గురువారం, ఏప్రిల్ 20, 2017

చీకటి వెలుగుల...

చీకటి వెలుగులు చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చీకటి వెలుగులు (1975)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు, సుశీల

చీకటి వెలుగుల కౌగిటిలో 
చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో 
చిందే కుంకుమ వన్నెలూ  
ఏకమైనా హృదయాలలో ఓ ఓ 
ఏకమైనా హృదయాలలో
పాకే బంగరు రంగులు..
 
ఈ మెడ చుట్టూ గులాబీలూ.. 
ఈ సిగపాయల మందారాలూ  
ఈ మెడ చుట్టూ గులాబీలూ.. 
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ.. 
చిక్కని ఈ అరుణ రాగాలూ 
అందీ అందని సత్యాలా.. 
సుందర మధుర స్వప్నాలా..

తేట నీటి ఈ ఏటి ఒడ్డునా
నాటిన పువ్వుల తోటా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా
నాటిన పువ్వుల తోటా 
నిండు కడవల నీరు పోసీ
గుండెల వలపులు కుమ్మరించీ 
ప్రతి తీగకు చేయూతనిచ్చీ
ప్రతి మానూ పులకింప చేసీ
 
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా 
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా

 
మరచి పోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ
మరచి పోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ

 
ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో 
మల్లెలతో వసంతం.. చేమంతులతో హేమంతం
మల్లెలతో వసంతం.. చేమంతులతో హేమంతం
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ
అన్ని మనకు చుట్టాలేలే..వచ్చీ పోయే అతిధులే

ఈ మెడ చుట్టూ గులాబీలు.. 
ఈ సిగపాయల మందారాలూ 
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ  
ష్.. గల గల మన కూడదూ ఆకులలో గాలీ
జల జల మనరాదూ అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ.. నిదరోయే కొలను నీరూ
కదపకూడదూ ఊ ఊ
ఒదిగుండే పూలతీగా.. ఊపరాదూ

 
కొమ్మపైనిట జంట పూలూ
గూటిలో ఇక రెండు గువ్వలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలు..
చిక్కని ఈ అరుణ రాగాలూ
 
మరచిపోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలి 

 

బుధవారం, ఏప్రిల్ 19, 2017

బేగంపేట బుల్లమ్మో...

ఈ రోజు శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలోని టైటిల్ సాంగ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శంకర్ దాదా ఎంబిబియస్ (2004)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : మనో

హే... బేగంపేట బుల్లమ్మో...
అరె పంజాగుట్ట పిల్లమ్మో...
హే... బేగంపేట బుల్లమ్మో...
అరె పంజాగుట్టా పిల్లమ్మో
బాడీలోన వేడే చూసి గోలీ వేస్తనమ్మో
హే... చింతల్ బస్తీ చిట్టమ్మో కుకట్ పల్లి కిట్టమ్మో
బాధే నీకు లేకుండానే దూదే రాస్తనమ్మో
హే...హైదర్ గూడా గున్నమో
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
అరె దోమల్ గూడ గుండమ్మో...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
హై... హైదర్ గూడ గున్నమ్మో...
దోమల్ గూడ గుండమ్మో
వాతంగానీ పైత్యంగానీ చెంతకొస్తే చాలు చిత్తు చిత్తమ్మో
నీ పేరేందబ్బాయా...
దా...దా.దా.దా.దా..దా...
శంకర్ దాదా... శంకర్ దాదా...
శంకర్ దాదాఎం.బి.బి.ఎస్.
హే... శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్..
శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్..
బోలో.....శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్..
శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్......

హే....బేగంపేట బుల్లమ్మో......
అరె పంజాగుట్టా పిల్లమ్మో...ఎహె..ఎహె....

హే.. నడవలేని వాళ్ళు ఉరికేలాగా
నే పెంచుకున్న కుక్క నొదులుతా..హె..హె..
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగా
నే రాసుకున్న కవిత చదువుతా..హె..హె..హె..
అరె మోసపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిటకరించేలా
మలయాళం ఫిల్ము చూపుతా.. హెయ్..
అరె జంతర్ మంతర్ జాలీ
అరె చూ మంతర కాళీ నీ బతుకుల్లో బాధలెన్నున్నా
చిన్న చిరునవ్వే ఉంది ఓరన్న ...హొయ్....స్

నిన్న హేసరనప్పా
నన్న హేసరా... అహహహ...
శంకర్ దాదా... శంకర్ దాదా ఎం.బి.బి ఎస్.
శంకర్ దాదాఎం.బి.బిఎస్...బోలో...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...

చేతకానితనము టీబీ అయితే
నే చూపు చూస్తే బాగుపడునులే
లంచగొండి తనము కలరా అయితే
నే చెయ్యి వేస్తే తిరిగిరాదులే....హే...హె...
అన్యాయాలు , అధర్మాలు అక్రమాలు కాన్సరైతే
అంతు తేల్చు ఆన్సరుందిలే...
అరె మోసమున్న బీ.పి. యమ స్వార్ధమన్న షుగరు
ప్రతి జబ్బుకీ వైద్యముందిలే
మరి అన్నిటికీ ఒకే మందులే... హే...

ఏం మందు గురూ...?
ఏం మందా...? అహహహ...
శంకర్ దాదా... శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్..బోలో....
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ కోజై బోలో
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...
ఊ...హ.....ఊ.....హ //11//
అరె శంకర్ దాదా శంకర్ దాదా
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...


మంగళవారం, ఏప్రిల్ 18, 2017

రామచిలక పెళ్ళికొడుకెవరే...

రామచిలక చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లింక్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రామచిలక (1978)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఏరులాంటి వయసు
ఎల్లువైన మనసు
ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో
ఏరులాంటి వయసు
ఎల్లువైన మనసు
ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో
తుళ్ళిపడకే..కన్నె పువ్వా
తుమ్మెదెవరో రాకముందే
ఈడు కోరే తోడుకోసం
గూడు వెతికే కన్నెమొలక

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఊరుదాటే చూపు
చూపు దాటే పిలుపు
ఆరుబైట అందమంతా
ఆరబోసేనే....
ఊరుదాటే చూపు
చూపు దాటే పిలుపు
ఆరుబైట అందమంతా
ఆరబోసేనే..
గోరువంకా..
గోరువంక దారివంక
కోరుకున్న జంట కోసం
ఆశలెన్నో అల్లుకున్న
అంతలోనే ఇంత ఉలుకా

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే


సోమవారం, ఏప్రిల్ 17, 2017

దేఖొ దేఖొ గబ్బర్ సింగ్...

గబ్బర్ సింగ్ సినిమాలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గబ్బర్ సింగ్ (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
గానం : బాబా సెహగల్, నవీన్ మాధవ్

Ladies and gentlemen,
boys and girls and all the fans
Here comes the Power king
and we call him Gabbar Singh

దేఖొ దేఖొ గబ్బర్ సింగ్ 
ఆల్ ఇండియకి హైపర్ సింగ్
వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్
వీడి బాడీ స్టీల్ కేసింగ్.. వీడి నరం నైలాన్ స్ట్రింగ్
వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్స్ కే కొత్త కలరింగ్
సత్తా కే స్పెల్లింగు లే లే లే
కొట్టాడు సొల్లింగు లే లే లే
కళ్ళల్లో ఫైరింగు లే లే లే
ఏ విలన్‌కైనా డెత్ వార్నింగు
బైబర్తే పుడింగు... ఎలేలేలే
పవర్‌కే బ్రాండింగు... ఎలేలేలే
హై ఎండు స్టైలింగు... ఎలేలేలే
వీడి ఫాలోయింగు మైండు బ్లోయింగు

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing
గబ్బర్... గబ్బర్... గబ్బర్...

మన జోలికొస్తే బ్రదరు.. మంటెత్తిపోద్ది వెదరు
మన చేతిదెబ్బ తిని పడుకున్నోళ్లు.. మళ్లీ లెగరు
మంచోణ్ణి గిల్లగలరు.. ఎహే.. చెడ్డోణ్ని గిచ్చగలరు
ఏలెక్కకందని నాలాంటోణ్ణి.. కెలికేదెవరు
మెగ్గావాట్ మొగ్గోడు... ఎలేలేలే
రఫ్ఫోడు టప్ఫోడు... ఎలేలేలే
కూసింత తిక్కోడు... ఎలేలేలే
ఇట్టా పుట్టేశాడు వాట్ టూ డూ

జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing

రెన్‌డెజ్‌వస్ మసాలా మ్యాన్ గబ్బర్
ఇస్‌కో మిలేగీ తో ఖా జావోగీ చక్కర్
బాంగే దేశీ రాక్ జాజ్ కోయీ భాంగ్డా
ఇస్‌కో జైసే నహీ బన్ కోయీ పగ్‌డా
నహీ పాయా కభీ ఐసే జైసా కింగ్
దట్స్ వై దే కాల్ హిమ్ గబ్బర్‌సింగ్

మన ఫేసు పిచ్చ క్లాసు.. మన పంచ్ ఊర మాసు
ఏ డేంజెరైనా సరే ఎదురెళతాయి.. మనలో గట్సు
మన ఒంటిమీద డ్రెస్సు.. నిప్పుకు గాలిలాంటి ప్లస్సు
చెమడాలు ఒలిచి ఉతికారేస్తాది.. గాడ్ ప్రామిస్సు
రయ్యంటూ రైడింగూ... ఎలేలేలే
తుఫానై కుమ్మింగు... ఎలేలేలే
తూటాలా స్ట్రయికింగు... ఎలేలేలే
వీడి పోలీసింగే రూల్సు బ్రేకింగు

జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing 


ఆదివారం, ఏప్రిల్ 16, 2017

లాయి లాయి మై హూ జులాయి...

జులాయి సినిమాలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జులాయి (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామజోగయ్యశాస్త్రి
గానం : సుచిత్ సురేశన్, ప్రియ హిమేష్

నానేడ పుడితే నీకేటన్నాయ్...
నానెట్టగుంటే నీకేటన్నాయ్
నానేటిసేత్తే నీకేటన్నాయ్...
సిర్రాకు పెట్టకన్నాయ్
నే దమ్ము కొడితే నీకేటన్నాయ్...
నే డప్పు కొడితే నీకేటన్నాయ్
నే కన్నుకొడితే నీకేటన్నాయ్...
కొట్టానో పళ్లురాల్తాయ్
నా షర్టుకెన్ని బొత్తాలున్నాయ్...
ఒంటికెన్ని టీకాలున్నాయ్
నా జీన్స్‌కెన్ని కన్నాలున్నాయ్...
సెల్ నంబర్‌కెన్ని సున్నాలున్నాయ్
మా నాన్నకెన్ని బాకీలున్నాయ్...
చెల్లికెన్ని రాఖీలున్నాయ్
ఈ తిక్క తిక్క ప్రశ్నలన్ని తొక్కేసెయ్
నేనో పక్క జులాయ్ ఐతే నీకేంటన్నాయ్

ఉల్లాయి లాయి మై హూ జులాయి 
ఉల్లాయి లాయి మై హూ జులాయి
ఉల్లాయి లాయి మై హూ జులాయి
ఉల్లాయి లాయి మై హూ జులాయి

ఏ పోస్టరెనక ఏ బొమ్ముందో...
ఏ ప్లాస్టరెనక ఏ దెబ్బుందో
ఏ బంతి ఎనక ఏ సిక్సరుందో...
కొట్టాకే చూడగలవు
ఏ లేబులెనక ఏ సరుకుందో...
ఏ టేబులెనక ఏ సొరుగుందో
ఎహే ముట్టకుండా చెయ్యెట్టకుండా
నువ్వెట్టా చెప్పగలవు
తెల్లగుంటె జున్ను కాదూ...
నల్లగుంటే మన్ను కాదూ
మెరిసిపోతే గోల్డు కాదూ...
మాసిపోతే ఓల్డు కాదూ
పై లుక్కు చూసి లెక్కలేస్తే తప్పన్నాయ్
నన్ను ఆరా తియ్యడాలు మానెయ్యన్నాయ్

ఉల్లాయి లాయి మై హూ జులాయి 
ఉల్లాయి లాయి మై హూ జులాయి

నా పేరు పిప్పరమెంటు నా ఒళ్లంతా కరెంటు
నా షేపే ట్రంపెట్టు నా చూపే బుల్లెట్ట్టు
అరె... సక్కెరకన్నా స్వీటు
నా లిక్కరుకన్నా ఘాటు
నా ఫేసే ఫ్లడ్‌లైటుఎలిగిస్తా మిడ్‌నైటు
హే... ఊరంతా గందరగోళం
రాత్రైతే రంగుల మేళం
సీకటి సిందుల గజ్జెల తాళం నాలో హైలైటు
ఉల్లాయిలాయి రావో జులాయి...
ఉల్లాయిలాయి సూపిస్తా హాయి...

