శుక్రవారం, సెప్టెంబర్ 02, 2016

భంభం భోలే శంఖం మోగేలే...

ఇంద్ర చిత్రం కోసం మణిశర్మ సంగీతంలో సిరివెన్నెల గారు రాసిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియొ లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇంద్ర (2002)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హరిహరన్, శంకర్ మహదేవన్  

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే

దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..

విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దు లెరుగని పరుగై ముందుకు సాగనీ..

విలాసంగా శివానందలహరి 
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...

భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్
భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్

భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం
ఢమరూభాజే ఢమరూభాజే ఢమరూభాజే ఢంఢమాఢం
భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం

వారణాసిని వర్ణించే నా గీతికా
నాటి శ్రీనాధుని కవితై వినిపించగా
ముక్తికే మార్గం చూపే మణికర్ణికా
అల్లదే అంది నా ఈ చిరు ఘంటిక

నమక చమకాలై ఎద లయలే కీర్తన చేయగా
యమక గమకాలై పద గతులే నర్తన చేయగా
ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా.. ఆ.. ఆ

విలాసంగా శివానందలహరి 
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ

కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా
ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే 
మన కష్టమే తొలగిపోదా

ఏ... దందమాదం దం
దమాదం దమాదం
దందమాదం దం
దమాదం దమాదం
దందమాదం దం దందమాదం దం దందమాదం దం
దమాదందం దం దం దం

ఎదురయే శిల ఏదైన శివలింగమే
మన్ను కాదు మహాదేవుని వరదానమే..
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
చరితలకు అందనిది ఈ కైలాసమే

గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే
తరలిరండి తెలుసుకోండి కాశి మహిమా

విలాసంగా శివానందలహరి 
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడిరేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..

దద్ధినిక ధిన్ దరువై సందడిరేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..

విలాసంగా శివానందలహరి 
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ

జయహో జయహో భంభం భోలే
జయహో జయహో భంభం భోలే
జయహో జయహో భంభం భోలే
జయహో జయహో భంభం భోలే

3 comments:



భంభం బోలే శంఖము
అంభోదర మయ్యెనోయి అద్భుత గానం !
శంభో శివ శంభోయన
అంభస్సారము జిలేబి ఆనంద మదిన్ !

జిలేబి

బ్యూటిఫుల్ సాంగ్..విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ మెగా ఫాన్స్, ఇలాంటి పాటలు విన్నప్పుడు, చూసినప్పుడు చిరంజీవిని చూస్తే ఈయన మూవీస్ కే యెందుకు పరిమిత మవ్వలేదా అని బలం గా అనిపిస్తుంటుందండి..ఒకప్పటి అభిమానిగా బాధ కలుగుతుంది..

ఒకప్పటి అభిమానులు చాలామందిది ఇదే మాట శాంతి గారు.. థాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.