గురు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గురు (1980)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ ?
గానం : బాలు
ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు
ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు
మనసులు తెల్లనివి
మీ తలపులు తీయనివి
ఆ దేవుని జేగంటలూ
ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు
మీరేరా మా దీపాలు
ప్రమిదలు మీ బ్రతుకులు
చెరగని అవి వెలుగులు
మీరేరా మా దీపాలు
ప్రమిదలు మీ బ్రతుకులు
చెరగని అవి వెలుగులు
కోపం వస్తే ప్రాణాలు
కూరిమికిచ్చే ప్రాణాలు
పాపలూ బాబులు
దేవుని జేగంటలు
ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు
చరితంటే మన చేతలనీ
ప్రతి పని మన ప్రగతని
అనుకొని మనమొకటనీ
పాతేయండీ స్వార్ధాన్ని
పాలించండీ దేశాన్ని
పాపలూ బాబులూ
దేవుని జేగంటలూ
ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు
మనసులు తెల్లనివి
మీ తలపులు తీయనివి
ఆ దేవుని జేగంటలూ
ఆడండీ పాడండీ
అల్లరి పసి పువ్వులు
2 comments:
ఈమూవీ లో అన్ని పాటలూ చాలా చాలా బావుంటాయి..
అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.