బుధవారం, జూన్ 07, 2017

కలిసే కళ్ళలోనా...

నోము సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నోము (1974)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరధి
గానం : బాలు, సుశీల

కలిసే కళ్ళలోనా.. కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా...


పెరిగీ తరిగేను నెలరాజూ
వెలుగును నీ మోము ప్రతి రోజూ
పెరిగీ తరిగేను నెలరాజూ
వెలుగును నీ మోము ప్రతి రోజూ
ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే

కలిసే కళ్ళలోనా.. కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా...

ఎదురుగ చెలికాణ్ణి చూసానూ
ఎంతో పులకించి పోయానూ
ఎదురుగ చెలికాణ్ణి చూసానూ
ఎంతో పులకించి పోయానూ
ఈ పొందు కలకాలం నే కోరేనూ


కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా...


కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ
కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ
మనలోని పరువాలు పెనవేయాలనీ

కలిసే కళ్ళలోనా... కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా


2 comments:

వావ్..వన్ ఆఫ్ మై ఫేవరెట్స్..

అవునా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail