సోమవారం, జులై 09, 2018

యాయిరే యాయిరే...

రంగేళి (రంగీలా) చిత్రం నుండి అప్పటి కుర్రకారును ఒక ఊపు ఊపేసిన హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రంగేళి (రంగీలా) (1995)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : జానకి

రంగేళీ రే..
యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే..

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే..

జనమందరిలో మనమెవరంటే
తెలిసుండాలి ఒక విలువుండాలి
ఘనచరితలు గల కొందరిలో
మన పేరుండాలి తగు ప్లేసుండాలి
నలుగురూ గొప్పగా చూడగా
ప్రతిదినం కొత్తగా ఉండగా
బతకడం అప్పుడే పండుగా

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే..


లోకంలోనే ఉంటూ చుట్టూ బతుకును చూస్తూ
జీవించటమంటేనే తెలియనివాళ్ళను చూస్తే జాలి
కనిపించని తలరాత అరచేతుల్లో గీత
బతుకును నడిపిస్తాయని
నమ్మే వాళ్ళను ఏం చెయ్యాలి?
ఊరికే ఊహలో ఉండక
నిజముగా మార్చుకో కోరిక
నింగిలో నిలిచిపో తారగా

యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే
యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజూ రంగేళిలే.. రంగ్ రంగ్ రంగేళిలే.. 
రంగేళీ..రే.. 


2 comments:

ఊర్మిళ అంటే జనం క్రేజ్య్ గా చూసే రోజుంటందని యెప్పుడూ అనిపించలేదండి..అంతా రాముగారి మహిమ..

నిజమేనండీ.. అప్పట్లో ఎంత మంచి సినిమాలు తీసేవాడో..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.