మంగళవారం, జులై 17, 2018

అమ్మ అమ్మ మన ముంగిట్లో...

ప్రేమాలయం (హమ్ ఆప్ కే హై కౌన్) చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమాలయం (1995)
(హమ్ ఆప్ కే హై కౌన్)
సంగీతం : రామ్ లక్ష్మణ్
సాహిత్యం : వెన్నలకంటి
గానం : చిత్ర

అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి
అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి
యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది

అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి
యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది

చందామమే తలపైనే ఉన్నవాడే నా మొగుడే
చందామమే తలపైనే ఉన్నవాడే నా మొగుడే

ఈశుని కోరి తపసే చేసి ఔతా అతని అర్ధాంగి
ఆశ తీర అతనిని చేర పొంగును నేల నింగి
ఆ పరమేశుని విభూతి పూతై
ఆ పరమేశుని విభూతి పూతై తరీయించాలని ఉంది
యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది

కన్నె మొజులే సన్న జాజులై విచ్చెను నేటికి ఇలా
అందరొక్కటై చిందులేయగా పండును కమ్మని కల

మనసే పడిన వాడితో నాకు పెళ్లే జరిపించాలి
వెండి కొండల వేలుపు గుండెల నిండుగ నేనుండాలి
ఈ చేతి నిండా గోరింట పండి
ఈ చేతి నిండా గోరింట పండి మదిలో వలపులు నిండి
యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది

అమ్మ అమ్మ మన ముంగిట్లో కూసెను నేడో కాకి
యోగీశ్వరుడా శంకరుడే నా పతి ఔతాడని అంది

 

5 comments:

నైస్ సెంటిమెంటల్ సాంగ్..

హిందీ పాటకు అచ్చు గుద్దినట్లు అనువదించారు ప్రేమాలయంలోని అన్ని పాటలను.

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

థాంక్స్ స్పర్శ గారు..
థాంక్స్ పద్మార్పిత గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.