆగుమా ఓ చందమామ

పరుల సొమ్మును హరియించు వాడే
పగటి పూటను ఇలు వీడలేడోయ్
పరుల సొమ్మును హరియించు వాడే
పగటి పూటను ఇలు వీడలేడోయ్
మంచి గా మనవోయి జాబిలి
మంచి గా మనవోయి జాబిలి
మలినమ్ము లికనైన తొలగించుకొమ్మా 

ఒక సారి ఆగుమా.. 
ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా
 మారేన నీ మనసు ఓ చందమామ
మారేన నీ మనసు ఓ చందమామ
ఓ చందమామ ఓ చందమామ

 

బుధవారం, మార్చి 08, 2017

లేచింది నిద్ర లేచింది...

మహిళా దినోత్సవం సంధర్బంగా మహిళామణులకు శుభాభినందనలు తెలుపుతూ గుండమ్మ కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం

ఎపుడో చెప్పెను వేమనగారు..
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఎపుడో చెప్పెను వేమనగారు..
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా ఆ...
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కూడా

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
పల్లెటూళ్ళలో పంచాయితీలు..
పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూళ్ళలో పంచాయితీలు..
పట్టణాలలో ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగముల ఆ...
అది ఇది ఏమని అన్ని రంగముల
మగధీరుల నెదిరించారు ...
నిరుద్యోగులను పెంచారూ...

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

చట్టసభలలో సీట్ల కోసం
భర్తలతోనే పోటీ చేసీ
చట్టసభలలో సీట్ల కోసం
భర్తలతోనే పోటీ చేసీ

ఢిల్లీ సభలో పీఠం వేసీ..ఈ ...
ఢిల్లీ సభలో పీఠం వేసీ
లెక్చరులెన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారూ

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది.. నిద్ర లేచింది..
నిద్ర లేచింది మహిళాలోకం
 

మంగళవారం, మార్చి 07, 2017

మురిపించే అందాలే...

బొబ్బిలి యుద్దం చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆదియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, సుశీల

సొగసు కేల్జడదాన .. సోగకన్నులదాన
వజ్రాలవంటి పల్వరుసదాన...
బంగారు జిగిదాన.. సింగారములదాన
నయమైన వయ్యారి నడలదాన...
తోరంపు కటిదాన ... తొణకు సిగ్గులదాన
పిడికిటనడగు నెన్నడుముదాన...

ఆ....ఆ.....ఆ.....ఆ....ఆ....ఆ...
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..
నా దానవు నీవేలే... నీ వాడను నేనేలే...
ఆ....ఆ....ఆ...ఆ...
దరి చేర రావే... సఖి నా సఖీ...
ప్రేయసి సిగ్గేల...

మరపించే మురిపాలే... కరిగించే కెరటాలై..ఈ..
మరపించే మురిపాలే... కరిగించే కెరటాలై..ఈ..
నిదురించే భావాల... కదిలించే ఈ వేళ...
ఆ....ఆ....ఆ...ఆ...
అదే హాయి కాదా.. సఖా నా సఖా..
 
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..

చెలి తొలి చూపే మంత్రించెనే
ప్రియసఖు రూపే మదినేలెనే
చెలి తొలి చూపే మంత్రించెనే
ప్రియసఖు రూపే మదినేలెనే
ఇది ఎడబాటు కనలేని ప్రేమా
ఇల మనకింక సురలోక సీమ
ఇది ఎడబాటు కనలేని ప్రేమా
ఇల మనకింక సురలోక సీమ

ఇదేహాయి కాదా... సఖా.. నా సఖా ...ఆ...ఆ...
 
మురిపించె అందాలే... అవి నన్నే చెందాలే

అనురాగాల రాగాలలో
నయగారాల గారాలలో
అనురాగాల రాగాలలో
నయగారాల గారాలలో
మధుమాధుర్యమే నిండిపొయే
హృదయానందమే పొంగిపొయే
మధుమాధుర్యమే నిండిపొయే
హృదయానందమే పొంగిపొయే
దరి చేర రావే ... సఖి..  నా సఖీ...

మురిపించే అందాలే అవి నన్నే చెందాలే

సోమవారం, మార్చి 06, 2017

మనసే వెన్నెలగా...

పిడుగు రాముడు చిత్రంలోని ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ

మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ..ఆ..

మనసే వెన్నెలగా.. మారెను లోలోన

విరిసే ఊహలలో.. పరువము నీవేలే
విరిసే ఊహలలో.. పరువము నీవేలే

మదనుడి కన్నులలో.. మగసరి నీదేలే
మదనుడి కన్నులలో.. మగసరి నీదేలే

సైగలతో.. కవ్వించే.. జవ్వని నీవే..

మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ..ఆ..

మనసే వెన్నెలగా.. మారెను లోలోన..

తలపుల పందిరిలో..ఓ.. కలలే కందామా
తలపుల పందిరిలో..ఓ.. కలలే కందామా

కరగని కౌగిలిలో.. కాపురముందామా
కరగని కౌగిలిలో.. కాపురముందామా

కనరాని.. తీరాలే.. కనుగొందామా..ఆ..

మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ..ఆ..

మనసే వెన్నెలగా.. మారెను లోలోన..


ఆదివారం, మార్చి 05, 2017

పగటిపూట చంద్రబింబం...

చిక్కడు దొరకడు చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చిక్కడు దొరకడు (1967)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సి.నారాయణరెడ్డి
గానం : పి.బి.శ్రీనివాస్, ఘంటసాల, సుశీల

విరిసిన ఇంద్ర చాపమో.. 
భువిన్ ప్రభవించిన చంద్రబింబమో
మరు పూబంతియో రతియో 
మల్లెల దొంతియో మోహ కాంతియో
సరస కవీంద్ర కల్పిత రసాకృతియో నవరాగ గీతియో.. 
వర సరసీరుహానన బిరాన వరించి తరింప జేయవే..

పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది?
అందమైన నీ మోమే అది గాకింకేది !
కాన రాని మన్మధుడేమో కనపించెను ఏడి .. ఏడి?
ఎదుటనున్న నీవేలే ఇంకా ఎవరోయి!

వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి
వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి
ఏవీ .. ఏవీ? అవి నీ సిగలోనే ఉన్నాయి
పదును పదును బాణాలెవో యెదను నాటుకుంటున్నాయి
పదును పదును బాణాలెవో యెదను నాటుకుంటున్నాయి
ఏవీ .. ఏవీ ? అవి నీ ఓర చూపులేనోయి
 
పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది ?
అందమైన నీ మోమే అది గాక ఇంకేది !

ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు
ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించెవు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించెవు
ఏమో.. ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో


శనివారం, మార్చి 04, 2017

పగలైతే దొరవేరా...

బంగారుపంజరం చిత్రంలోని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : బంగారు పంజరం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : జానకి

పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...
పక్కనా నువ్వుంటే
ప్రతిరాత్రి పున్నమి రా
పక్కనా నువ్వుంటే
ప్రతిరాత్రి పున్నమి రా
పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...

పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
రేయైతే వెన్నెలగా బయలంత నిండేరా..
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...

నే కొలిచే దొరవైనా...నను వలచే నా రాజువే
నే కొలిచే దొరవైనా...నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననే
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
ప్రతిరాత్రి..ఈ...ఈ.. పున్నమి రా...

పగలైతే దొరవేరా...
రాతిరి నా రాజువురా...
రాతిరి నా.... రాజువురా...

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.