బుధవారం, మే 29, 2019

ఏమాయ చేసిందో...

వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి చిత్రంలోని ఒక సరదా అయిన చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. సినిమాల వల్ల కొన్ని మంచి మంచి ట్యూన్స్ పాపులర్ అవకుండా తెరమరుగువుతుంటాయ్. ఇది అలాంటి ఓ క్యాచీ ట్యూన్. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి (2019)
సంగీతం : హరి గౌర  
సాహిత్యం : బాలాజి
గానం : హరి గౌర

ఏమాయ చేసిందో
ఏమంత్రం వేసిందో
చూపుల్తో తీసిందే ప్రాణం
ఊరించే ఆ అందం
ఊహల్లో ఆనందం
గుండెల్లో గుచ్చిందే బాణం

ఆ కులుకే ఓ చురకై
ఈ గొడవే తెచ్చిపెట్టిందే
ఆ హొయలే ఓ రైలై
లోలోపల కూతే పెట్టిందే
చల్లేసి పోయిందే ఆ సోయగాలు
పిండేసినట్టుందే ఒంట్లో నరాలు
పెట్టేసి పోయిందే బుగ్గ సంతకాలు
కట్టేసినట్టుందే ఈ సంతోషాలూ

ఏమాయ చేసిందో
ఏమంత్రం వేసిందో
చూపుల్తో తీసిందే ప్రాణం
ఊరించే ఆ అందం
ఊహల్లో ఆనందం
గుండెల్లో గుచ్చిందే బాణం

నోరంతా ఊరేటట్టు
ఉంటాదే నీతో జట్టు
ఆ కట్టు బొట్టూ చూస్తుంటే
నీ గుట్టే తేనెపట్టు
తింటామే కాస్త పెట్టు
దూరంగా పోమాకే ఒట్టూ
ఏ మందు చల్లేశావో
నీలో అందం తీసి
మాకోసం పుట్టావే రాకాసీ
ఏ తిండీ తిప్పల్లేవు
నీపై కన్నే వేసీ
కళ్ళన్నీ తిప్పావే నీకేసి
ఎదుటే పడితే చిలకా
ఎదలో పడదా మెలిక
వలలే విసిరి మాపై
కలలో కలిసి ప్రేమై

ఏమాయ చేసిందో
ఏమంత్రం వేసిందో
చూపుల్తో తీసిందే ప్రాణం
ఊరించే ఆ అందం
ఊహల్లో ఆనందం
గుండెల్లో గుచ్చిందే బాణం 

 

2 comments:

నైస్ సాంగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.