బుధవారం, జూన్ 17, 2020

పువ్వుల్లో దాగున్న...

జీన్స్ చిత్రం కోసం ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో ప్రపంచం లోని ఏడు అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో మొదలయ్యే ఈ పాట మొదట్లో వచ్చే ఓ ఐ ని(wo ai ni) అంటే చైనా భాషలో ఐలవ్యూ అని అర్థమట.  

 
చిత్రం : జీన్స్ (1998)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : శివ గణేష్
గానం : సుజాత, ఉన్నికృష్ణన్

ఓ ఐ ని... ఓ ఐ ని... ఓ ఐ ని...  
ఓ ఐ ని... ఓ ఐ ని... ఓ ఐ ని... 
ఓ ఐ ని... ఓ ఐ ని... ఓ ఐ ని... 

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే... అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం

ఆ గిరులు... ఈ తరులు...
ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ..
పదహారు ప్రాయాన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం..ఓ...

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే... అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం..

తారారరరా....తారారరరా....తారారరరా...రా... ఓ...
తారారరరా...తారారరరా....తారారరరా...రా... ఓ...

ఏ వాసనలేని కొమ్మలపై...
సువాసన కలిగిన పూలున్నాయి
పూలవాసనతిశయమే...
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో...
ఒక చిటెకడైనా ఉప్పుందా
వాన నీరు అతిశయమే...

విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా...
వెలిగేటి మిణుగురులతిశయమే
తణువున ప్రాణం ఏ చోటనున్నదో...
ప్రాణంలో ప్రేమ ఏ చోటనున్నదో...
ఆలోచిస్తే అతిశయమే

ఆ గిరులు... ఈ తరులు... 
ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం..ఓ...

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే... అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం

అల వెన్నెలంటి ఒక దీవి 
ఇరు కాళ్ళంట నడిచొచ్చే 
నీవే నా అతిశయమూ
జగమున అతిశయాలు ఏడేనా... 
ఓ మాట్లడే పువ్వా నువు... 
ఎనిమిదొవ అతిశయమూ..
నింగిలాంటి నీ కళ్ళూ...
పాలుగారే చెక్కిళ్ళు... 
తేనెలూరే అధరాలు 
అతిశయమూ

మగువ చేతివేళ్ళు... అతిశయమే
మకుటాల్లాంటి గోళ్ళు... అతిశయమే
కదిలే వంపులు... అతిశయమే...

ఆ గిరులు... ఈ తరులు... 
ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం 

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే... అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం
తారారరరా...తారారరరా....తారారరరా...రా... ఓ..
తారారరరా....తారారరరా...తారారరరా...రా... ఓ.. 
 
 

2 comments:

అందమైన పాట..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.