నీ లెక్కకేమొ నే బే వార్సు...
నా లెక్కలోన నే ఏ క్లాసు
నీ గోల నీది నా గొడవ నాది
మనకెందుకంట క్లాషు
నేనెటెళ్తాంది నాకే తెల్సు
నీ చూపుకేమొ అది టైం పాసు
ఏ లెన్సు పెట్టి నువు చూడగలవు
నా సీరియస్‌నెస్సూ
టెన్తు ఫెయిల్ మరి టెండూల్కర్
క్రికెట్ మాస్టరయిపోలేదా
పేపర్‌బాయ్ టు ప్రెసిడెంటు
అబ్దుల్ కలాము కథ వినలేదా
ఎవడి ఫేటు ఏటవుద్దొ జాంతా నై
అది తేల్చాలంటే నువు సరిపోవన్నాయ్

ఉల్లాయి లాయి మై హూ జులాయి
ఉల్లాయి లాయి మై హూ జులాయి 

 

శనివారం, ఏప్రిల్ 15, 2017

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్...

ఈ రోజు కిల్లర్ సినిమాలోని టైటిల్ సాంగ్ తలుచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కిల్లర్ (1992) 
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, చిత్ర 

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్
హహ హా... హహ హా... హహ హాహాహా..

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్
ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా
ఓయ్ నువ్వే నా కిల్లర్.. హోయ్ my name is eeswar
హోయ్ నువ్వే నా కిల్లర్.. my name is eeswar

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్

నా జీవితం ఇది ఓ నాటకం
విధితో విధిగా పోరాటం
నా సంతకం యమ ప్రాణాంతకం
విలనే అననీ ఈ లోకం
యముడుకి పాశం తగిలించే మొనగాడిని
మదనుడి బాణం విరిచేసే మగవాడిని
అదిసరి నీ పనిసరిలే చెలి దరిలో
you are my love king.. I have a liking..
you are my love king.. I have a liking..

ఆటల్లో పాటల్లో నవ్వించి కవ్వించు అంకుల్
ఊకొట్టి జోకొట్టి ఊరెళ్ళిపోతాడు టింకుల్
అందుతున్న మేనమామ అందగానే చందమామ
you are my lover.. my name is eeswar..
హో you are my lover.. my name is eeswar..

నా డ్యాన్సులో తొలి రొమాన్సులో
జతిని రతిని నేనంట
నా వేటలో చలి సయ్యాటలో
ఎరనై ఎదుటే నేనుంటా
నెమలికి పింఛం పురివిప్పే నటరాజుని
రమణికి అందం పులకించే రసరాజుని
కథాకళిలో మణిపురిలో కలయికలో
నీ చూపే వింటర్ నా ముద్దే కౌంటర్
హో నీ చూపే వింటర్ నా ముద్దే కౌంటర్

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్ యా
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్
ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా
ఓయ్ నువ్వే నా కిల్లర్... my name is eeswar
హోయ్ నువ్వే నా కిల్లర్.. హోయ్ my name is eeswar

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్


శుక్రవారం, ఏప్రిల్ 14, 2017

ఈ తూరుపూ ఆ పశ్చిమం...

పడమటి సంధ్యారాగం చిత్రం టైటిల్ సాంగ్ ను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పడమటి సంధ్యారాగం (1986)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే...

you avakay me ice cream
this is the hot and sweet loves dream
united streets of hearts we have
like indian namasthe

ఆకశంలో తారా సుడిగాలికారని దీపం
గుడిలేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే

సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం
అలిసేది కాదనురాగం ఈ జన్మ సంగీతం..

