గురువారం, జూన్ 20, 2019

మువ్వలన్ని ముళ్ళల్లె...

కెప్టెన్ నాగార్జున చిత్రంలోని ఒక పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కెప్టెన్ నాగార్జున్ (1986)
సంగీతం : కె.చక్రవర్తి
సాహిత్యం : ఆత్రేయ
గానం : యస్.పి.బాలు, పి.సుశీల
 
ఝనకు ఝనకు ఝన్ ఝన్ జతిలో
దినకు దినకు దిం దిం లయలో

మువ్వలన్ని ముళ్ళల్లె అయ్యొ గుచ్చుకున్నాయీ
పువ్వులంటి పాదాలు అమ్మో నొచ్చుకున్నాయీ
ఆ గాయాలన్ని చల్లని వేళా
వలపుల సలుపులు పెడతాయీ
వలపుల సలుపులు పెడతాయీ

మువ్వలన్ని ముళ్ళల్లె అయ్యొ గుచ్చుకున్నాయీ
పువ్వులంటి పాదాలు అమ్మో నొచ్చుకున్నాయీ


యెన్ని చుక్కలున్నాయీ యెన్ని దిక్కులున్నాయీ
అన్ని నా కళ్ళుగా నిన్నే చూడాలిగా
వేయి కన్నులున్నాయీ కోటి చూపులున్నాయీ
నాకు అందాలుగా నీకు బంధాలుగా

ఆ బంధాలె ఒక వరం గా
నీ అందాలె మధులీనం గా
ఏన్నో వసంతాలుగా
నీకై తపించానుగా

ఆ తాపాలన్నీ మాపటివేళ
తలుపులు తడితే యెట్లాగా
తలుపులు తడితే యెట్లాగా

మువ్వలన్ని ముళ్ళల్లె అయ్యొ గుచ్చుకున్నాయీ
పువ్వులంటి పాదాలు అమ్మో నొచ్చుకున్నాయీ

ఆ గాయాలన్ని చల్లని వేళా
వలపుల సలుపులు పెడతాయీ
వలపుల సలుపులు పెడతాయీ

మువ్వలన్ని ముళ్ళల్లె అయ్యొ గుచ్చుకున్నాయీ
పువ్వులంటి పాదాలు అమ్మో నొచ్చుకున్నాయీ

ఎన్ని మొక్కులున్నాయీ ఎన్ని ముడుపులున్నాయీ
అన్ని నీకివ్వగా దాచి వున్నానుగా

ఎన్ని ఆశలున్నాయీ అన్ని కాచుకున్నాయీ
వేళ రావాలిగా అన్ని తీరాలిగా
నీ ప్రేమె ఒక జ్వరంగా
నీ పేరె ఒక జపంగా

కలలే దగా చేయగా
చలిలో సెగైనానుగా
ఆ సెగలు వగలు
పగలు రేయి దిగులైపోతె యెట్లాగ
దిగులైపోతె యెట్లాగ


మువ్వలన్ని ముళ్ళల్లె అయ్యొ గుచ్చుకున్నాయీ
పువ్వులంటి పాదాలు అమ్మో నొచ్చుకున్నయీ
ఆ గాయాలన్ని చల్లని వేళా
వలపుల సలుపులు పెడతాయీ

వలపుల సలుపులు పెడతాయీ 

ఝనకు ఝనకు ఝన్ ఝన్ జతిలో
దినకు దినకు దిం దిం లయలో 

 

2 comments:

పిక్ చాలా బావుందండి..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.