సోమవారం, మే 20, 2019

ప్రియతమా ప్రియతమా...

మజిలి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మజిలి (2019)
సంగీతం : గోపీసుందర్     
సాహిత్యం : చైతన్య ప్రసాద్ 
గానం : చిన్మయి శ్రీపాద

ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమా
చిలిపి నీ తలపులో
తెలిసినది వలపులో మధురిమా
చెలి చూపు తాకినా
ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా
దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైనచుక్కరా చక్కనైనచుక్కరా
నిన్ను కోరుకుందిరా సుందరా

ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమా
చిలిపి నీ తలపులో
తెలిసినది వలపులో మధురిమా

నీ ప్రేమలో ఆ రాధనై
నే నిండుగా మునిగాకా
నీ కోసమే. రాశానుగా
నా కళ్లతో ప్రియలేఖ
చేరునో చేరదో
తెలియదు ఆ కానుక
ఆశనే వీడకా వెనుక పడెను
మనసు పడిన మనసే

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా

ఉన్నానిలా ఉంటానిలా
నీ నీడగా కడదాకా
కన్నీటిలో కార్తీకపు
దీపాన్నిరా నువులేక
దూరమే భారమై
కదలదు నా జీవితం
నీవు నా చేరువై నిలిచి మసలు
మధుర క్షణములెపుడో

ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమా
చిలిపి నీ తలపులో
తెలిసినది వలపులో మధురిమా
చెలి చూపు తాకినా
ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా
దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైనచుక్కరా చక్కనైనచుక్కరా
నిన్ను కోరుకుందిరా సుందరా

2 comments:

బ్యూటిఫుల్ మూవీ..సమంత..నో వర్డ్స్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. అవునండీ ఈ సినిమాకి సమంతానే ఆయువుపట్టు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.