గ్రహణాలు లేనీ ఆ తారలన్నీ...గగనాన కలిసీ ఈ వేళలోనే
కలిసింది ఈ బంధం...కలిసింది ఈ బంధం

ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే

ఛైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూసే

ఏడేడు రంగుల దీపం ఆ నింగిలో హరితాపం
అరుణాల రుధిరంతోనే ఋణమైనదీ ప్రియబంధం

ఏ దేశమైనా ఆకాశమొకటే...ఏ జంటకైనా అనురాగమొకటే..
అపురూపమీ ప్రణయం.... అపురూపమీ ప్రణయం

ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే

you avakay me ice cream
this is the hot and sweet loves dream
united streets of hearts we have
like indian namasthe


గురువారం, ఏప్రిల్ 13, 2017

ఆడాళ్ళూ.. మీకు జోహార్లు...

ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆడాళ్ళు మీకు జోహార్లు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

ఆడాళ్ళూ.... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళూ... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళూ.... మీకు జోహార్లు

ఒకరు దబ్బ పండు
ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం
ఒకరిది కానరాని తియ్యదనం
ఒకరు దబ్బ పండు
ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం
ఒకరిది కానరాని తియ్యదనం
ఇద్దరి మంచితనం
నాకు ఇస్తుంది ప్రాణం
ఇది తలచుకుంటే
మతిపోతుంది ఈదినం

ఆడాళ్ళూ.... మీకు జోహార్లు

రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం

ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మార్చుకోవడం
ఇదే పనా మీకూ... ఇందుకే పుట్టారా

ఆడాళ్ళూ.... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళూ.... హ హ హ హ...
 

బుధవారం, ఏప్రిల్ 12, 2017

బాషా చూడు భాషా చూడు...

రజనీకాంత్ కి ఉన్న ఇమేజ్ ని పదింతలు చేసి తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెంచిన భాషా చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భాషా (1995)
సంగీతం : దేవా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు

బాషా బాషా బాషా బాషా
హే బాషా చూడు బాషా చూడు
సింగం లాంటి నడక చూడు
వెంట వచ్చు సైన్యం చూడు
పలనాటి బాల చంద్రుడి
పౌరుషమే ఉంది చూడు
బొబ్బిలి పులిగ జబ్బ చరిచి
వచ్చే ఆ తెగువ చూడు
ధర్మ సంస్థాపనకై
యుగపురుషుడు వచ్చినాడురా

ఉహహహహ..
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా  

బాషా చూడు బాషా చూడు
ఉక్కు వంటి గుండె చూడు
ఉప్పెనంటి మనిషి చూడు
రగులుతున్న అగ్ని నగం
పగల పొగల సెగలు చూడు
గూండాలకూ దాదాలకూ
బాషా సింహ స్వప్నం చూడు
న్యాయం కోసం దేవుడికైనా
ఎదురు తిరుగు ధైర్యం చూడరా

ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా  
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా  

హే బాషా చూడు బాషా చూడు
బొంబాయి నేలు రాజా చూడు
లోకం వెంట వచ్చెను చూడు
కాలం ఆగి చూసెను చూడు
నింగే వంగి మొక్కెను చూడు
చుక్కలంటే మేడలైనా
బాషాకే తలవంచెను చూడు
కోట్లైనా నోట్లైనా బాషా ముందుకు
వచ్చెను చూడరా

ఆహహహ
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా  
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా  


మంగళవారం, ఏప్రిల్ 11, 2017

నాగమల్లివో తీగమల్లివో

ఈ రోజు నాగమల్లి సినిమాలోని టైటిల్ సాంగ్ తలుచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాగమల్లి (1980)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి
నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి

వీణల్లే పాడు జాణల్లే ఆడు
రసధునివై నీవు నాలోనా
ఊగాలీ రాగ డోలా
నీలో నాదాలు ఎన్నో విన్నాను
పరువపు వేణువులీవెళా
నువ్వేనా రాసలీల
నేను వేణువై నిను వరింపగా
అలిగిన అందెల సందడిలో

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి

నువ్వే నా ఈడు నవ్వే నా తోడు
కలిసిన కాపుర మీవేళ
కావాలి నవ్య హేల
నీలో అందాలు ఎన్నో గ్రంధాలు
చదివిన వాడను ఈ వేళా
నువ్వే నా కావ్య మాలా
పువ్వు పువ్వున పులకరింతలే
విరిసెను మన చిరు నవ్వులలో

నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
ఓ... నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ...
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ... 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.