శుక్రవారం, జూన్ 05, 2020

మా పెరటి జాంచెట్టు...

పెళ్ళిసందడి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ట్రయాంగిల్ లవ్ లో రెండు ప్రేమ కథలని చూపించే ఈ పాటలో ఎక్కడో జరుగుతున్న అల్లుడు గారి సంగీత పాఠాల ప్రేమకథకి ఇక్కడ అమ్మాయి గారి పాటని జతకలుపుతూ రాఘవేందర్రావ్ గారి చిత్రీకరణ మామూలుగా ఉండదు. ఇక ఇలాంటి పాటలో ఆయన మార్క్ షాట్స్ ని వదిలేస్తారా అందుకే వాటికీ కొదవే ఉండదు. కీరవాణి గారి సింపుల్ సంగీతం హాయిగా ఉంటుంది. మీరూ చూసీ వినీ ఆనందించండి.
  

చిత్రం : పెళ్ళిసందడి (1996) 
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : వేటూరి  
గానం : బాలు, చిత్ర 

కాబోయే శ్రీవారికీ... ప్రేమతో.
రాసి పంపుతున్న 
ప్రియ రాగాల ఈ లేఖ.

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ 
నీ కొసం ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదరైన రాక 
మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది 
ఏ నాడని... అంటూ.

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే

Yes you are my dream girl 
నా కలల రాణి నా కళ్ళ ముందుంది
అద్భుతం హహ అవును అద్భుతం. 
మన కలయిక అద్భుతం.
ఈ కలయిక ఇలాగే వుండాలి ... 
promise... promise...

నిన్ను చూడందే పదే పదే పడే యాతన
తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా

చూసే కన్నుల ఆరాటం 
రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి 
నీ రాక కొసం వేచి వున్న 
ఈ మనసుని అలుసుగ 
చూడకనీ... అంటూ...

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ 
నీ కొసం ఎదురే చూసే

పెళ్ళి చూపుల్లొ నిలేసినా కధేవిటొ మరీ
ఙ్నాపకాలల్లొ చలేసిన జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లా ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ
తప్పులు రాస్తే మన్నించు 
తప్పక దర్శన మిప్పించు
యెదటో నుదుటో ఎచటో మజిలీ. 
నీ మీద ప్రాణం నిలుపుకున్న 
మా మనవిని విని 
దయచేయమనీ... అంటూ...

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ 
నీ కొసం ఎదురే చూసే

సపమ నిప గాగా మా రీ సాస 
నిస రిస రిపగా
సపమ నిప గాగా మా రీ సాస 
నిస రిస రిమగా 
 
 

4 comments:

రాఘవేంద్రరావుగారంటే..రాఘవేంద్రరావు గారంతే..

హహహ అంతేనండీ మరో మాట లేదు వారికి సాటి రారు.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..

srikanth garu you have become our lyrics jamchettu

హహహ బిగ్ కాంప్లిమెంట్ సర్. ఆ మధుర ఫలాలనిచ్చిన జామచెట్టు వేటూరి వారూ ఇంకా తెలుగు ఇండస్ట్రీనేనండీ నేను వాటిని ఒకచోట పేరుస్తున్న సేవకుడిని మాత్రమే. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ సర్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.