శుక్రవారం, నవంబర్ 29, 2019

ధన్యోహం ఓ శబరీశా...

అయ్యప్ప స్వామి మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అయ్యప్పస్వామి మహత్యం (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు 

ధన్యోహం ఓ శబరీశా..
ధన్యోహం ఓ శబరీశా..

ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా

ఉత్తుంగ శబరిగిరి శృంగ
నిత్య నిస్సంగమంగళాంగ
పంపాతరంగ పుణ్యానుషంగ
మునిహృదయ జలజ భృంగ

ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా

బ్రహ్మచారినై భక్తియోగినై
ద్వంద్వము అన్నది వీడి
విగతకామినై మోక్షగామినై
తాపత్రయమును విడిచి
కన్నెసామినై కర్మధారినై
కాలాంబరములు తొడిగి
నీ దరి చేరితి నీలగిరీశా
బంధము తెంచితి పందళవాస

ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా

శరణం శరణం భవతరణ
శబరిగిరీశా అయ్యప్ప
శుభదం సుఖదం నీ చరణం
హరిహరపుత్ర అయ్యప్ప
అయనరేఖల సంగమవేళ
మిధ్యావాదపు వధ్యస్థలిలో
శూన్యజగతిలో సూక్ష్మ పరిధిలో
నికరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచర సృష్టిదీపమై
మకరజ్యోతిగ వెలిగేది
నీ మహిమ ఒక్కటే అయ్యప్పా
ఈ మహికి దేవుడే అయ్యప్పా

స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
శబరిగిరీశా ధన్యోహం శబరిగిరీశా ధన్యోహం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం 
 

4 comments:

థాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ సర్..

స్వామిని చూస్తున్నట్టే ఉంది పాట వింటుంటే..

అవునండీ చక్కని పాట... థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.