శనివారం, ఏప్రిల్ 27, 2019

స్నేహానికన్న మిన్న...

ప్రాణస్నేహితులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రాణస్నేహితులు (1988)
సంగీతం : రాజ్ కోటి
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు

స్నేహానికన్న మిన్న
లోకాన లేదు రా
స్నేహానికన్న మిన్న
లోకాన లేదు రా
కడదాక నీడ లాగ
నిను వీడి పోదు రా
నీ గుండెలో పూచేటిది
నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేను రా

స్నేహానికన్న మిన్న
లోకాన లేదు రా

తుల తూగే సంపదలున్నా
స్నేహానికి సరి రావన్నా.. ఓ..
పలుకాడే బంధువులున్నా
నేస్తానికి సరి కారన్నా
మాయా మర్మం తెలియని చెలిమే
ఎన్నడు తరగని పెన్నిధిరా
ఆ స్నేహమే నీ ఆస్తి రా
నీ గౌరవం నిలిపేను రా
సందేహమే లేదు రా

స్నేహానికన్న మిన్న
లోకాన లేదు రా
కడదాక నీడ లాగ
నిను వీడి పోదు రా

త్యాగానికి అర్ధం స్నేహం
లోభానికి లొంగదు నేస్తం
ప్రాణానికి ప్రాణం స్నేహం
రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది
నిర్మలమైనది స్నేహము రా
ధ్రువతారలా స్థిరమైనదీ
ఈ జగతిలో విలువైనదీ
ఈ స్నేహమొకటేను రా

స్నేహానికన్న మిన్న
లోకాన లేదు రా
కడదాక నీడ లాగ
నిను వీడి పోదు రా
నీ గుండెలో పూచేటిది
నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేను రా 


2 comments:

చాలా అర్ధవంతమైన పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.