మంగళవారం, సెప్టెంబర్ 27, 2016

ఒకసారికి ఒకసారే...

కె.వి.మహదేవన్ స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఆడాళ్ళు మీకు జోహార్లు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : జానకి

ఒకసారే... ఒకసారే...
ఒకసారికి ఒకసారే.. మళ్ళీమళ్ళీ అడగొద్దు
మొదటిసారి తియ్యదనం రద్దుచేసుకోవద్దు
అప్పుడే అది ముద్దు...
ఒకసారే... ఒకసారే...
ఒకసారికి ఒకసారే.. మళ్ళీమళ్ళీ అడగొద్దు
మొదటిసారి తియ్యదనం రద్దుచేసుకోవద్దు
అప్పుడే అది ముద్దు

సూటిగా నాటేది మొదటి చూపు...
ఏ నాటికీ వినపడేది మొదటి పలకరింపు
ఏదైనా మొదటిదే ఇంపైనది
రెండవది ఎన్నడూ కాదు మొదటిది
అందుకే అది ముద్దు...

ఒకసారే...
ఒకసారికి ఒకసారే.. మళ్ళీమళ్ళీ అడగొద్దు

మొదటి పువ్వు చెపుతుంది తీగపడే సంబరం
మొదటి మెరుపు తెలుపుతుంది మబ్బులోని నిండుదనం
మొదటి పువ్వు చెపుతుంది తీగపడే సంబరం
మొదటి మెరుపు తెలుపుతుంది మబ్బులోని నిండుదనం
మొదటి చినుకులో వుంది వాన ముమ్మరం
మొదటి చినుకులో వుంది వాన ముమ్మరం
మొదలూ తుది లేనిదే ప్రేమ లక్షణం
అందుకే అది... ముద్దు

ఒకసారే..
ఒకసారికి ఒకసారే.. మళ్ళీమళ్ళీ అడగొద్దు

ముద్దనేది ప్రేమకు మొదటి ముద్ర
ప్రేమనేది మనసునూ లేపుతుంది నిద్దుర
ముద్దనేది ప్రేమకు మొదటి ముద్ర
ప్రేమనేది మనసునూ లేపుతుంది నిద్దుర
మేలుకున్న మనసుకు మేరనేది లేదు
అది ప్రేమించేటందుకు ఈ సృష్టి చాలదు
మేలుకున్న మనసుకు మేరనేది లేదు
అది ప్రేమించేటందుకు ఈ సృష్టి చాలదు
అందుకే అది... ముద్దు .. ముద్దు

ఒకసారే...
ఒకసారికి ఒకసారే.. మళ్ళీమళ్ళీ అడగొద్దు
మొదటిసారి తియ్యదనం రద్దుచేసుకోవద్దు
అప్పుడే అది ముద్దు... అప్పుడే అది ముద్దు

2 comments:

ఇందులో పాపి కొండల వెనుక, టైటిల్ సాంగ్ కూడా చాలా బావుంటాయండి..

అవునండీ పాపికొండల పాట ఆల్రెడీ వేశాను.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail