శుక్రవారం, జులై 08, 2016

పరిమళించు పున్నమిలో...

రాజన్ నాగేంద్ర గారు స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 

చిత్రం : పులి-బెబ్బులి (1983)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సంగీతం : వీటూరి
గానం : బాలు, సుశీల

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
ఆ..... ఆ.... ఆ....
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో

ఆ ఆ ఆ 
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది

నవ్వగనే.. నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే
తానె విరితేనై తానాలు ఆడిందిలే
నిన్ను గని.. ఎద కోయిలగ రాగాలు తీసిందిలే
నాలో ఎలమావి ఉయ్యలలూగిందిలే
చెలిమికిదే చైత్రమనీ.. నా ఆశ పూసింది..
అందాల బృందావిహారాలలో

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
అందమిదే.. మకరందమిదే.. నా జీవితానందమే
నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే
బంధమిదే.. సుమగంధమిదే.. ఏ జన్మ సంబంధమో
నాలో విరితావి వెదజల్లిపోయిందిలే
జాబిలిగా.. వెన్నెలగా.. ఈ జంట కలిసింది
కార్తిక పూర్ణిండు మాసాలలో

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో

4 comments:

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు కృష్ణం రాజు ఫాన్స్..కనులు మూసుకుని వింటే..వెన్నెలలో విహారం చేసినట్టుటుంది ఈ పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. మీ కామెంట్ అబ్బాయిలకి వర్తించదేమోనండీ జయప్రద ఉంది కదా :-)

నిజమే సుమా..పక్కనెవరున్నా జయప్రదనే కనుల నిండా నింపుకునే వీరాభిమానులకి వర్తించదండీ:-)

హహహ మరే బాగా చెప్పారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail