మంగళవారం, జులై 03, 2018

ఏ ఊహలోనో...

శివ 2006 చిత్రంలోని ఒక మంచి మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శివ 2006 (2006)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం: శ్రేయా ఘోషల్ , విజయ్ ప్రకాష్

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో
నా కళ్ళలో మెరిసే కాంతులూ
ఇన్నాళ్ళలో లేవే ఎన్నడూ
ఈ క్షణం ఇదేమిటో
మాయో హాయో తేలని

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో
మురిసే మనసు అడగదు ఏమయిందో
మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో
మురిసే మనసు అడగదు ఏమయిందో

నీలాల నీకళ్ళ లోతుల్లో మునిగాక తేలేదెలాగో మరి
వేవేల వర్ణాల తారల్ని తాకందే ఆగేనా ఈ అల్లరీ
ప్రియమైన బంధం బిగించే వేళలో
జతలోన అందం తరించే లీలలో
ఈ నేల పొంగి ఆ నింగి వంగి
హద్దేమి లేనట్టు ముద్దాడుకున్నట్టు !

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

నీలో నాలో ..ఆ .. ఆ
నీలో నాలో తరగని తలపుల దాహం
నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం
నీలో నాలో తరగని తలపుల దాహం
నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం

అణువు అణువు నిలువెల్ల రగిలించి కరిగించు కౌగిళ్ళలో
తాపాల దీపాలు వెలిగించి వెతకాలి నాలోని నువ్వెక్కడో
ఏ సూర్యుడో మనని లేపే లోపుగా
ఈ లోకమే మరచి పోదాం కైపుగా
ఏ కంటిచూపు ఈ జంట వైపు రాలేని
చోటేదో రమ్మంది లెమ్మంటు !

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో
నా కళ్ళలో..
నా కళ్ళలో
మెరిసే కాంతులూ
ఇన్నాళ్ళలో..
ఇన్నాళ్ళలో
లేవే ఎన్నడూ
ఈ క్షణం ఇదేమిటో
మాయో హాయో తేలని

ఏ ఊహలోనో తేలానేమో
ఓ వింత లోకం చేరానేమో

2 comments:

యాక్టింగ్ లో కన్నా..పాటలను బట్టీ ఆర్.జి.వి హీరోయిన్..

హహహ కరెక్ట్ గా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.